కాంబినేషన్ క్రేజ్‌తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న చిత్రం బిజినెస్8మేన్. భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన ఈ చిత్రం ఆల్‌టైమ్ రికార్డ్స్ అంటూ ప్రచారమూ మొదలైంది. అయితే ఈ కథ, కథనాల్లో అంతటి పస ఉందో లేదో తెలియాలంటే ఆసలు బిజినెస్8మేన్ సత్తా ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి.
‘ముంబయ్‌లో మాఫియా లేదు. భాయ్ లేడు. అంతా ప్రశాంతం’ అనే కమిషనర్ ప్రకటనతో సినిమా ఓపెనింగ్. అక్కడ మాఫియాను రన్ చేయాలనే లక్ష్యంతో సూర్యా(మహేష్‌బాబు) ముంబయ్‌లో అడుగుపెడతాడు. తన లక్ష్యంలో భాగంగా మాఫియానే బిజినెస్ గా మార్చుకుంటాడు. ముంబయ్‌లోని ఛోటామోటా రౌడీలను చేరదీసి జీతాలిస్తూ తనను తాను భాయ్‌గా ప్రమోట్ చేసుకుంటాడు. ఆ క్రమంలో లోకల్ లీడర్స్‌తో సంబంధాలు పెంచుకుంటాడు. ముంబయ్ కేంద్రంగా అన్ని ప్రధాన నగరాల్లో తన బ్రాంచ్‌లు ఓపెన్ చేసి అందరి దగ్గరా రెండుశాతం టాక్స్ వసూలు చేస్తుంటాడు. అలా ఒక బ్యాంక్‌నే నడిపించే స్థాయికి ఎదుగుతాడు. అయితే ఇదంతా కాబోయే ప్రధానమంత్రి జయదేవ్(వూపకాష్‌రాజ్)కు అడ్డంకిగా మారుతుంది. ఒక సమయంలో సూర్యాభాయ్ తనపై పగబట్టి ఇదంతా చేస్తున్నాడని తెలుసుకుంటాడు జయదేవ్. అసలు సూర్యా ఎవరు? జయదేవ్‌కు, అతనికి మధ్య ఉన్న పగ ఏమిటి? ఒక పొలిటికల్‌పార్టీనే కొనే స్థాయికి సూర్యా ఎలా ఎదిగాడు? ముంబయ్ కమిషనర్ కూతురు చిత్ర(కాజల్)తో అతని ప్రేమాయణం ఏమైంది? అనేది ఆసక్తికరమైన మిగతా సినిమా.
బిజినెస్8మేన్ కథను షార్ట్‌గా చెప్తే ఇలాగే ఉంటుంది. అయితే కథ నడిపించిన తీరు బాగుంది. నిజం చెప్పాలంటే సూర్యా అనే యువకుడు సూర్యాభాయ్ ఎలా అయ్యాడనే పాయింట్‌తో తీసిన సింగిల్ లైన్ స్టోరీ. రెండు గంటలు అతి వేగంగా సాగిపోయే మాస్8 మూవీ. అందుకే ఇలాంటి కమర్షియల్ మూవీలో లాజిక్‌లు వెతికేకంటే చూశామా? వచ్చామా? పడుకున్నామా? అన్నట్టు ఉండాలి. అలా చూడగలిగే శక్తి, లాజిక్ ఉంటే బిజినెస్8మేన్ అద్భుతమైన సినిమా. ఎందుకంటే సూర్యా ఏదనుకుంటే అది చేసేయగలుగుతాడు. ముంబయ్ వంటి నగరంలో ఈజీగా డాన్‌గా మారతాడు. ఎంతో స్ట్రిక్ట్‌గా ఉండే పోలీస్ కమిషనర్ కూడా అతన్ని ఏమీ చేయలేకపోతాడు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుందా కథాగమనం.
మహేష్ చెప్పిన డైలాగ్స్‌తో థియేటర్ మారుమోగిపోతుంది. సూపర్ ఫైట్స్, ఐటెమ్స్‌సాంగ్‌తో సహా అన్నీ మంచి పాటలే. పవర్‌ఫుల్ కథ, థ్రిల్ కలిగించే ట్విస్టుల్లేని ఈ చిత్రాన్ని మహేష్‌బాబు ఒక్కడే నడిపించగలిగాడు. అందుకే బిజినెస్8మేన్ సినిమా వన్‌మాన్ షోగా మిగిలిందని చెప్పవచ్చు.
పూరీ జగన్నాథ్ గురించి చెప్పాలంటే.. దర్శకుడిగా కంటే డైలాగ్ రైటర్‌గా కసితో పనిచేశాడు. క్లయిమాక్స్‌లో ‘చివూతను తీసుకొస్తే నేనొస్తానని నీకు తెలుసు. కానీ నేనొస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు’ అని మహేష్ చెప్పే డైలాగ్‌తో అతని స్టామినాను, హీరో ఇమేజ్‌ను పతాక స్థాయిలో నిలబెట్టాడు.
నటీనటులు, సాంకేతిక వర్గం ఎవరి పరిధిమేరకు వాళ్లు చక్కగా పనిచేశారు.
బాటమ్‌లైన్: బిజినెస్ మేన్......ఇట్స్ ఎ వన్‌మాన్ షో!
బీఎమ్మార్
| |
|
![]() |
|