విరబూసేనా నవ మల్లిక
-ఒలింపిక్స్‌లో పతకం సాధించడం
భారత్‌కు సాధ్యం కాదనే అభివూపాయాలు వ్యక్తమవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం సాధించి విశ్వవేదికన త్రివర్ణ పతాకాన్ని
రెపపలాడించింది. ఆ ఒలింపిక్స్‌లో భారత్‌కు లభించింది ఆ ఒక్క పతకమే. కాగా, ఆ తరువాత 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్‌లో మల్లీశ్వరితో సహా ముగ్గురు మహిళా లిఫ్టర్లు పాల్గొన్నా పతకం మాత్రం దక్కలేదు. ఇక 2008లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మనకు పోటీపడే అవకాశమే దక్కలేదు. మళ్లీ ఈసారి లండన్ ఒలింపిక్స్‌లో మనవాళ్లకు రెండు బెర్తులు దక్కాయి. మహిళల 48 కిలోల విభాగంలో సోనియా చాను, పురుషుల 69 కిలోల విభాగంలో కాటూలు రవికుమార్‌లు విశ్వక్షికీడల్లో పాల్గొననున్నారు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ పన్నెండేళ్ల విరామం తర్వాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ పతకాన్ని సాధించి పెట్టగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ:వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈసారి పెద్దగా అంచనాలు లేకున్నా తమ ఫామ్‌ను, సామర్థ్యాన్ని చాటితే భారత్ ఖాతాలో పతకాన్ని చేర్చగలిగే సమర్థులు సోనియా చాను, రవికుమార్. ఈ ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించడం ద్వారా లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వీరిద్దరు భారత్‌కు రెండు విభాగాల్లోనూ పతకంపై ఆశలు రేకెత్తిస్తున్నారు. కొరియాలో పురుషుల టీమ్ స్టాండింగ్స్ 134 పాయింట్లు నమోదు కాగా, మహిళల విభాగంలో 93 పాయింట్లు నమోదయ్యాయి. ఇక ఈ ఇద్దరికీ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. కాగా, మహిళల 48 కిలోల కేటగిరిలో పోటీపడనున్న మణిపూర్‌కు చెందిన చాను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సంయుక్తంగా 10వ స్థానంలో కొనసాగుతోంది. లండన్‌లో చాను పతకం సాధించాలంటే 178 కిలోల మార్కును చేరాల్సి ఉంటుంది. ఇదే విషయమై చాను మాట్లాడుతూ ‘ఇటీవలే కొరియాలో స్నాచ్‌లో 75 కిలోలు ఎత్తి కాంస్యం సాధించాను.
క్లీన్ అండ్ జెర్క్‌లో 100 కిలోలు ఎత్తి ఓవరాల్‌గా 175 కిలోలతో నాలుగో స్థానంలో నిలిచానం’ది. కాగా, ఒరిస్సాకు చెందిన రవికుమార్ తొలినాళ్లలో బాడీ బిల్డర్. 2007లో వెయిట్‌లిఫ్టింగ్ వైపు దృష్టి సారించి 2010 కామన్వెల్త్ క్రీడల్లో 69 కిలోల విభాగంలో మూడు కాంస్యాలు సాధించాడు. ఈ పోటీల్లో ఓవరాల్‌గా 321 కిలోలు (146 కిలోల స్నాచ్, 175 కిలోల క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కామన్వెల్త్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కాగా, చాను, రవికుమార్‌లు ప్రస్తుతం పాటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీరు గురించి వివరిస్తూ ‘సౌకర్యాలు ఒలింపిక్స్‌కు తగినట్లుగా చక్కగా ఉన్నాయి. నా ఫిట్‌నెస్ కూడా మెరుగుపడింద’ని 32 ఏళ్ల చాను చెప్పింది. ఇరువురూ లండన్‌కు ఈ నెల 16న బయలుదేరి వెళ్లనున్నారు.
6వేల పైచిలుకు డోప్ టెస్టులట!
ముంబై: లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు డోపింగ్ టెస్ట్‌ల కోసం సేకరించనున్న శాంపిల్స్ సంఖ్య ఇది! ఒలింపిక్స్ చరివూతలో ఇదే అత్యధికమట. సో.. ఇదో రికార్డన్నమాట. ‘లండన్ గేమ్స్ ఒలింపిక్స్ చరివూతలోనే అత్యధిక డోప్ టెస్ట్‌లు నిర్వహించిన ఈవెంట్‌గా రికార్డులకెక్కనున్నాయి. అందుకే ఆటగాళ్లంతా యాంటీ డోపింగ్ అధికారుల నిఘాలో ఉంటామన్న సంగతిని గుర్తెరగాలి’ అని ప్రపంచ డోపింగ్ రహిత సమాఖ్య (వాడా) ప్రెసిడెంట్ జాన్.ఎఫ్ అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ, లండన్ గేమ్స్ నిర్వాహక కమిటీ సంయుక్తంగా 6250 శాంపిల్స్ సేకరిస్తాయట.
డోప్ టెస్ట్‌లో పట్టుబడి..
-పారాలింపిక్స్ నుంచి భారత అథ్లెట్ ఔట్
న్యూఢిల్లీ: లండన్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత షాట్‌పుటర్ హితేశ్ సచిదేవ డోప్‌టెస్ట్‌లో దొరికిపోయాడు. దీంతో ఆగస్టు 29 నుంచి జరిగే పారాలింపిక్స్ నుంచి అనర్హతకు గురయ్యాడు. యూపీకి చెందిన ఈ అంధ అథ్లెట్ నుంచి గతవారం సేకరించిన శాంపిల్-ఏలో అతను నిషేధిత నాన్డ్రోలోన్ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు స్పష్టమైంది. ‘ప్రపంచ డోపింగ్ రహిత సమాఖ్య (నాడా) నుంచి హితేశ్‌కు సంబంధించిన శాంపిల్-ఏ మాకు అందింది. అతను పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతణ్ని పారాలింపిక్స్ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అని యూపీ పారాలింపిక్స్ సంఘం కార్యదర్శి నితిన్ ఆర్య చెప్పారు.
రంజిత్‌కు క్లియన్స్
న్యూఢిల్లీ: ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరికి ఒలింపిక్స్ కోసం క్లియన్స్ లభించింది. ఇటలీలో జరుగుతున్న ఫిట్‌నెస్ ట్రయల్స్‌లో మహేశ్వరీ పాసయ్యాడని బుధవారం ఏఎఫ్‌ఐ పేర్కొంది. ‘రంజిత్ 16.45మీ.తో ట్రిపుల్ జంప్ ట్రయల్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేశాడని రిపోర్ట్ వచ్చింద’ని ఏఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్ సీకే వాల్సన్ అన్నారు. ఐతే మహిళా ట్రిపుల్ జంపర్ మయూఖా జానీ, మారథాన్ రన్నర్ రామ్ సింగ్ యాదవ్‌లు ఇంకా ట్రయల్స్‌లో తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సివుందని ఏఎఫ్‌ఐ తెలిపింది. కాగా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాక కూడా ఫిట్‌నెస్ ట్రయల్స్ నిర్వహించడమేమిటని రామ్ సింగ్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
నైపుణ్యాలకు మరింత పదును పెడతా
న్యూఢిల్లీ: విశ్వక్షికీడల్లో ఈసారి భారత హాకీ జట్టు జర్మనీ, బెల్జియంలాంటి ఒలింపిక్ చాంపియన్లున్న గ్రూప్‌లో ఉంది. డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్‌లాంటి ఆటగాళ్లు అద్భుతాలు చేస్తేనే సెమీస్ ఆశలు నిలిచేది. తాను ఇందుకు ఆనుగుణంగానే ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నానంటున్నాడు సందీప్. ‘పూర్తి సామర్థ్యం మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తా. ఆ క్రమంలో కాలానుగుణంగా మారుతున్న డ్రాగ్ ఫ్లికింగ్ నైపుణ్యాలకు మరింత పదునుపెడతా. నా దృష్టిలో ఈసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న అత్యుత్తమ జట్లలో భారత్ కూడా ఒకటి. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. మెరుగైన ప్రదర్శన కోసం సర్వశక్తులు ఒడ్డుతాం. కీలక ఒలింపిక్స్ ముందు దక్షిణావూఫికా, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ జట్లతో మ్యాచ్‌లాడాం కాబట్టి అమూల్యమైన ప్రాక్టీస్ కూడా దొరికింది’ అని సందీప్ అన్నాడు.
పోరాడి ఓడిన భారత్
లా అల్బెరికా (స్పెయిన్): ఫ్రెండ్లీ హాకీ ఆఖరు మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. బుధవారం దక్షిణావూఫికాతో జరిగిన ఫైనల్లో భారత్ 3-4 తేడాతో పోరాడి ఓడింది. భారత తరపున డానిష్ ముజ్తాబా, సందీప్ సింగ్, ఎస్కే ఉతప్పలు గోల్స్ చేశారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి దక్షిణావూఫికా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఐతే ద్వితీయార్ధం మొదలైందో లేదో (47వ) భారత్.. 2-2తో సఫారీలతో సమంగా నిలిచింది. ఈ దశలో ఇరు జట్లు వెంట చెరో గోల్ చేసినా, ఆట 61 నిమిషంలో జస్టిన్ రీడ్ చేసిన గోల్ దక్షిణావూఫికాను విజేతగా నిలబెట్టింది. గ్రేట్ బ్రిటన్, స్పెయిన్‌లు మిగతాజట్లుగా భారత పాల్గొనే ముక్కోణపు సిరీస్ 14 నుంచి జరుగుతుంది. తొలి మ్యాచ్ భారత్-క్షిగేట్ బ్రిటన్ మధ్య ఉంటుంది.
నేగీకి విజయం
లీడెన్ (ది నెదర్లాండ్స్): భారత గ్రాండ్ మాస్టర్, ఆసియా చాంపియన్ పరిమార్జన్ నేగీ లీడెన్ చెస్‌లో ఐదోరౌండ్ ముగిసేసరికి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. బుధవారం హాలెండ్ గ్రాండ్‌మాస్టర్ ఫ్రాంక్ ఎర్విచ్‌తో ఐదో రౌండ్‌లో నేగీ విక్టరీ కొట్టాడు. ఈ విజయంతో నేగీ ఓవరాల్‌గా 4 పాయింట్లు సాధించాడు. మన మిగతా గ్రాండ్‌మాస్టర్లలో లలిత్‌బాబు వరుసగా నాలుగో విజయంతో 4 పాయింట్లతో నేగీ సరసన నిలిచాడు. అరుణ్ ప్రసాద్ (3.5 పాయింట్లు)కు డ్రా ఎదురవ్వగా, మహిళా గ్రాండ్ మాస్టర్ కాదంబరి (3 పాయింట్లు) ఓటమిపాలైంది.
Other News