నా ఇష్టం... కొంచెం కష్టం

ranaతన కంటే తనకేదీ ఎక్కువ కాదనే స్వార్థ పరుడైన గణేష్ (రానా) ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణవేణి(జెనీలియా)వూపాణాలు కాపాడి, తాగిన మైకంలో ఆమె కోసం తన డబ్బులు పది లక్షలు వదులుకుంటాడు. తన ప్రియుడు కిషోర్(హర్షవర్ధన్) కోసం మలేషియా వచ్చిన కృష్ణవేణి అతడే కనిపించకపోయే సరికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కానీ ఆమెను కాపాడి ఆమె కోసం రౌడీలకు పది లక్షలు ఇచ్చిన గణేష్ ఆమెను తన ఇంట్లో అప్పగించి తన డబ్బులు తాను తెచ్చుకుందామని వెళతాడు. కొన్ని పరిణామాల తరువాత కృష్ణవేణిపై ప్రేమ పుట్టి ఆమెని మళ్లీ మలేషియాకు తీసుకువస్తాడు. ఇంతలో ఆమెను వెతుక్కుంటూ కిషోర్ వస్తాడు. అతనెవరనేది తెలిసినా కానీ, గణేష్ కిషోర్‌కు కృష్ణవేణి గురించి చెప్పడు. తన ప్రేమ గెలవాలంటే కిషోర్‌ని కృష్ణవేణి కలవకుండా చూసుకోవాలని అనుకుంటాడు. చివరిగా కృష్ణవేణి ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటుందనేది మిగతా సినిమా.

ఈ సినిమాలో మొదట చెప్పుకోవాల్సింది హీరో రానా గురించి మొదటి రెండు సినిమాలు డిఫంట్ రోల్స్‌లో కనిపించినా ఇది పూర్తి స్థాయి మాస్ హీరో పాత్ర. అయితే రానా ప్రయత్నం మాత్రమే చేశాడు. ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. డైలాగ్ డెలివరీకి చాలా ఇబ్బంది పడ్డాడు. యాస మాట్లాడటం అతనికి పెద్ద మైనస్ అయ్యింది. ఇక డాన్సుల విషయానికొస్తే మాత్రం అతని కష్టం చూసేవాళ్లకు జాలి కలిగిస్తుంది. జెనీలియాతో సహా మిగతా నటీనటులంతా పరవాలేదనిపిస్తారు. సాంకేతిక వర్గం అంతా తమ పని తాము చేసుకుపోయారు. ఓ సాథియా’ పాట ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా సంభాషణలూ బాగున్నాయి.

దర్శకుడు ప్రకాష్ తోలేటి హీరో పాత్రను నమ్ముకుని సినిమాను నడిపించవచ్చుననుకున్నాడు. కానీ ఆ విషయంలో ఫెయిలైనాడనే చెప్పాలి. స్వార్థం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. స్వార్ధం కోసం చేసే పనుల్లో హీరో చేసే వాదన బలంగా ఉండాలి. అప్పుడే చూసేవాళ్లు కనెక్ట్ అవుతారు. ఆ ఫీల్ మిస్సయిందీ సినిమాలో. కీలకమైన క్లారిటీ ఇచ్చే సందర్భాల్లో అర్థం లేని వివరణతో లాజిక్‌కు అతీతంమైన ముంగింపు నిచ్చాడు. కామెడీ లేకపోవడం ఈ సినిమాకు మరో మైనస్. నిజానికి దర్శకుడు కరెక్ట్‌గా డీల్ చేసి ఉంటే మరో ఆర్య అయ్యుండేది నా ఇష్టం సినిమా. కానీ తడబాటు అడుగడుగునా కనిపించింది. దాంతో నా ఇష్టం’ సినిమా చూడటం కాస్త కష్టమే అనిపిస్తుంది.
నా ఇష్టం
తారాగణం: రానా, జెనీలియా, హర్షవర్ధన్, సుబ్బరాజు, బ్రహ్మానందం, ఆలీ తదితరులు...
సంగీతం: చక్రి
దర్శకత్వం: ప్రకాష్ తోలేటి

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine