‘సింహా’ చిత్రం విజయంతో బాలకృష్ణ కెరీర్ మళ్ళీ పట్టాపూక్కిందని సంతోషించారు ఆయన అభిమానులంతా.. కానీ ఈలోపే ‘పరమవీర చక్ర’లాంటి పరమ ప్లాఫ్‌ను తన ఖాతాలో వేసుకొని అభిమానుల ఆనందాన్ని ఎంతో కాలం నిలవనీయలేదు ఈ నందమూరి వారసుడు. ఇక ఇటీవల చేసిన ‘శ్రీరామరాజ్యం’తో విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం ‘అధినాయకుడు’. ఎన్నో ప్రసవ వేదనల మధ్య, వివాదాల మధ్య ఎట్టకేలకు ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.. ఉత్కంఠ రేపే డైలాగ్స్, బాలకృష్ణ త్రిపావూతాభినయం, ఉప ఎన్నికలకు తన సినిమానే టీడీపీకి ప్రచార సాధనమని బాలకృష్ణ చెప్పడంతో బాలకృష్ణ అభిమానుల్లోనే కాకుండా, సగటు ప్రేక్షకుడిలో కూడా ఈ సినిమాపై ఆసక్తిని కలిగించింది. అయితే అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ ‘అధినాయకుడు’ ఎంత మేరకు అలరించిండో తెలుసుకుందాం...
కథ:రాయలసీమలో రగులుతున్న ఫ్యాక్షనిజానికి అడ్డుకట్ట వేసి, ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో వుండాలని కలలు కనే వ్యక్తి హరిశ్చంవూదవూపసాద్ (బాలకృష్ణ వృద్ధుడి పాత్ర). ఇందుకోసం ఆయన విదేశాలకు వెళ్ళి తమ ప్రాంతంలో పరిక్షిశమను స్థాపించాలని, అందులో తమ ప్రాంతానికి చెందిన వారికి ఉదోగ్యాలను ఇవ్వాలని ఒప్పిస్తాడు హరిశ్చంవూదవూపసాద్. అయితే ఇదంతా ఆ ప్రాంతానికి చెందిన నాగులప్ప (పదీప్ రావత్)కు ఇష్టం వుండదు. అందుకే అధికార పార్టీకి చెందిన అధ్యక్షుడు (కోట శ్రీనివాసరావు), డీజీపీ (మురళీ వర్మ)లతో చేతులు కలిపి హరిశ్చంవూదవూపసాద్‌ను ఆయన వారసుడైన బాబీ (యంగ్ బాలకృష్ణ) చేత అంతం చేయాలని ప్లాన్ చేస్తారు? అంతేకాదు ప్రజానేత అయిన రామకృష్ణ ప్రసాద్ ( మిడిల్ ఏజ్ బాలకృష్ణ)ను కూడా ప్రొఫెషనల్ కిల్లర్‌గా తాము తయారుచేసిన బాబీతో చంపించడానికి పన్నాగం వేస్తారు? ఇక ఆ తర్వాత జరిగిందేమిటి? బాబీ తన తండ్రిని, తాతయ్యను చంపడానికి ఎందుకు సిద్ధమయ్యాడు? అందుకు కారణలేమిటి? అసలు విషయం తెలుసుకొని బాబీ ఏం చేశాడు? హరిశ్చంవూదవూపసాద్ కల నేరవేరిందా? నాగులప్ప పన్నాగం ఫలించిందా? తండ్రి-కొడుకులు కలిసి దుష్టశిక్షణ ఎలా చేశారు అనేది మిగత కథ.
నటీనటుల పనితీరు: బాలకృష్ణ మూడు గెటప్పుల్లో కనిపించడం అభిమానులకు సంతోషమే అయినా ఆడియన్స్‌లో కొంత కన్‌ఫ్యూజన్ వుంటుంది. ఎందుకంటే ఆ పాత్రలను దర్శకుడు తీర్చిదిద్ధిన విధానమే అందుకు కారణం. హరిశ్చంద్ర ప్రసాద్‌గా బాలకృష్ణ నటన అభినందనీయంగా వున్నా ఆ పాత్రను సరిగ్గా బిల్డప్ చేయలేకపోవడం వల్ల పెద్దగా ఫీల్ రాదు. మిడిల్ ఏజ్ బాలకృష్ణ గెటప్‌లో విగ్గు, మీసాలు సరిగ్గా కుదరలేదు. యంగ్ బాబీగా బాలకృష్ణ ఆడియన్స్‌ను బాగానే ఎంటర్‌టైన్‌చేశాడు. అభిమానులను అలరించడానికి బాలకృష్ణ వేసిన స్టెప్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో నందమూరి బాలకృష్ణ స్టెప్పులేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రానికి ఏమైనా ప్లస్‌లు ఏమైనా వుంటే అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఆయన నటనే. ఇక లక్ష్మీరాయ్ అందాల ఆరబోత కనువిందు చేసింది. నటనలో మాత్రం ఆమె గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. సలోని ఒక్కపాటలో అలా తళుక్కున మెరిసి మాయమైపోతుంది. బ్రహ్మానందం తన శక్తిమేరకు ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నించాడు కాని ఆ కామెడీ సరిగ్గా పండకపోవడంతో ప్రేక్షకులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. మురళీ శర్మ, ప్రదీప్‌రావత్‌ల నటన పర్వాలేదనిపిస్తుంది. కోటా తనకు తగ్గ పాత్రను ఈ చిత్రంలో చేయలేదు.
సాంకేతిక వర్గం పనితీరు: ఈ మధ్య దర్శకులందరూ తమ హీరోలతో కొన్ని అద్భుతమైన సంభాషణలు పలికించాలనే అంశంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. దర్శకుడు పరుచూరి మురళి కూడా అదే తరహాలో కొన్ని రాజకీయ నేపథ్యం వున్న సంభాషణలు బాలకృష్ణ చేత చెప్పించాడు. ఈ డైలాగ్సే సినిమా విడుదలకి ముందు వివాదాన్ని రేపాయి. బయట రేపిన వివాదానికి తగ్గ రీతిలో మాత్రం ఆ డైలాగుల్లేవని చెప్పాలి. ఒకవేళ వున్నా అవి ఆ రెండు మూడు డైలాగుల వరకే పరిమితం అయ్యాయి. మిగతా సంభాషణలు అన్ని చాలా సాధారణంగా వుంటాయి. ఇంతకు ముందు స్టార్ హీరోలతో సినిమా చేయని మురళికి తొలిసారిగా బాలకృష్ణ ఓ మంచి అవకాశం ఇచ్చాడు. అయితే ఆ అవకాశాన్ని మురళి సద్వినియోగం చేసుకోలేకపోయాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటువంటి క్లారిటీ లేకుండా సినిమాని గందరగోళంగా తెరకెక్కించాడు. ఈ సినిమా ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? అసలు ‘అధినాయకుడి’ లక్ష్యం ఏమిటి అనే విషయంలో మురళి క్లారిటి మిస్ అయ్యాడు. కొన్ని సన్నివేశాల్లో ఆ సన్నివేశం ఎందుకు వస్తుందో అర్థం కాక ప్రేక్షకులు ఆలోచనలో పడాల్సి వస్తుంది. ఇలాంటి పొరపాట్లు ఎన్నో ‘అధినాయకుడు’లో జరిగాయి. కళ్యాణీమాలిక్ పాటలు ఈ సినిమా మైనస్‌లల్లో ఒకటిగా చెప్పుకోవాలి. ఇక ఎటువంటి లాజిక్‌లు ఆలోచించకుండా బాలయ్య సినిమాని ఎలాగైనా చూడాలి అని అనుకునే ప్రేక్షకులకు మాత్రమే ఇది ఫర్వాలేదనిపించే సినిమా. మిగతా వారందరికి మాత్రం ఇది ‘అధినాయకుడు’ కాదు ‘అతి’ నాయకుడు అనే ఫీల్‌ని కలిగిస్తుంది.
-మ.మ
| |
|
![]() |
|