దాదాకు ఏపీ ధమాకా!
బంపర్ మెజారిటీ ఇక్కడినుంచే
- పోలైన 190 ఎమ్మెల్యే ఓట్లలో 182..
- ఎంపీ ఓట్లలో 47 ప్రణబ్‌కే
- సంగ్మాకు లభించింది మూడు ఓట్లే
- దాదాకు లంభించిన ఓట్ల విలువ 60,212
- సంగ్మాకు లంభించిన ఓట్ల విలువ: 444
- చెల్లకుండా పోయిన ఐదు ఓట్లు
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 22 (టీ మీడియా): కొత్త రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ బంపర్ మెజారిటీని కట్టబెట్టింది. అందరూ ఊహించినవిధంగానే ఆంధ్రవూపదేశ్ నుంచి యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి అత్యధికంగా ఓట్లు లభించాయి. మరే రాష్ట్రంలో లభించనిరీతిలో ప్రణబ్‌కు ఇక్కడి నుంచి ఓట్లు పోలయ్యాయి. ఆదివారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల లెక్కింపులో దాదా ఊహించని మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. ఆంగ్ల అక్షరక్షికమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచే ఆంధ్రవూపదేశ్, దేశ ప్రథమ పౌరుడి పదవి కోసం యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రణబ్‌కు మెజారిటీ అందించడంలో సైతం అదే స్థానాన్ని కొనసాగించింది. రాష్ట్రం నుంచి పోలైన ఓట్లలో ప్రణబ్‌కు 60,212 ఓట్ల విలువ దక్కగా, సంగ్మాకు కేవలం 444 ఓట్ల విలువ మాత్రమే దక్కింది. ప్రణబ్‌కు 182 మంది ఎమ్మెల్యేలు, 34 మంది లోక్‌సభ ఎంపీలు, 13 మంది రాజ్యసభ ఎంపీలు ఓటేశారు. సంగ్మాకు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఐదుగురు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లలేదు.
దీంతో సంగ్మాకొచ్చిన ఓట్ల విలువ కన్నా మురిగిన ఓట్ల విలువే అధికంగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 190 మంది ఎమ్మెల్యేలు, 47 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగ్మాకు అనుకూలంగా వేసినట్లు భావిస్తున్న ఐదు ఓట్లలో రెండు చెల్లకుండా పోయాయి. అదేవిధంగా ప్రణబ్‌కు వచ్చాయని భావించిన 185 ఓట్లలో మూడు ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల ఓట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లలేదని ఓట్ల లెక్కింపులో తేలింది. ఎంపీల విషయానికి వస్తే కాంగ్రెస్‌కు చెందిన 31 మంది లోక్‌సభ సభ్యులు, 13 మంది రాజ్యసభ సభ్యులు ప్రణబ్‌కు ఓటు వేశారు. వీరితో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు, మజ్లిస్‌కు చెందిన ఒక లోక్‌సభ సభ్యుడు ప్రణబ్‌కు మద్దతు ఇచ్చారు. టీడీపీకి చెందిన 11 మంది, టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ఈ ఎన్నికలను బహిష్కరించారు.
అధికార పార్టీ కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షమైన మజ్లిస్, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలతో పాటు వైఎస్సార్‌సీపీ కూడా ప్రణబ్‌కు మద్దతు నివ్వడంతో ఆయనకు రాష్ట్రం నుంచి భారీ మెజారిటీ లభించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు టీఆర్‌ఎస్, సీపీఐ రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాలు సైతం ధిక్కరించి టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు ప్రణబ్‌కు అండగా నిలిస్తే మరో ఇద్దరు సంగ్మాకు తమ మద్దతు అని ముందే ప్రకటించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కొక్క ఎంపీ ఓటు విలువ 708 కాగా, మన రాష్ట్రానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 148. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందోననే భయం ఆ పార్టీ రాష్ట్ర నేతలను వెంటాడింది. దీంతో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమ సభ్యులు ఎవరు కూడా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా వారికి మొదటి నుంచే ఈ ఎన్నికపై అవగాహన కలిగిస్తూ వచ్చారు.
-

కాగా చివరి క్షణంలో వైఎస్సార్‌సీపీ కూడా ప్రణబ్‌కు మద్దతు పలకడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐలు ఓటింగ్‌కు దూరం పాటించడంతో ప్రణబ్‌కు రాష్ట్రం నుంచి భారీ మెజారిటీ లభించడం ఖాయమని అందరు లెక్కలు వేసుకున్నారు. రాష్ట్ర ప్రజ్రావూపతినిధులు ప్రణబ్‌కే అండగా నిలిచారనే విషయం ఆదివారం ఓట్ల లెక్కింపులో బయటపడింది. రాష్ట్రం నుంచి ప్రణబ్‌కు మిగతా రాష్ట్రాల కన్నా అత్యధిక మెజారిటీ లభించడం పట్ల సీఎం, పీసీసీ చీఫ్‌లు ఆనందం వ్యక్తంచేశారు.
వేసింది ఐదు... చెల్లింది మూడేనా?రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీయే బలపర్చిన అభ్యర్థి పీఏ సంగ్మాకు రాష్ట్రం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే వీటిలో మూడు ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. మరోండు ఓట్లు చెల్లకుండా పోయాయి. బీజేపీకి చెందిన కిషన్‌డ్డి, ఏ.లక్ష్మినారాయణతోపాటు టీడీపీ రేబల్ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌డ్డి, వేణుగోపాలచారి, ఇండిపెండెంట్ అభ్యర్థి నాగం జనార్దన్‌డ్డి సంగ్మాకు ఓటు వేసినట్లు చెప్పుకున్నారు. అయితే వీరిలో నిజంగా సంగ్మాకు ఎవరు ఓటు వేశారు, ఎవరు వేయలేదు, ఎవరైనా ఓటు చెల్లుబాటు కాకుండా కావాలని తప్పిదం చేశారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు సంగ్మాకే పడ్డాయా? లేక వారి ఓట్లు చెల్లకుండా పోయాయా? చెల్లని ఓట్లలో టీడీపీ రేబల్ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌డ్డి, వేణుగోపాలచారిల ఓట్లు ఉన్నాయా? లేక నాగం ఓటు చెల్లలేదా? అని రాజకీయవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.
Other News