ఎందుకంటే ప్రేమంట

ramntam‘తొలివూపేమ’తో యువత హృదయాలను గెలుచుకున్న కరుణాకరన్ కొన్ని అపజయాల తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ విజయాలతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ రెండు విజయాల తర్వాత తను తెరకెక్కించిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’. ఇక ఈ చిత్రంలో ‘కందిరీగ’తో హిట్ కొట్టి మంచి జోష్‌లో వున్న రామ్ కథానాయకుడు. వీరికి తోడు ‘రచ్చ’తో తన ఖాతాలో మరో విజయాన్ని జమచేసుకున్న తమన్నా కథానాయిక కావడం, ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన స్రవంతి బ్యానర్‌లో ఈ సినిమా నిర్మాణం జరగడం, కరుణాకరన్ సినిమా అనగానే ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరి ఖాయం అనుకునే యువత, ఇలాంటి కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్‌తో వస్తున్న చిత్రం కావడంతో ‘ఎందుకంటే ప్రేమంట’ ప్రేక్షకుల్లో ఓమోస్తరు ఆసక్తి కలిగించింది. ఇక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకుందాం..

కథ: పారిస్‌లో వుండే ఇండియన్ అంబాసిడర్ అధికారి (సుమన్) కూతురు స్రవంతి (తమన్నా) కొన్ని కారణాల వల్ల కట్టుదిట్టమైన సెక్యూరిటి మధ్య వుంటుంది. ఇది ఇష్టం వుండని స్రవంతి స్వేచ్ఛగా వుండాలనుకుంటుంది. ఇందుకోసం ఇంటి నుంచి పారిపోతుంది. ఏ లక్ష్యం లేకుండా ఆవారాగా తిరిగే కొడుకును క్రమశిక్షణలో పెట్టాలనుకునే రామ్ తండ్రి (షాయాజీ షిండే) కొడుకును పారిస్‌లో చండాశాసనుడైన తన స్నేహితుడు (నాగినీడు) దగ్గరికి పంపిస్తాడు. అనుకోకుండా పారిస్‌లో రామ్, స్రవంతి కలుసుకుంటారు. ఇండియా వెళ్ళడానికి పాస్‌పోర్టు, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న రామ్‌కు సహాయపడుతుంది స్రవంతి. ఈ దారిలో ఎదురైన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఎలాగలాగో ఇండియాకు చేరుకుంటాడు రామ్. అయితే అతను ఇండియాకు చేరుకున్న స్రవంతి గురించి ఓ నిజం తెలుస్తుంది. అది ఏమిటి? ఆ తర్వాత జరిగిందేమిటి? రామ్, స్రవంతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా? వారి ప్రేమ ఎలా సుఖాంతమయిందనేది మిగతా కథ.

విశ్లేషణ: ఎనర్జిటిక్ స్టార్‌గా తనకున్న బిరుదుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో రామ్ పాత్ర వుంటుంది. అందుకు అనుగుణంగానే అతని నటన ఉత్సాహంగా వుంటుంది. నటనలో, డ్యాన్సులో అన్ని రకాలుగా రామ్ రాణించాడు. గ్లామర్‌డాల్ పేరున్న తమన్నాకు కూడా ఈ చిత్రంలో నటనకు ఆస్కారమున్న పాత్ర దొరికింది. అయితే కొన్ని చోట్ల తడబడింది. నేడు అగ్ర కథానాయికల జాబితాలో వున్న కొంత మంది కథానాయికలతో పోల్చుకుంటే నటనపరంగా తమన్నా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ ఫేం రుషి విలన్‌గా కొత్త అవతారమెత్తాడు. విలనిజం పండించడంలో రుషి ఓకే అనిపించాడు. ఈ సినిమాతో తెలుగు సినిమాకు ఓ కొత్త ప్రతి నాయకుడు దొరికాడు. ఈ బాటలోనే రిషి కొనసాగితే విలన్‌గా రాణించే అవకాశం లేకపోలేదు. కృష్ణభగవాన్, బ్రహ్మానందం కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. రచయిత కోన తొలిసారిగా ముఖానికి రంగు వేసుకుని విలన్‌గా భయపెట్టడానికి

ప్రయత్నించాడు. ఆ పాత్ర ఆయనకు అంతగా నప్పలేదు. షాయాజీ షిండే, సుమన్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం సినిమాకు మైనస్‌గా మారింది. ఆండ్రూ ఫోటోక్షిగఫీ ఈసినిమాకు వున్న ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌ను కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ఈ చిత్రంలో కోన నటుడిగా ఫెయిలైన రచయితగా కొంత సక్సెస్ అయ్యాడు. కొన్ని సన్నివేశాల్లో పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. హాలీవుడ్ చిత్రం ‘జస్ట్ లైక్ హెవెన్’ను ప్రేరణగా తీసుకొని కరుణాకరన్ ఈ కథను తయారు చేసుకున్నాడు. అయితే కేవలం ప్రేరణగా తీసుకొని తన క్రియేటివిటీకి కాస్త పనిపెడితే ఈ కథ కనీసం తెలుగు నేటివిటికి తగ్గట్టుగానైనా తయారుచేసుకొవచ్చు. అలా చేయకుండా ఆ కథను అలాగే తెరకెక్కించాలనుకొని బొర్లాపడ్డాడు కరుణాకరన్.

అయితే మొదట్నుంచీ కూడా కరుణాకరన్ అనగానే యువత ఓ మంచి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అంచనా వేస్తారు. తప్పకుండా మినిమమ్ గ్యారెంటి వినోదాన్ని ఆశిస్తారు. ఆ తరహాలోనే ఈ చిత్రం కూడా ఓ మంచి ఫీల్ గుడ్ లవ్‌స్టోరి అనే మైండ్‌సెట్‌తో వచ్చిన ప్రేక్షకులకు ఆయన సోల్ లేని ఓ సోల్ (ఆత్మ) కథను చూపించాడు. అయితే మొదట్నుంచీ ఇది జన్మజన్మల అనుబంధం చుట్టు అల్లుకున్న ప్రేమకథ అని, ఈ చిత్రం ఫలానా జానర్‌లో వుండబోతుందని దర్శకుడు ప్రేక్షకులను ప్రిపేర్ చేసి వుంటే చిత్రానికి కొంత అడ్వాం అయ్యి వుండేది.అప్పుడైనా కొంత మంది ప్రేక్షకులు కరుణాకరన్ వైపు నిలిచేవారేమో..!

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine