డిస్కస్ త్రోయర్ వికాస్‌కు కాంస్యం
న్యూయార్క్: భారత డిస్కస్ త్రోయర్ వికాస్‌గౌడ న్యూయార్క్‌లో జరుగుతున్న గ్రాండ్ ప్రీ డైమండ్ లీగ్‌లో కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పోటీల్లో వికాస్ డిస్క్‌ను 64.86 మీటర్ల దూరం విసిరి మూడోస్థానంలో నిలిచాడు.
టింటూ లూకాకు కాంస్యం
న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ టింటూ లూకా ఇటలీలో జరుగుతున్న ప్రైమో నెబియోలో మెమోరియల్ మీట్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన 800 మీటర్ల రేసును లూకా 20:02.71 సెకన్లలో పూర్తిచేసి మూడోస్థానంలో నిలిచింది. అయితే లండన్ బెర్తు కోసం ఇంతకుముందే 2:01.30 సెకన్ల‘బి’ మార్క్ స్టాండర్డ్‌ను అధిగమించిన లూకా ‘ఎ’ స్టాండర్డ్ (1:59.90 సెకన్లు)ను మాత్రం అందుకోలేకపోయింది. గత మేలో జరిగిన డైమండ్ లీగ్ సిరీస్ ఫస్ట్‌పూగ్‌లో లూకా 2:01.09 సెకన్ల సమయాన్ని నమోదు చేసింది.
Other News