శతమానం భవతి

cinemareelభారతీయ ప్రజల వినోదక్షేవూతంలో విస్తరించిన సినిమాకి వందేళ్లు. జీవనశైలి, ఆలోచనలు, ఆహార్యం చివరకు మానవసంబంధాల మీదా తనదైన ముద్ర వేసిన సినిమా దేశంలో పురుడు పోసుకుని నూరేళ్లు గడిచాయి. భారతీయ సినిమా పితామహుడు దూండీరాజ్ గోవింద్ ఫాల్కె పూర్తి కథాత్మకంగా నిర్మించిన ‘రాజాహరిశ్చంద్ర’ 1913 మే 3న కారోనేషన్ హాల్లో విడుదలైంది. మొదటి పూర్తి స్థాయి భారతీయ సినిమాగా చరివూతలో నిలిచిపోయింది. అందుకే వచ్చే ఏడాది మన సినిమా శతవసంతాల సంబరాలను జరుపుకోబోతున్నది. ఆ సందర్భంగా ఈ ఫ్లాష్‌బ్యాక్....

నిజానికి సినిమాకంటే ముందే మనదేశంలో పట్టుకథలు, తోలుబొమ్మలాట లాంటి ప్రదర్శన కళలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. కానీ 196 జూలై 7 న బొంబాయిలోని వాట్సన్ హోటల్లో మొట్టమొదటిసారి కదిలే బొమ్మల ప్రదర్శన ఏర్పాటు కావడంతో నూతనమైన సినిమా కళ భారతదేశంలో ఊపిరిపోసుకుంది. లూమియర్ సోదరుల ప్రతినిధి సినిస్టర్ ఆస్ట్రేలియా వెళ్తూ, వెళ్తూ బాంబేలో కూడా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. లూమియర్ సోదరులు నిర్మించిన బేబీస్ బ్రేక్‌ఫాస్ట్, అరైవల్ ఆఫ్ ట్రేన్ లాంటి షార్ట్ ఫిలింస్‌ని ఆనాడు ప్రదర్శించారు. కదిలే బొమ్మల్ని చూసిన భారతీయ ప్రేక్షకులు ఆనందపడ్డారు. హరిశ్చంద్ర సఖారాం బట్టా డేకర్‌లాంటి వారు లూమియర్స్‌నించి సినిమాటోక్షిగాఫ్ మిషిన్ కొనీ తాము కూడా సినిమా తీసే ప్రయత్నం చేయాలనుకున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. 1901లో రాంగ్లల్ పరంజిపే ఇంగ్లండ్‌లో సాధించిన విజయానికి బొంబాయిలోని చౌపాటిలో పొందిన గౌరవ స్వాగతాన్ని మొట్టమొదటిసారిగా భట్వాడేకర్ తన కెమెరాలో బంధించి ప్రదర్శించాడు. అది మన దేశంలో నిర్మించిన తొలి ‘ఆక్చువాలిటి’ లేదా ‘టాపికల్ ఫిల్మ్’గా వినుతికెక్కింది.

మరోవైపు కలకత్తాలో హీరాలాల్‌సేన్ స్టేజీమీద ప్రదర్శిస్తున్న నాటకాన్ని చిత్రించి తన సినిమాటోక్షిగఫి ప్రయత్నాలు కొనసాగించాడు. ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉత్సాహవంతులు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఫాల్కె మాత్రం తన కదిలే బొమ్మల ప్రయోగాలకు తాను విన్న, చదివిన కథల్లోంచే అంశాలను ఎన్నుకున్నాడు. రాజాహరిశ్చంవూదకు ముందు కూడా ఫాల్కె పలు ప్రయత్నాలు చేశాడు. ఓ విత్తనం నుంచి మొక్క మొలకెత్తడాన్ని ‘టైం లాప్స్ ఫోటోక్షిగఫీ’గా రోజువారి షాట్లు తీసి ఒక చోట చేర్చడంతో 1912లోనే ‘ది బర్త్ ఆఫ్ ఎ పీ ప్లాంట్ ఇన్‌స్ట్రక్షనల్’సినిమాగా రూపొందింది. తర్వాత ఫాల్కె ‘లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అనే సినిమా చూశాక ఆయనలో మథనం ప్రారంభమయ్యింది. మన ప్రాచీన గ్రంథాల్లోంచి భారతీయతను చూపించే సినిమాలు రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అలా తయారైందే మన భారతీయ మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’.


lagaanఈ సినిమాకు సంబంధించి రచన, దర్శకత్వం, సెట్ నిర్మాణం, కాస్ట్యూమ్స్‌తో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా ఫాల్కెనే నిర్వహించాడు. అంతేకాదు, సినిమాకి సంబంధించిన కెమెరా వర్క్‌ని పర్యవేక్షించడం, ల్యాబ్‌లో ప్రాసెసింగ్ పనినీ ఫాల్కె దగ్గరుండి నిర్వహించాడంటే ఆయన కమిట్‌మెంట్ ఎలాంటిదో అర్థమవుతుంది. ఎపిసోడిక్ స్టైల్లో తీసిన ఈ సినిమాలో భారతీయ జానపద నాటకరీతి, ప్రాచీన నవలా రచనా పద్ధతి మనకు కనిపిస్తాయి. అనేక దృశ్యాలు కెమెరాను స్థిరంగా ఉంచి తీసిన స్టాటిక్ షాట్లుగా కనిపిస్తాయి. ఒక ఫ్రేమ్‌లో అనేక కదలికల్ని మనం చూడొచ్చు. ఇక ఇందులో తారామతితో సహా స్త్రీ పాత్రదారులంతా పురుషులే. వాస్తవానికి రాజా హరిశ్చంద్ర 3700అడుగుల అంటే 16 ఎం.ఎం. సినిమా. కానీ ఇప్పుడు కేవలం 1475 అడుగులు మాత్రమే మిగిలింది. మిగతాది కాలగర్భంలో కలిసిపోయింది. ఇందులో ప్రధాన పాత్రల్ని డి.డి.దాబ్కె, సాలుంకే, బాలచంద్ర ఫాల్కె, గహన్నా సనా, గణపత్ షిండే తదితరులు పోషించారు.

ఆ తర్వాత ఫాల్కె మోహినీభస్మాసుర (1914), సత్యవాన్ సావిత్రి (1914), సత్యవాది రాజా హరిశ్చంద్ర (1917), లంకా దహన్ (1917), శ్రీ కృష్ణ జన్మ (191), కాలీయ మర్దన్ (1919)లాంటి చిత్రాలు రూపొందించాడు. ఫాల్కె తన మోహినీభస్మాసుర సినిమాలో మొట్టమొదటిసారిగా స్త్రీ పాత్రకి మహిళను పరిచయం చేశాడు. ఆమె మరెవరో కాదు కమలాభాయి గోఖలే. ఇలా మైథలాజికల్ అంశాలతో సినిమాలు తీసి భారతీయ సినిమా పితామహుడుగా నిలిచిన ఫాల్కె ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాల్లో పడింది. బొంబాయితో సహా కొల్హాపూర్, మద్రాస్, కలకత్తాలాంటి చోట్ల సినిమా నిర్మాణ కార్యక్షికమాలు ఊపందుకున్నాయి.

ప్రాంతీయ సినిమా

Chak-De-Indiaఫాల్కె ప్రభావం కొంత, స్వతహాగా ఉన్న కళాత్మక చైతన్యం కొంత తోడై దక్షిణ భారతదేశంలో సినిమా నిర్మాణ కార్యక్షికమాలు 1913కి సమాంతరంగానే మొదలయ్యాయి. దక్షిణాదిలో మొట్టమొదటి సినిమా ‘కీచక వధం’. ఈ చిత్రాన్ని ఆర్.నటరాజ మొదలియార్ నిర్మించాడు. ఇది కూడా మహాభారత కథ కావడం గమనార్హం. తర్వాత మద్రాస్‌లో 1921లో విట్టేకర్ ‘వల్లితిరు - మౌనం’తీశాడు. ఈ చిత్రం ఆర్థికంగానూ, విమర్శనాత్మకంగానూ విజయం సాధించింది. మూకీ సినిమాల నిర్మాణ రంగంలో దక్షిణ భారతదేశంలో అతి పెద్ద సంస్థగా నిలిచింది. జనరల్ పిక్చర్స్ కార్పోరేషన్ 1929లో అనంతనారాయణన్ స్థాపించిన ఈ సంస్థ పలు చిత్రాలు తీసింది. కేరళకు సంబంధించి 1931లో ‘మార్తాండ వర్మ’చిత్రం వచ్చింది. శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ నాగర్కోయిల్ బ్యానర్ పై ఆర్.సుందర్‌రాజ్ ఈ చిత్రం తీశాడు. పి.వి.రావు దర్శకత్వం బాధ్యతలు నిర్వహించాడు. ఈ సినిమా ఆనాడే చట్టపరమైన ఆంక్షల్ని ఎదుర్కొంది. ఇక మద్రాసు కేంద్రంగా ఎదిగిన తెలుగు చిత్రసీమలో 1926లో సి.పుల్లయ్య రూపొందించిన ‘మార్కండేయ’తొలి ప్రయత్నంగా వెలుగు చూసింది. తర్వాత 1931లో హెచ్.ఎమ్.డ్డి తీసిన ‘భక్త ప్రహ్లాద్’ తొలి టాకీగా చరివూతలో నిలిచింది. అనంతర కాలంలో రఘుపతి వెంకయ్య, గూడవల్లి రామవూబహ్మం, ఎల్వీ ప్రసాద్ తదితరుల విశేష కృషితో ముందుకు సాగిన తెలుగు సినిమా కె.వి.డ్డి, బి.ఎన్.డ్డి, చక్రపాణిలాంటి మహనీయుల ఛత్రచాయలో విస్తృతి పొందింది.

ఇక దేశంలో సినిమా నిర్మాణానికి వేదికగా నిలిచిన మరో కేంద్రం కొల్హాపూర్. బాబూరావు పెయింటర్‌గా ప్రసిద్ధుడైన బాబూరావు కేమిస్త్రి కొల్హాపూర్‌లో మహారాష్ట్ర ఫిలిం కంపెనీ ప్రారంభించి అనేక చిత్రాలు తీశాడు. కొల్హాపూర్ మహారాజా సహకారంతో చరివూతాత్మకమయిన ‘సైరేంవూది’చిత్రం రూపొందించాడు. 1920లో వచ్చిన ఈ సినిమాలో బాలా సాహెబ్ పవార్, కమలాదేవి, జుంజపూరావు పవార్లు ప్రధాన పాత్రలు పోషించారు. సరిగ్గా అదే సమయంలో ధీరెన్ గంగూలీ ఓ గొప్ప సటైర్ (వ్యంగ్యాత్మకమైన )సినిమా తీశాడు. విదేశీ పాలనపై స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న నేపథ్యంలో విదేశీ వ్యామోహాన్ని హేళన చేస్తూ ధీరెన్ గంగూలీ ‘ఇంగ్లండ్ రిటర్న్’చివూతాన్ని 1921లో నిర్మించాడు. ఇదే భారతీయ సినిమా చరివూతలో మొదటి ‘సాంఘిక వ్యంగ్య చిత్రం’గా పేరు గడించింది.

పౌరాణికాల నుంచి సాంఘికానికి...
భారతీయ సినిమా మొదటి దశాబ్దం పౌరాణిక కథలకి, కథనాలకి వేదిక కాగా అనంతర కాలంలో భారతీయ సినిమా క్రమంగా సాంఘిక అంశాల వైపు దృష్టి మరల్చింది. బాబూరావు పెయింటర్ 1925లో ‘సావ్ కార్ పాష్’చివూతంతో సామాజిక అంశాలతో సినిమా రంగానికి తెర తీశాడు. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న రైతు జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ చిత్రం తీశాడు పెయింటర్. మరోవైపు బెంగాల్లో ‘రాజా హరిశ్చంవూద’రిమేక్ సత్యవాది రాజ హరిశ్చంవూదతో 1917లో సినిమా నిర్మాణం ప్రారంభమైంది. రుస్తుంజీ దోతివాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మూకీ సినిమాల యుగంలో బెంగాల్లో దాదాపు 122 చిత్రాలు నిర్మితమయ్యాయి.

భారతీయ టాకీ యుగం
1930దాకా మాటలు లేని మూకీ సినిమాగా ముందుకు సాగిన భారతీయ సినిమా 14 మార్చి 1931రోజున ‘అలం ఆరా’ చిత్రంతో మాటలు నేర్పి ఇంపీరియల్ ఫిలిం కంపెనీ బ్యానర్‌పై అర్పేషిర్ ఇరాన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. క్రమంగా బాంబే భారతీయ చలన చిత్ర కేంద్రంగా ఎదిగింది. 1930ల్లో మాధురి (1931), ఇందిర ఎం.ఎ (1934), అనార్కలి (1935), మిస్ ఫ్రాంటియర్ మెయిల్ (1936), పంజాబ్ మెయిల్ (1939)లాంటి సినిమాలు విశేషంగా ప్రేక్షకుల్ని అలరించాయి. తర్వాత శాంతారాం, బిమల్ రాయ్, గురుదత్ ఇలా అనేక మంది దీపధారులుగా భారతీయ సినిమా ఎదిగి ముందుకు సాగింది. అయితే ప్రధాన స్రవంతి సినిమా కేవలం వినోదాన్ని లక్ష్యంగా చేసుకోగా, దానికి సమాంతరంగా ఎదిగిన అర్థవంతమైన సినిమా... కళకు, మానవీయ విలువలకు ఊతం ఇచ్చింది.
భారతీయ సినిమా ఈ వందేళ్ల ప్రస్థానంలో అనేక మలుపుల్ని, ఎత్తు పల్లాల్ని చూసింది. ఎన్నో విజయాల్ని, మరెన్నో అపజయాల్ని మూట కట్టుకుంది. ఏ కళనైనా అధ్యయనం చేయడానికి, పలు నిర్ధారణలకు రావడానికి ‘వందేళ్ల’కాలం తక్కువే కావచ్చు. కానీ అమిత వేగంతో విస్తరించిన మాధ్యమంగా ఈ ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.

మన సినిమా నూరేళ్ల సందర్భాన్ని వేడుకగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, చలన చిత్ర పరిక్షిశమ ఇప్పటికే ప్రణాళికలు వేస్తూ ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇటివలే పెద్ద ఎత్తున సినిమా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసింది.
దేశంలో రెండవ పెద్ద సినిమా ఇండస్ట్రీ అయిన తెలుగు సినిమా సైతం దీన్ని ఓ పండుగలాగా మొత్తం 2013వ సంవత్సరాన్ని శతవసంతాలకు అంకితం చేసి సినిమా అధ్యయన సంవత్సరంగా నిర్వహిస్తే బాగుంటుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమూ, తెలుగు చిత్రరంగం ముందుకు వస్తాయని ఆశిద్దాం!

వారాల ఆనంద్, 944050121.

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine