లోకల్ 2 నేషనల్

herosఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్‌లందరూ లోకల్ స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నవాళ్లే. ప్రాంతీయ అభిమానానికి ప్రతిరూపాలే కానీ, లోకల్ స్టాంప్‌తో తిరగాల్సిందే. దక్షిణ భారత చలనచిత్ర పరిక్షిశమ నుంచి బయటపడి బాలీవుడ్‌లోకి ఎంటర్ అయితే.... అతడో నేషనల్ హీరో! రేంజ్‌ను పెంచుకున్న స్టార్!
ప్రస్తుతం బాలీవుడ్‌లో భవిష్యత్‌ను బిల్డప్ చేసుకోగల సత్తా ఉన్న హీరోస్ కనిపిస్తున్నది టాలీవుడ్‌లోనే!
అందుకు ఉదాహరణగా రానా, రామ్‌చరణ్ వంటివాళ్లను చూపించవచ్చు.

హీరోగా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయడం ఎంత కామనో, ఒక తెలుగు హీరోకు బాలీవుడ్‌లో హీరోగా అవకాశం వస్తే సంతోషంతో స్టెప్పులేయడం కూడా అంతే సహజం. సినిమా ప్రపంచంలో బాలీవుడ్ రేంజ్ వేరు. అక్కడికి వెళ్లడమంటే ప్రాంతీయ చిత్ర పరిక్షిశమ నుంచి జాతీయ చిత్ర పరిక్షిశమకు ప్రమోషన్‌పై వెళ్లడం లాంటిది. అందుకే ఒక తెలుగు హీరోతో బాలీవుడ్ మూవీ ‘జంజీర్’ రీమేక్ జరుగుతుండటం నిజంగా విశేషమే. ఇప్పుడు తెలుగు చిత్రపరిక్షిశమ జనరేషన్ పూర్తిగా మారిపోయింది. అందరూ యాంగ్రీ యంగ్‌మేన్‌లే. సరుకులు, సరంజామా పట్టుకుని బాలీవుడ్‌లో ఒక సినిమా తీయడం కాదు......నిజంగా ఛాన్స్‌రావడం అంటే వెతుక్కుంటూ రావాలి. ఇప్పుడు జరిగింది అదే. ‘జంజీర్’ సినిమా సక్సెస్ అయితే గనుక, ఇప్పటిదాకా తెలుగు సినిమా కాపీరైట్లు కొనుక్కుంటున్న ‘బాలీవుడ్’ ఇకముందు హీరోలపై కూడా ఓ కన్నేస్తుంది. అది హీరోల స్టార్‌డమ్‌కే కాదు పరిక్షిశమ స్థాయి పెరిగేందుకు కూడా దోహదమవుతుంది.

Rana-Daggubatiసినిమారంగంలో వస్తున్న అనేక మార్పుల్ని ఆహ్వానిస్తూ, ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్నా ఇప్పటికీ దక్షిణ భారత చలనచిత్ర పరిక్షిశమల హీరోలు నేషనల్ హీరోస్ కాలేదు. ప్రాంతీయ హీరోలే. అవసరమైతే డబ్బింగ్ చిత్రాలతో పక్క ‘వుడ్’లను పలకరిస్తూ బిజినెస్ పెంచుకుంటున్నారు తప్ప తమ స్థాయిని, విస్తృతిని పెంచుకునే ప్రయత్నాలైతే కనిపించ చెప్పాలంటే యాడ్స్ వల్ల కొంత పాపులారిటీ వచ్చింది కానీ సినిమాల వల్ల వాళ్లకు పెద్దగా ప్రయోజనం కలుగలేదు). ఒక్క బాలీవుడ్ సినిమాలో హీరోగా నటిస్తే చాలు దేశమంతా పాపులర్ అయిపోవచ్చు. కానీ అదెంతమంది ప్రాంతీయ హీరోలకు సాధ్యం? బాలీవుడ్ అవకాశం ఆషామాషీకాదు! ఒకవేళ వస్తే విశేషమే. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నోళ్లే నిజమైన హీరోలు!

పోటీని తట్టుకోగలరా?
Ram-Charanఇప్పుడున్న యంగ్ జనరేషన్‌లో మహేష్‌బాబు ఎప్పుడో బాలీవుడ్‌కు పరిచయం కావాల్సి ఉండె. పూరీ జగన్నాథ్ బిజినెస్‌మేన్‌తోనే అతడ్ని బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడని చాలాకాలం వార్తలు వచ్చాయి. కానీ మహేష్ అనాసక్తితో ఆలస్యం అవుతూనే ఉంది. ఆ తరువాత వినిపించిన పేరు రామ్‌చరణ్‌దే. ఎన్టీయార్, పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్‌లాంటి వాళ్లకు అలాంటి కోరికలూ, అవకాశాలు లేవు. అందరూ ఊహించిన మహేష్ కంటే రామ్‌చరణే ముందుగా పరిచయం అవుతున్నాడు. అయితే వీళ్లిద్దరి కన్నా ముందు బాలీవుడ్‌కు పరిచయమైన రానా సంగతేంటి? రానా నటించిన ‘దమ్ మారో దమ్’, ‘డిపార్ట్‌మెంట్’ చిత్రాలు మల్టీస్టారర్ కావడం వల్ల ఆయనకు ఎక్కువ స్కోప్ లేదు. కానీ జంజీర్ విషయానికొస్తే హోల్ అండ్ సోల్ అన్నీ రామ్ చరణ్! అందుకే ఆ చిత్రంపై ఎన్నో అంచనాలు, ఆసక్తి పెరుగుతున్నాయి. అసలు సమస్య కూడా ఇక్కడే ఉంది. బాలీవుడ్ హీరోకు ఒక రేంజ్ ఉంటుంది. సపరేట్ బాడీలాంగ్వేజ్, క్రేజీ ఫిట్‌నెస్ ఉంటుంది. ఇప్పటికే అక్కడున్న సల్మాన్‌ఖాన్ కండల్ని, హృతిక్ డ్యాన్సుల్ని బీట్ చేయడం కుదరని పని. అసలు అక్కడ పోటీని రామ్‌చరణ్ తట్టుకోగలడా? అనేది మిలియన్‌డాలర్ల ప్రశ్న. ఆ చిత్రం కోసం బాడీ బిల్డప్ చేయడం, హిందీలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం వంటి రామ్‌చరణ్ ప్రయత్నాలు చూస్తే ఎలాగైనా సక్సెస్ కావాలనే కసితో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడిప్పుడే....
ఇప్పుడు బాలీవుడ్‌కు బాగా దగ్గరవుతున్న దక్షిణ భారత చిత్ర పరిక్షిశమ టాలీవుడ్. క్రమంగా టాలీవుడ్ హీరోల రేంజ్ పెంచుకుంటూ ఒక్కొక్కరుగా బాలీవుడ్‌కు దగ్గరవుతున్నారు. యంగ్ హీరోలు చిత్ర పరిక్షిశమ స్థాయిని పెంచుతున్నారని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌కు మొన్నటికి మొన్న పూరీ జగన్నాథ్ బిగ్‌బీతో బుడ్డా సినిమా తీసి టాలీవుడ్ యంగ్ టాలెంట్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అంతకుముందే దగ్గుబాటి రానా దమ్ మారో దమ్ చిత్రంలో బిపాసాతో జతకట్టి మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తరువాత డిపార్ట్‌మెంట్‌లో పోలీసాఫీసర్‌గా కనిపించాడు. బాలీవుడ్‌లో ఇప్పటికీ ఆయనకు మంచి అవకాశాలే వస్తున్నాయి. అన్నిటికంటే హాట్‌టాపిక్‌గా మారిన విషయం జంజీర్ రీమేక్. 1973లో అమితాబ్‌కు యాంగ్రీయంగ్‌మేన్ బిరుదును తెచ్చిపెట్టిన ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుని సరైన యాక్టర్‌కోసం చాలాకాలంగా ఎదురు చూశారు ఆ చిత్ర నిర్మాత, దర్శకులు. రామ్ చరణ్ కనిపించాకే జంజీర్ రీమేక్ ఓకే అయ్యింది.

మనమే బెటర్
ఇప్పుడు మన చిత్రపరిక్షిశమ గురించే ఎందుకు మాట్లాడుకోవాలంటే, దక్షిణభారత చలన చిత్రపరిక్షిశమల్లో తమిళ్, కన్నడ, మళయాల పరిక్షిశమల నుంచి బాలీవుడ్‌కు నటులుగా కొందరు వెళ్లి ఉండవచ్చు కానీ హీరోలుగా అక్కడ స్టార్‌డమ్‌ను అనుభవించినవావ్లూవరూ లేరు. రజనీకాంత్ కూడా హిందీలో అమితాబ్‌వంటి నటులతో కలిసి నటించాడు. అదంతా పాత విషయం. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మాత్రం ఎవరూ బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడటం లేదు. తమిళ్‌లో విక్రమ్, సూర్య, అజిత్, ధనుష్ వంటి హీరోలు లోకల్‌స్టార్‌డమ్‌నే ఇష్టపడతారు. నిజం చెప్పాలంటే తమిళ తంబిలకు అక్కడి మట్టిపై అతి మమకారం (తమిళులకు హిందీ అంటే పడదు. వాళ్లు హిందీ సినిమాలకు దూరంగా ఉండేందుకు అది కూడా ఒక కారణం కావచ్చు). పైగా అక్కడికెళ్లి పోటీలో పడి కొట్టుకుపోవడం కంటే ఇక్కడే ఉండి వెలిగిపోవడం మంచిదని భావిస్తున్నారు. అయితే డబ్బింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పక్క పరిక్షిశమలపై కన్నేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు టార్గెట్‌గా తమిళ్ చిత్ర పరిక్షిశమ సినిమాలు తీస్తున్నది.

డబ్బింగ్ చేసి ఆంధ్రవూపదేశ్ మీదకు వదులుతుంది. ఇక్కడి కలెక్షన్లు కొల్లగొ కథలు ప్లాన్ చేసుకుంటున్నాయి. మళయాలం, కన్నడ చిత్ర పరిక్షిశమలు తమ పని తాము చేసుకుంటున్నాయి. మళయాలం నేషనల్ అవార్డులు కొట్టగలుతుంది కానీ బాలీవుడ్‌లోకి ఎంటర్ కావడానికి ఇష్టపడదు. ఇక మిగిలింది తెలుగు చిత్రపరిక్షిశమ. మొన్నటి వరకు ఆంధ్రవూపదేశ్‌లోనే హవా నడిచిన బిజినెస్ కాస్తా, తమిళనాడు, కేరళ వరకు విస్తరించింది. ఈ పరిణామాలన్నీ క్రమంగా తెలుగు చిత్రపరిక్షిశమ స్థాయిని పెంచుతున్నవే. గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే... బాలీవుడ్‌కు వెళ్లేవాళ్లలో అర్హతలు, అవకాశాలు తెలుగు హీరోలకు ఎక్కువగా ఉండటం! ఆ క్రెడిట్ అంతా ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌దే అని ఒప్పుకోవాల్సి వుంటుంది.

బాలీవుడ్‌లో వందకోట్లు వసూలు చేసిన చిత్రాల్లో వాంటెడ్ ఉంది. రీసెంట్‌గా రిలీజైన రౌడీ రాథోడ్ కూడా అదే దారిలో ఉంది. అయితే అవి రెండూ దక్షిణ భారత చిత్రాలైన పోకిరి, విక్రమార్కుడు సినిమాలకు రీమేక్స్. మన సినిమాల వల్ల సల్మాన్‌కు, అక్షయ్‌కుమార్ పూర్వవైభవం, పాత స్టార్‌డమ్ వచ్చిందని చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది. కానీ చిత్ర పరిక్షిశమ పరిధి పెరిగేది ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్ అయినప్పుడు కాదు...మనవాళ్లు అక్కడ పాగా వేసినప్పుడు! ఇది పెద్ద కోరికే కావచ్చు కానీ, అవకాశమొస్తే మనవాళ్లు బాలీవుడ్‌ను దున్నేయాలని కోరుకోవడంలో తప్పేముంది?

గతమంతా ఘనమేనా?
తెలుగు హీరోలు బాలీవుడ్‌కు పరిచయం కావడం ఇప్పుడు కొత్త విషయమేమీ కాదు. చిరంజీవి, నాగార్జున, వెంక హీరోలు హిందీ సినిమాల్లో నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. అయితే అప్పటి పరిస్థితులు, స్థితిగతులు వాళ్లకు పరీక్షగా మారాయి. చిరంజీవి అంకుశం రీమేక్‌గా ‘ప్రతిబంధ్’ అనే హిందీ చిత్రంతో 1990లో గ్రాండ్‌గానే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ తరువాత 1992లో ‘ఆజ్ కా గూండారాజ్’, 1994లో ‘ది జెంటిల్‌మేన్’ అనే హిందీ చిత్రాలు చేశాడు. అయితే అవి కూడా బాలీవుడ్‌లో చిరంజీవి రేంజ్‌ను ఏ మాత్రం పెంచలేదు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నీ చిరంజీవి మాతృసంస్థలా భావించే ‘గీతా ఆర్ట్స్’ నిర్మించినవే. ఎనభయ్యో దశకం మధ్య నుంచే చిరంజీవికి తెలుగులో కమర్షియల్ స్టార్ రేంజ్ పెరుగుతూ వచ్చింది. 1990లలో ఆయన ఇమేజ్ పీక్స్‌కు వెళ్లింది. అయినా కూడా బాలీవుడ్‌లో తను సక్సెస్ కాలేకపోయాడు.

చిరంజీవి దారిలోనే వెళ్లిన ఇంకో ఇద్దరు హీరోలు నాగార్జున, వెంక అయితే చిరంజీవి, వెంక కంటే నాగార్జునకు హిందీలో ఎక్కువ ఛాన్సులు వచ్చాయి. నాగార్జున హిందీలో సోలో హీరోగా నటించిన చిత్రం క్రిమినల్ మాత్రమే. మిగతావన్నీ మల్టీస్టారర్ చిత్రాలు. ఎల్‌ఓసీ కార్గిల్, జఖ్మ్, ఖుదాగవా, అంగారే, అగ్నివర్ష్ వంటి చాలా చిత్రాలే ఉన్నాయి. ఆయనకు బాలీవుడ్‌తో యాక్టర్‌గా మంచి అనుబంధమే ఉంది. తెలుగులోనూ గెస్ట్ రోల్స్ చేయడానికి వెనకాడని నాగార్జున అలాంటి పాత్రలవల్లే బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడూ మెరిసిపోయాడు. ఇక వెంక విషయానికొస్తే, ఆయన చంటి రీమేక్‌గా వచ్చిన ‘అనారీ’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ‘యమలీల’ చిత్రం రీమేక్‌గా ‘తక్‌దీర్‌వాలా’లో నటించాడు. ఆ తరువాత కూడా హాతీ, హైరానా వంటి హిందీ చిత్రాలు చేశాడు. కానీ ఫలితం పెద్దగా కనిపించలేదు. అందుకే వాళ్లకు బాలీవుడ్ కలిసిరాలేదు. మన కుర్రోళ్లు ఏం చేస్తారనేది ఇప్పుడే సమాధానం దొరకని ప్రశ్న.

మహేందర్

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine