గుండె.. భద్రం

heartశరీరంలోని అన్ని భాగాలకు కావలసిన ఆక్సిజన్, పోషకాలు గుండె రక్తాన్ని పంపు చేయడం ద్వారానే అందుతాయి. అలాంటి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలనే కరొనరీ ధమనులు అంటారు. గుండె పనిచేయడానికి కావలసిన ఇంధనం వీటి ద్వారానే అందుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ కరొనరీ ధమనుల్లో అడ్డంకులు ఎదురైతే రక్తసరఫరాలకు అంతరాయం కలిగి, గుండె కండరానికి తగినంత రక్తం చేరదు. ఇది ఈ పరిస్థితి కరొనరీ వ్యాధులకు దారితీస్తుంది.

సీఏడీ అంటే..?
కరొనరీ రక్తనాళాల గోడల్లో మజిల్ ఫైబర్లు ఉంటాయి. ఈ ఫైబర్ల సంకోచవ్యాకోచాల వల్లనే రక్తవూపసరణ జరుగుతుంది. ఫైబర్లు సంకోచించినపుపడు రక్తవూపసారం తక్కువై వ్యాకోచించినప్పుడు ఎక్కువవుతుంది. అలా గుండెలోని అన్ని భాగాలకు కరొనరీ ధమనులు రక్తాన్ని ఒక క్రమపద్ధతిలో ప్రసారం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో కరొనరీ ధమనుల్లో ఉండే కండరాలు పట్టేసినట్టు అవుతాయి. తద్వారా రక్తవూపసారం తగ్గిపోతుంది. అది ఛాతిలో నొప్పికి దారితీస్తుంది. దీన్ని కరొనరీ స్పాస్మ్ అంటారు. సాధారణంగా ఉదయం సమయాల్లో, విశ్రాంతిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. మందులు వాడటం వల్ల గానీ, దానికదే గానీ కండరం సడలిపోయినప్పుడు నొప్పి తగగ్గిపోతుంది. రక్తవూపసరణ కూడా ఎప్పటిలాగా జరుగుతుంది. ఛాతినొప్పికి చాలావరకు కారణం ఇదే. ఆ తరువాత కారణం అథెరోస్క్లీరోసిస్. కండరం పట్టేయడం వల్ల రక్తవూపసరణకు కలిగే అంతరాయం తాత్కాలికం. కానీ అథెరోస్క్లీరోసిస్ వల్ల కలిగే అంతరాయం ఎక్కువ కాలం ఉంటుంది. కరొనరీ ధమనుల్లో అథెరోస్క్లీరోసిస్ వల్ల అంతరాయాలు ఏర్పడడాన్నే కరొనరీ వ్యాధి(సీఏడీ)గా పరిగణిస్తారు.

కారణం ఇదే...
వయసు పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాంటి కొవ్వు సంబంధిత పదార్థాలు కరొనరీ ధమనుల గోడల్లో పేరుకుపోతాయి. ఇవి రక్తవూపసారానికి ఆటంకం కలిగిస్తాయి. మొదట్లో ఇవి చిన్న గీతల్లాగా ఏర్పడతాయి. ఇవి ప్రమాదకరం కాదు. కానీ క్రమేణా పెరిగితే మాత్రం అడ్డంకులవుతాయి. ఇలా గీతల్లాగా చిన్నప్పుడే ఏర్పడతాయి. వయసుతో పాటు ఈ కొవ్వు గీతలు కూడాపెరిగి అధిక కొవ్వు పొరలాగా ఏర్పడుతుంది. దీన్న అథెరోమా అంటారు. ఆరోగ్యకరమైన జీవనవిధానం ఉన్నవారిలో ఇలా కొవ్వు గీతలు పెరగకుండా ఉంటాయి. కరొనరీ వ్యాధుల అవకాశం ఉన్నవారిలో ఇలాంటి అడ్డంకులు మరింత త్వరగా పేరుకుపోతాయి.

రిస్కు తెచ్చే కారకాలు...
-హైపర్‌లిపిడీమియా (అధిక కొలెస్ట్రాల్ ఉండడం ముఖ్యంగా హానికరమైన లోడెన్సిటీలైపోవూపొటీన్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం.)
-అధిక రక్తపోటు
-మధుమేహం
-సిగట్ తాగడం
-స్థూలకాయం
-ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం
-వ్యాయామం లేకపోవడం
-కుటుంబంలో ఎవరికైనా ఉండడం
-అధిక ఒత్తిడి, ఆందోళన

ఏంజైనా.. రకాలు
కరొనరీ వ్యాధి తీవ్రమైన కొద్దీ కొవ్వుపొర చుట్టూ మజిల్ ఫైబర్లు పెరిగి గట్టిపడతాయి. అలా గట్టిపడిన కొవ్వు పదార్థాలు రక్తవూపసరణకు తీవ్రస్థాయిలో ఆటంకం కలిగిస్తాయి. వీటివల్ల రక్తనాళం లోపలి భాగం 50 శాతం కన్నా చిన్నది అయిపోతే గుండె కండరానికి అది తగినంత రక్తాన్ని ప్రసారం చేయలేదు. వ్యాయామం చేసేటప్పుడు గానీ, అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు గానీ రక్తపీడనం, గుండె కొట్టుకునే రేటు రెండూ పెరిగిపోతాయి. కాబట్టి గుండెకు ఎక్కువ పోషకాలు, ఆక్సిజన్ అవసరం అవుతాయి. కానీ రక్తనాళం సన్నబడటం వల్ల ఒత్తిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో డిమాండ్‌కు తగినట్టుగా రక్తం సరఫరా కాదు. ఫలితంగా ఛాతిలో అసౌకర్యంగా, బరువుగా, నొప్పిగా అనిపిస్తుంది. దీన్ని ఏంజైనా అంటారు. సాధారణంగా ఇది ఛాతి మధ్యభాగంలో లేదా ఎడమ రొమ్ము పై భాగంలో ఉంటుంది. ఇలాంటప్పుడు రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకులు మెల్లమెల్లగా పెద్దగా అవుతూ సంవత్సరాల తరబడి అలాగే స్థిరంగా ఉంటాయి. అందుకే వీటివల్ల వచ్చే నొప్పిని స్టేబుల్ ఏంజైనా అంటారు.

కొన్నిసార్లు ఈ అడ్డంకుల్లో సన్నని పగులు ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు అది శరీరంలోని అవయవానికే ఏర్పడిన గాయంగా భావించి దాన్ని మాన్చడానికి అక్కడి రక్తం గడ్డకడుతుంది. దాంతో అడ్డంకు మరింత పెద్దది అవుతుంది. హఠాత్తుగా పెరిగిన ఈ అడ్డంకు వల్ల కొన్ని నిమిషాల వ్యవధిలోనే గుండెకు రక్తం తగ్గిపోతుంది. అప్పుడు చాలా తీవ్రమైన ఛాతినొప్పి వస్తుంది. ఇది విశ్రాంతిగా ఉన్నప్పుడు పెరిగి నిద్ర నుంచి లేపుతుంది కూడా. ఇలాంటి నొప్పిని అన్‌స్టేబుల్ ఏంజైనా అంటారు. ఇలాంటప్పుడు వెంటనే చికిత్స అందించగలిగితే ప్రమాదం తప్పుతుంది.

anil అలవాట్లే కీలకం...
తగినంత ఆక్సిజన్, పోషకాలు అందనప్పుడు గుండెపోటు వస్తుంది. గుండె కండరం దెబ్బతింటుంది. దీన్నే వైద్యపరిభాషలో మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ అంటారు. ఈ రక్తపు గడ్డలను తొలగించడానికి ఇప్పుడు ఆధునికమైన చికిత్సపూన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే పేషెంటు ఎంత త్వరగా హాస్పిటల్‌కి వస్తే అంత మంచి వైద్యం అందించడం వీలవుతుంది. గుండె కండరం దెబ్బతినకుండా నివారించడానికి ప్రతీ నిమిషం కీలకమైనదే. దురదృష్టవశాత్తు చాలామంది సమయానికి వైద్యసహాయం అందుకోలేకపోతున్నారు. అందుకే సగం గుండెపోట్లు మరణానికే దారితీస్తున్నాయి. పొగతాగడం లాంటి అలవాట్లే కాదు.. కొకైన్ లాంటి డ్రగ్స్ తీసుకునేవారిలో కూడా అదీ చిన్న వయసులోనే గుండెపోట్లు వస్తున్నాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవనవిధానం ద్వారా చాలావరకు గుండెపోటును తెచ్చిపెట్టే అంశాలకు దూరంగా ఉండవచ్చు.

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine