కాంచన
తారాగణం: రాఘవ లారెన్స్, శరత్‌కుమార్, కోవై సరళ, శ్రీమాన్, తదితరులు...
సంగీతం: థమన్ ఎస్.ఎస్.
దర్శకత్వం: కథ, స్క్రీన్ ప్లే, రాఘవ లారెన్స్
‘మాస్’ ఫార్ములాతో వచ్చిన సినిమాలు బాక్సాఫీసును కళకళలాడిస్తాయని గతంలో ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన’ కూడా అలాంటి మాస్ సినిమానే. అయితే దీనికి లారెన్స్ సామాజిక కోణంలో కొన్ని హంగులు చేర్చి, హారర్... వంటి సినిమా‘వూటిక్స్’తో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల ముందుంచాడు. అసలు ‘కాంచన’ కథేంటంటే...
రాఘవ(లాన్స్) మంచి హుషారైన యువకుడు, క్రికెట్ ఆటగాడు. కాని సాయంత్రం ఆరయ్యిందంటే చాలు తల్లి చంకెక్కుతాడు. దయ్యం అంటే చచ్చేంత భయం ఉండడమే అందుకు కారణం.
రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా అమ్మచేతిని పట్టుకుని పడుకుంటాడు. అలాంటి రాఘవ ఓ సారి పక్క గల్లీలో ఉన్న గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుకొని వచ్చిన తర్వాత అతని ప్రవర్తనలో చిత్రవిచివూతమైన మార్పులు కనిపిస్తుంటాయి. అమ్మాయిలా చీర కట్టుకోవడం, గాజులు వేసుకొని మురిసిపోవడం, పసుపుతో స్నానం చేయడం.... ! ఆ ప్రవర్తనను గమనించిన రాఘవ కుటుంబ సభ్యులు ఓ రోజు నిలదీస్తారు. దాంతో ఇంకా విచివూతమైన ప్రవర్తనతో కుంటుంబాన్నంతా బెంబేపూత్తిస్తాడు. రాఘవను ఏదో దుష్టశక్తి ఆవహించిందని దర్గాకు తీసుకెళ్తారు. అక్కడ రాఘవలో ఒక దయ్యం ఆత్మ ప్రవేశించిందని తెలుసుకుంటారు. అయితే ఆ ఆత్మ ఒక హిజ్రాది. రాఘవను ఎందుకు ఆవహించింది? అతని చేత హత్యలు ఎందుకు చేయిస్తుందనేది మిగిలిన కథ.
కాంచన... మానసిక వైకల్యం, సైన్స్ ప్రమేయం లేని పక్కా దయ్యాల సినిమా. సినిమా మొదటి సగమంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే సాగుతుంది. అయితే మధ్య మధ్యలో కాంచన చేష్టలతో ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాడు దర్శకుడు. ఇంట్వల్ నుంచి సినిమా అసలు సిసలు కాంచన కథలోకి వస్తుంది. అయితే కాంచనగా మారిన రాఘవ పాత్ర ఒక్కటే సీరియస్‌గా నడుస్తుంటే అతని కుటుంబ సభ్యుల పాత్రలు కావలిసినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాయి. లారెన్స్ కాస్త అతి చేసినా కాంచన ఆవహించినప్పుడు హిజ్రాగా, చిన్న పిల్లాడిలా, ముస్లిమ్‌గా చేసిన బిట్ బాగుంటుంది. (‘అపరిచితుడు’ సినిమాలో విక్రమ్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది) క్లయిమాక్స్‌లో వచ్చే లేడీ గెటప్ కూడా బాగానే సూటయ్యింది. మిగతా నటీనటుల గురించి చెప్పుకోవాలంటే కోవై సరళ, శ్రీమాన్, కోడలుగా నటించిన నటి (?), తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. లక్ష్మిరాయ్ అప్పుడప్పుడు (ఒక పాట కూడా) కనిపించి తను ఉన్నట్టు గుర్తు చేస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హిజ్రా పాత్రలో నటించిన శరత్‌కుమార్ గురించి. మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన శరత్‌కుమార్ ఆ పాత్రలో కొత్తగా కనిపిస్తాడు. హిజ్రా అయినా ఒక మంచి ఆశయం కోసం హత్యకు గురయ్యే కాంచనగా మంచి నటనను ప్రదర్శించాడు.
సినిమా అంతా చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. లారెన్స్ ఎలాగైనా ఒక హిట్ కొట్టాలనే తపనతో ‘కాంచన’ తీసినట్టు అనిపిస్తుంది. ప్రతి సీన్‌ను కొంచెం కొత్తగా తీయాలనే తాపవూతయం కనిపిస్తుంది. అందుకే పాత కథకు హిజ్రా అనే కొత్త కాన్సెప్టు జోడించి ఒక మాస్ సినిమాగా మలిచాడు. డైలాగులు, చేష్టలు అన్నీ మాస్‌ను దృష్టిలో పెట్టుకుని చేసినవే అని ఇట్టే తెలిసిపోతుంది. రాఘవ లారెన్స్ నటుడిగా కంటే దర్శకుడిగానే ఎక్కువ ప్రతిభ కనబరిచాడు. ఓపెనింగ్ సీన్‌తోనే కథలోకి లాగేస్తాడు. ట్విస్టులేమీ లేకున్నా, ప్రేక్షకులను ఉత్కంఠ కలిగించే సినిమా నడిపించాడు. కామెడీ ప్లస్ అయినట్టు నేపథ్యం సంగీతం కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది. పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవు.
మహేందర్
| |
|
![]() |
|