తలనొప్పికి హోమియో పరిష్కారం

నా వయసు 16 సంవత్సరాలు. నేను విపరీతమైన తలనొప్పి, వెంట్రుకలు రాలటం, నెలసరి నొప్పితో బాధ పడుతున్నాయి. కాస్త ఎండలో వెళ్లినా, ఫంక్షన్‌కు వెళ్లినా కణతలలో నొప్పి, వికారం వాంతులు అవుతుంటాయి. నాకు సరైన మందు సూచించగలరు.

-రాధ, మెదక్


homeopathyకాలుష్యం కారణంగా, దుమ్ము, ధూళి, వల్ల చుండ్రు, వెంట్రుకలు రాటడం జారుగుతుంది. జన్యుపరమైన కారణాలు, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, విపరీతమైన జ్వరం వచ్చి తగ్గిన తర్వాత వెంట్రుకలు రాలడం జరుగుతుంది. చుండ్రు తలదురద, వెంట్రుకలు చిక్కువడడం, వెంట్రుక చివరలు చీలడం వంటి లక్షణాలు, వాటి కారణాలను తెలుసుకొని వ్యాధి లక్షణాలు. శరీరతత్వం రెండింటి పరిశీలించి హోమియో వైద్యం పని చేస్తుంది. మీరు నాట్రం మూర్ 30 పొటెన్సీ వారానికి రెండు రోజులు ఉదయం ఒకడొసు వేసుకోండి దగ్గర్లోని హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిది.

నా వయసు 55 సంవత్సరాలు. నాకు గత సంవత్సరం నుంచి మోకాళ్ల నొప్పులు కూర్చుని లేచేటపుడు ఎక్కువగా ఉంటాయి. ఉదయం నిద్ర లేచినపుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాస్త దూరం నడిస్తే మెట్లు ఎక్కినపుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. మోకాళ్లలో వాపులు మంటలు వేడి ఉంటుంది. పిక్క నొప్పి పట్టేసినట్టుంది. నా బాధలు సరయిన హోమియో చికిత్స తెలుపగలరు?

జమ్మికుంట
మీ వ్యాధి లక్షణాలు ఆస్టియోఆర్థ్రరైటీస్ అంటారు. వయసు, శరీర బరువు, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రకమైన బాధలతో బాధపడుతుంటారు. ఎముకలలో ఉన్న కార్టిలేజ్ అరగడం వల్ల మరియు సైనూవియల్‌ఫ్లూయిడ్ తగ్గడం వల్ల ఈ రకమైన వ్యాధి కనబడుతుంది. మీరు శరీర బరువు తగ్గించడం, ఎక్కువగా కింద కూర్చోకూడదు. మెట్లు ఎక్కడం తగ్గించాలి. ఫిజియోతెరపీ చేయించుకోవాలి. మాంసం, నూనె, నెయ్యి తగ్గించాలి. హోమియో వైద్యంలో రుస్టాక్స్ 30 పొటెన్సీ రోజు ఉదయం ఒక డోసు చొప్పున వారానికి రెండు రోజులు నాలుగు వారాలు వాడాలి. దీనితో పాటు బయోకెమిక్ మెడిసిన్ మెగ్నీషిమాఫాస్ రోజు ఉదయం 4 మాత్రలు రాత్రి 4 మాత్రలు వాడాలి.

డాక్టర్ కే. శ్రీకాంత్
హోమియోఫిజిషియన్
శ్రీసాయి హోమియోక్లీనిక్,
హైదరాబాద్, 94401904

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine