చేతిరాతే ముద్దు..!
టైప్‌రైటర్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు.. ఇలా శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్నో విప్లవాత్మకమార్పులు వస్తున్నా... చేతిరాతే ముద్దంటున్నారు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రస్కిన్ బాండ్. టైప్‌రైటర్‌పై, కంప్యూటర్‌పై కంపోజిగ్ చాలా సులువైనప్పటికీ కలం పట్టి చేతితో రాస్తేనే అది పరిపూర్ణతను చేకూరుస్తుందని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు వచ్చాక చేతిరాత ఒరవడి తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు టైప్‌రైటర్, కంప్యూటర్‌పై టైప్ చేయడం తెలుసని, అయినా తాను కాగితంపై కలంతో రాయడానికి ఇష్టపడతానన్నారు. ఆయన ప్రస్తుతం ‘మహారాణి’ పేరిట ఓ నవలను రాస్తున్నారు. త్వరలోనే అది మార్కెట్‌లోకి తీసుకువస్తానని 78ఏళ్ల రస్కిన్ తెలిపారు.
Other News