మెట్రో మూవీస్

metroడిస్కోలు...పబ్‌లు...వాలంటైన్స్ డేలు... డేటింగ్‌లు...మల్టీప్లెక్స్‌లు...
మెట్రో రైళ్లు...సిటీబస్సులు...ఇరుకు గదుల అపార్ట్‌మెంట్లు....షాపింగ్‌మాల్స్..
ఎట్‌సెట్రా అర్బన్ లైఫ్ స్టయిల్! బాలీవుడ్ మూవీస్‌కు ఇప్పుడిదే మెయిన్ ఎలిమెంట్!
భారీ బడ్జెట్, లో బడ్జెట్ ఇష్యూ కాదు...హిట్, ఫట్‌లతో సంబంధంలేదు!
ఆ కంటెంటే ఇంప్టాంట్...ఎట్ ప్రెజెంట్ కెమెరా కన్నుకు అదే ఎలిగెంట్!
ఆ పాయింటే రంగులకల నేటి సబ్జెక్ట్....

తెలుగులో నియో అర్బన్ మూవీస్....ఆలోచిస్తేగానీ తట్టనంత తక్కువ. వంశీ ‘ఔను...వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’, నీలకంఠ ‘మిస్సమ్మ’, చంద్రశేఖర్ ఏలేటి ‘ఐతే’, ‘, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ప్రయాణం’, శేఖర్ కమ్ముల ‘ఆనంద్’, ‘హ్యాపీ డేస్’, గౌతమ్ మీనన్ ‘ఏం మాయ చేశావే’లాంటివి. మన దర్శకులని క్రెడిట్ ఇచ్చి చెప్పుకుంటే నగేష్ కుకునూర్ తీసిన ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ను లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

డ్బ్బై, ఎనభైల మిడిల్‌క్లాస్ సినిమా రెండువేల నాటికి అర్బన్ మూవీగా మారింది. గ్లోబలైజేషన్ నగరాల్లోని మధ్యతరగతిని ఎగువ మధ్యతరగతిగా మార్చింది. పబ్‌లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఫ్లవర్ బొకెల గ్రీటింగ్స్, మదర్స్ డే, ఫాదర్స్‌డే, వాలంటైన్స్ డేల సంప్రదాయలను, సంస్కృతులను పరిచయం చేసింది. పార్ట్ ఆఫ్ లైఫ్‌గా మార్చింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌గా నేర్పింది. దీన్ని ముందు కాప్చర్ చేసి మూవ్ చేసింది మూవీ కెమెరానే! అంతేకాదు అమెరికా, యూరప్ దేశాలకు పెరిగిన భారతీయ వలసలూ బాలీవుడ్‌కు అర్బన్ కంటెంట్‌గా మారాయి.

బాంబే...ముంబై
1970, 80ల్లో వచ్చిన మధ్యతరగతి సినిమాలు బాంబే జీవితానికే కెమెరాను ఎక్కుపెట్టాయి. ఇప్పుడు వస్తున్న నియో అర్బన్ మూవీసూ ముంబై లైఫ్ స్టయిల్‌పైనే క్లాప్ కొట్టాయి. అప్పటి మిడిల్ క్లాస్ సినిమాకి, ఇప్పటి నియో అర్బన్ మూవీకి బడ్జెట్ పరంగా బోలెడు వ్యత్యాసం ఉంది. నలభై ఏళ్ల కిందటికి, ఇప్పటికి సాంకేతికంగా వచ్చిన మార్పులు సహజంగానే బడ్జెట్‌ను పెంచాయి. అయితే ప్రపంచీకరణ లొకేషన్ పరిధిని కూడా విస్తృతం చేసింది. కరన్ జోహార్, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, ఫర్హా ఖాన్, సాఙిద్‌లాంటి వాళ్లు ఆ పరిధిని ముంబై దాటించి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లకు విస్తరించారు. హృషిదా, బసు ఛటర్జీ, సాయి పరంజపే, గుల్జార్‌లాంటి వాళ్లు తీసిన సినిమాలు దాదాపు లో బడ్జెట్ చిత్రాలే! స్టార్ ఇమేజ్‌తో కాకుండా స్టోరీ ఇమేజ్‌తో హిట్టయిన కళాఖండాలే! కానీ ఇప్పుడు మధుర్ బండార్కర్, అనురాగ్ కశ్యప్, అనురాగ్ బసు, సుధీర్ మిశ్రాలాంటి వాళ్లు తప్ప మిగిలిన దర్శకులంతా స్టార్ ఇమేజ్‌తోనే నియో అర్బన్ మూవీస్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఫస్ట్ అర్బన్ హీరో...
ఏ రకంగా చూసిన ఫస్ట్ అర్బన్ హీరో క్రెడిట్ అమితాబ్ బచ్చన్‌కే దక్కుతుంది. ప్రకాశ్ మెహరా ‘జంజీర్’, ‘ముకద్దర్ కా సికందర్’, యాష్ చోప్రా ‘దీవార్’, ‘కాలా పత్తర్’ , రమేశ్ సిప్పి ‘శక్తి’ సినిమాలు అమితాబ్‌కు అర్బన్ హీరో ట్యాగ్‌ను చేర్చాయి. ఈ సినిమాల్లో కార్మిక, శ్రామిక జీవితాలు, వాళ్ల సమస్యలు, నగరంలోని వీధులు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టు గదులు, మురికి వాడలు, రెడ్‌లైట్ ఏరియాలు...ఈ సినిమాల్లో కనిపించే దృశ్యాలు. హీరో సామాజిక బాధ్యతను వహిస్తూ మధ్య తరగతి రక్షకుడిగా కనిపిస్తాడు. తర్వాత ఇదే అమితాబ్ బచ్చన్‌తో హృషిదా తీసిన సినిమాల్లో మధ్య తరగతి మానవ సంబంధాలు ముఖ్య భూమిక పోషించాయి. ముఖద్దర్ కా సికందర్ మోడ్రన్ దేవదాసును, ముకుల్ ఎస్ ఆనంద్ ‘అగ్నిపథ్’లో నగరీకరణ వల్ల తలెత్తుతున్న సమస్యలను సెల్యూలాయిడ్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు.

సీన్ మారింది
ఇప్పుడు బాలీవుడ్ సినిమాలన్నీ ( అయిదు శాతం తప్ప) అర్బన్ లైఫ్‌నే ఫోకస్ చేస్తున్నాయి. అయితే 70, 80ల సీన్ ఇప్పుడు లేదు. మారింది. నేటి సినిమాలకు ముంబై ఒక్కటే బేస్ కాదు మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్, న్యూయార్క్ లండన్, పారిస్, స్పెయిన్ నుంచి న్యూయార్క్, వాషింగ్‌టన్, మెల్‌బార్న్, సిడ్నీ, కేప్ టౌన్, సన్‌సిటీల జీవన శైలులూ సబ్జెక్టే. ఈ లొకేషన్సే కాదు, బట్టలు, వెస్ట్రన్ స్టయిల్, స్వేచ్ఛ లాంటివన్నీ నియో ట్రెడిషనల్ వ్యూసే. ఇవన్నీ ప్రతిబింబించే కరన్ జోహార్ సినిమాలు ఒక ఎత్తయితే నియో రియలిస్టిక్ దర్శకులుగా కొత్త నేమ్ కార్డ్‌ను మోస్తున్న మధుర్ బండార్కర్, అనురాగ్ కశ్యప్, అనురాగ్ బసు, సుధీర్ మిశ్రాలాంటి వాళ్ల సినిమాలు ఒక ఎత్తు. సుధీర్ మిశ్రా ‘చమేలీ’, ‘హజారో క్వాయిషీ ఐసే’, ‘యే సాలీ జిందగీ’ సినిమాలు అర్బన్ లైఫ్‌లోని డార్క్ షేడ్స్, రివల్యూషన్స్, రియల్ ఎస్టేట్ మాఫియాను డిఫంట్ యాంగిల్‌లో చూపిస్తే...మధూర్ బండార్కర్ ట్రాపిక్ సిగ్నల్, చాంద్‌నీ బార్, పేజ్ త్రీ, ఫ్యాషన్, కార్పొట్ సినిమాలు నగరజీవితాల్లోని వాస్తవ పరిస్థితులను ఫ్రేమ్ చేశాయి. అనురాగ్ బసు ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’ నగరాల్లోని మానవ సంబధాలకు రూపమిచ్చింది. అయన్ ముఖర్జీ ‘ వేకప్ సిద్’ నగరాల్లో కామన్‌గా కనిపిస్తున్న ఆడా, మగ స్నేహాలు, సహజీవనాల మీద దృష్టి పెట్టింది.

స్లమ్ లైవ్స్...
పైన చెప్పినవి కాక మరో కోవలో ఒదిగే అర్బన్ మూవీసూ ఉన్నాయి. కేతన్ మెహతా ‘ధారవి’, గోవింద్ నిహలాని ‘పార్టీ’, ‘దృష్టి’, మీరా నాయర్ ‘సలాం బాంబే’, అనురాగ్ కశ్యప్ ‘బ్లాక్ ఫ్రైడే’ లాంటివి. ఇవి స్లమ్ నుంచి పేజ్ త్రీ కల్చర్ దాకా అన్ని అర్బన్ ఏరియాలను టచ్ చేసిన సినిమాలు. మధుర్ బండార్కర్ ‘పేజ్ 3’ కన్నా ముందే గోవింద్ నిహలాని ‘పార్టీ’ తీశాడు. ముంబైలోని రచయితలు, కవులు, కళాకారుల జీవన శైలిని పార్టీలో చూపించాడు. అంతేకాదు నక్సలైట్‌గా హీరోపాత్ర అదృశ్యంగా ఉంటూ జీవితాలను ప్రభావితం చేసిన తీరుమీద ఈ సినిమా కొత్త ప్రయోగం అనురాగ్ బసు ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’ కంటే ముందే దృష్టి చూపించాడు. నగరాల్లోని సంసారాల్లో ఉండే ఒడిదుడుకులను సున్నితంగా పట్టుకున్నాడు. మీరా నాయర్ ‘సలాంబాంబే’ కంటే ముందే కేతన్ మెహతా ‘ధారవి’ని రీల్‌కెక్కించాడు. ఇవి నిజంగానే నియో రియలిస్టిక్ మూవీస్. హృషిదా, బసు చటర్జీలు పరిచయం చేసిన అమోల్‌పాలేకర్, ఫరూఖ్ షేక్, విజయేంద్ర ఘాట్కె లాంటి అసామాన్య హీరోలను ఈ సినిమాలూ పరిచయం చేశాయి. ఇర్ఫాన్ ఖాన్, రాహుల్ బోస్’, కెకె మీనన్, శర్మాన్ జోషి, షైనీ అహుజాలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల స్టఫ్‌ను చూపించాయి.

హెవీ అర్బన్ స్టయిల్స్
అమీర్‌ఖాన్, సైఫ్, అక్షయ్ ఖన్నాలాంటి పర్సనాలిటీస్ ఈ సినిమా హీరోలు! కథ ఇండియాలో మొదలై ఖండాంతరానికి ప్రయాణం చేసి మళ్లీ ఇండియాలో ముగుస్తుంది. లైఫ్ స్టయిల్ కూడా దేశీ, విదేశీ కలయికలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ‘దిల్ చాహతా హై’ లాంటి సినిమాలు. ఏమాటకామా భారీ బడ్జెట్, కథలో కాస్ట్లీ ఫ్లర్టింగ్, వయసంతరం చూడని ప్రేమ లాంటి ఎమోషనల్ ఎలిమెంట్లతో హెవీ అర్బన్ లైఫ్ స్టయిల్‌ను ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా మిగిలింది. విదేశీ యానం, ఫారిన్ లొకేషన్స్, సేమ్ త్రీ ఫ్రెండ్స్ థీమ్‌తో వచ్చిన ‘జిందగీ న మిలేగీ దొబారా’ కూడా హెవీ అర్బన్ లైఫ్ స్టయిల్ కేటగిరీయే. మధుర్ బండార్కర్ ప్రొడక్షన్స్‌లో వచ్చిన దిల్ తో బచ్చా హై జీ కొంచెం భిన్నమైంది. ఇవికాక ఆమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్‌లో రిలీజ్ అయిన దోభీ ఘాట్, ఢిల్లీ బెల్లి, ఢిల్లీ సిక్స్, ఛలో దిల్లీ, భేజా ఫ్రైలు నియో అర్బన్ మూవీస్‌లోనే కొంచెం డిఫంట్ టైప్. ఇక ‘కల్ ఎస్టర్ డే అండ్ టుమారో’, రామ్‌గోపాల్ వర్మ ‘రణ్’, ఓనీర్ ‘సారీ భాయి’, ‘యే ముంబై మేరీ జాన్’, ‘కుఛ్ లవ్ జైసా’, ‘ప్యార్ కా సైడ్ ఎఫెక్ట్స్’, ‘చైన్ కులీ కి మై కులీ’ లాంటి సినిమాలూ భిన్న అంశాలతో అర్బన్ జీవితాన్ని తెరకెక్కించినవే.

గ్యాంగ్ ల్యాండ్ మూవీస్
రామ్‌గోపాల్ వర్మ ముంబై లైఫ్‌ను చూపించిన సినిమాలకు గ్యాంగ్ ల్యాండ్ మూవీస్ అని పేరు. సత్య, కంపెనీ, సర్కార్, మొన్నటి డిపార్ట్‌మెంట్, షూట్ ఎట్ లోఖండ్ వాలా దాకా అన్నీ గ్యాంగ్‌ల్యాండ్ మూవీసే. ఈ సినిమాలన్నిటికీ నేపథ్యం ముంబై మాఫియా! పేలుళ్లు, తుపాకి తూటాలు, హింస, గ్యాంగ్‌వార్స్ ఈ థీమ్స్ చుట్టే తిరుగుతాయి ఆ సినిమాలు. నిన్న మొన్న వచ్చిన ‘షోర్ ఇన్ ద సిటీ’, ‘చార్ చెయాసీ’ లాంటి సినిమాలూ అర్బన్ లైఫ్ స్టయిల్‌కు డిఫంట్ యాంగిల్సే.

లాస్ట్ రీల్
70ల నుంచి నేటిదాకా కాలం మారుతున్నట్టే దానికనుణంగా సినిమా తీరూ మారుతూ వస్తున్నది. ఇప్పుడూ ఓ వైపు తెలుగు, తమిళ రీమేక్‌ల మీద ఆధారపడుతున్న వర్గం ఉంది. అయినా ఇంకో వర్గం మధ్యతరగతి నాడీ పట్టుకుని తగ్గట్టుగా కథలు అల్లుకుంటూ టైమ్ ఛేంజెస్‌కు ఫ్రేమ్ కడుతూ సొసైటీని ప్రభావితం చేస్తోంది. మరోవైపు తన సినిమాల ద్వారా కొత్త కల్చర్‌ను పరిచయం చేస్తూ సంచలనాలకూ సెంటర్‌గా మిగులుతోంది. జియో బాలివుడ్!

జిందగీ డెస్క్

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine