
శ్వాసవ్యవస్థకు సంబంధించిన ఎలర్జీలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక్కొరకమైన ఎలర్జీకి ఒక్కోరకమైన లక్షణాలు కనిపిస్తాయి. తుమ్ములు, ముక్కుకారటం, కళ్లు, చెవులు, అంగిలిదురదగా ఉండటం, ముక్కులో మంట, ముక్కు బిగుసుకు పోవడం ఇవి మాములు జలుబు లక్షణాలే. కాని ఎడతెరిపి లేకుండా చాలా తరచుగా ఇటువంటి ఇబ్బంది ఏర్పడుతుంటే మాత్రం అది అలర్జిక్ రైనటీస్ అనే అలర్జీ అన్నమాట.
కారణం
శ్వాసకోశ ప్రక్రియలో అనేక కారణాల వల్ల ముక్కులోని మ్యూకస్ పొర విపరీతంగా స్పందించడం వల్ల ఇలా ముక్కు కారటం తుమ్ములు రావడం జరుగుతుంది. మామూలుగా అయితే దుమ్ము, ధూళీ కణాలు ముక్కులోకి ప్రవేశించినపుడు వీటిని బయటకు పంపే ప్రక్రియలో భాగంగా ఇలా తుమ్ములు వస్తాయి. కానీ ఎటువంటి కారణం లేకుండానే ముక్కులోని మ్యూకస్ పొర విపరీతంగా స్పందించి తుమ్ములు వస్తే మాత్రం అది అలర్జీ వల్ల అని అర్థం చేసుకోవాలి. వంశ పారంపర్యంగా ఆస్తమా, సైనసైటీస్, చర్మ అలర్జీ ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది.
కాలుష్య వాతావరణం వల్ల
విపరీత ఉష్ణోక్షిగత మార్పుల వల్ల , చల్లని ఆహార పదార్థాలు, చల్లని పానీయాలు తీసుకోవడం వల్ల, కొన్ని రకాల పండ్లు, పుల్లని ఆహారం తీసుకోవడం, ఏసీ గది నుంచి ఒక్కసారిగా వేడి వాతావరణంలోకి రావడం వల్ల ఈ అలర్జీ ఉన్న వారికి అటాక్ రావచ్చు.
లక్షణాలు
తుమ్ములు, ముక్కుదురద, కళ్లు చెవులు, అంగిలిదురద.
ముక్కు మంట, ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, చాలా తరచుగా జలుబు చేయడం, వీటితో పాటు చాలా నీరసంగా ఉండడం, చలిగా, జ్వరంగా ఉండడం, మగతగా కూడా అనిపిస్తుంటుంది.
నిర్ధారణ
కొంత మందిలో రక్త పరీక్షలో ఇస్నోఫిల్స్ శాతం పెరుగుతుంది
ఎక్స్‌రేలో ముక్కు లోపలి కండ ఉబ్బినట్టుగా ఉంటుంది
స్కిన్ సెన్సిటివిటి పరీక్ష వంటి వాటితో ఏ ఆహారం వల్ల అలర్జీ కలిగి ఉన్నారో తెలుసుకోవచ్చు.
నివారించవచ్చు
ఈ అలర్జీ అందరికి ఒకేలా ఉండదు. అందరికి అన్ని పదార్థాలు, పరిసర పరిస్థితులు అలర్జీ కలిగించక పోవచ్చు. అయితే ఏ సందర్భాల్లో అలర్జీ వస్తోందో చూసుకుని ఆ పరిస్థితులకు దూరంగా ఉండడం అన్నింటి కంటే మంచి నివారణ చర్యగా చెప్పవచ్చు.
హోమియో చికిత్స
అలర్జిక్ రైనసైటీస్‌కు హోమియోలో చక్కని వైద్యం అందుబాటులో ఉంది. నివారించడం మాత్రమే కాదు, సంపూర్ణ చికిత్స కూడా అందించవచ్చు
హోమియో వైద్య విధానంలో అర్సెనిక్ అల్బుమిన్ అకోనైట్, యుప్రాసియా, ఆలియం సెపా, అర్సెనికం లోడ్, హెపార్‌సల్ఫ్ వంటి ఔషధాలు పొటిన్సిలలో పాథోస్, పాసీఫ్లెరా, సనేగా, లెమ్నా మైనర్, టీఎంవీ వంటి ఔషధాల మాతృవూదావక రూపంలో మంచి గుణం కల్గిస్తుంది.
| |
|