బాల్‌రాజ్ కథలో
బడా నేతలు
-
బయటికి వచ్చిన మంత్రి రాంరెడ్డి పేరు
- ఆయన అనుచరులకు 200 షాపులు?
- మాజీ ఎమ్మెల్యే భరతసింహాడ్డి అనుచరులకూ!
- లిక్కర్ సిండికేట్లలో మంత్రులు, రౌడీషీటర్లు
- పోలీసులు, ఆబ్కారీ అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్లు
- వాంగ్మూలం మేరకే ఏసీబీ ముమ్మర దాడులు
- ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ అల్లుడు శ్రీకాంత్‌గౌడ్, మద్యం వ్యాపారి రాజూయాదవ్ అరెస్ట్
(హైదరాబాద్ సిటీ బ్యూరో-టీ మీడియా): తీగలాగితే డొంక కదిలిన చందంగా మద్యం డాన్ బాల్‌రాజ్‌గౌడ్ బయటపెడుతున్న బాగోతం ఉంది. తమ అదుపులో ఉన్న బాల్‌రాజ్‌గౌడ్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు ఆయన నుంచి కూపీ లాగుతున్నారు. విచారణలో పలు ఆసక్తికరమైన ఆంశాలను బాల్‌రాజ్‌గౌడ్ వెల్లడించాడని విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా మంత్రి రాంరెడ్డి వెంకట్‌డ్డి, మాజీ ఎమ్మెల్యే భరతసింహాడ్డి పేర్లు బయటికి వచ్చాయి. వీరి అనుచరులు, బంధువులు పెద్ద ఎత్తున మద్యం షాపులు నిర్వహిస్తున్నట్లు బాల్‌రాజ్ సమాచారం ఇచ్చాడని తెలిసింది. ఆ మేరకు ఏసీబీ అధికారులు ముమ్మరంగా దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారని సమాచారం. మరికొంత మంది సిండికేట్లను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిసింది. తాజాగా జరిగిన అరెస్టుల వెనుక కూడాబాల్‌రాజ్‌గౌడ్ ఇచ్చిన సమాచారమే కీలకంగా కనిపిస్తున్నది.
తాజాగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇటీవల యూసుఫ్‌గూడ కార్పొరేటర్ కుమారుడు అజయ్‌గౌడ్‌ను అరెస్టు చేయగా బుధవారం పటాన్‌చెరువు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ అల్లుడు శ్రీకాంత్‌గౌడ్‌ను శివారు ప్రాంతంలోని ఒక ఫామ్‌హౌస్‌లో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా శేరిలింగంపల్లి మండలం, మాదాపూర్ ప్రాంతానికి చెందిన రాజుయాదవ్‌ను కూడా అరెస్టు చేశారు. రాజు యాదవ్‌కు మండలం పరిధిలో 18షాపులు, అజయ్‌గౌడ్‌కు 19షాపులు, శ్రీకాంత్‌గౌడ్‌కు తొమ్మిది షాపులు ఉన్నట్లు బాల్‌రాజ్‌గౌడ్ ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడించాడని సమాచారం. పలువురు ఆబ్కారీ అధికారులు, పోలీసు అధికారులకు కూడా మామూళ్లు ఇచ్చినట్లు నిందితుడు వాంగ్మూలం ఇవ్వడంతో వారికి కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీచేశారు.
మంత్రి అనుచరులపై దర్యాప్తు : మంద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి రాంరెడ్డి వెంకట్‌డ్డితో సంబంధాలున్నట్లు బాల్‌రాజ్‌గౌడ్ ఏసీబీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. అంతే కాకుండా మంత్రి బంధువుకు 200మద్యం షాపులు ఉన్నట్లు కూడా మద్యం డాన్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు ఆదిశగా దర్యాప్తు ముమ్మరం చేశారని సమాచారం. ఈ క్రమంలోనే హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగాడ్డి, మెదక్ జిల్లాల్లో మంత్రి అనుచరులైన యాదగిరిడ్డి, నర్సాడ్డిలకు చెందిన పలు షాపులపై దాడులు జరిపారు. రేపోమాపో వారినీ అరెస్టు చేస్తారని సమాచారం. ఇప్పటికే 10మందిని అరెస్టు చేసిన అధికారులు బినామీ పేర్లతో సిండికేట్లకు పాల్పడిన వారితో పాటు ఎమ్మార్పీని ఉల్లంఘించిన వారిని బాల్‌రాజ్‌గౌడ్ ఇచ్చిన సమాచారంతో గుర్తించారు. వీరందరినీ దశల వారీగా అరెస్టు చేసేందుకు ఏసీబీ సన్నద్ధమవుతున్నది. అంతే కాకుండా మాజీ ఎమ్మెల్యే భరతసింహాడ్డి అనుచరులపై కూడా చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు కదులుతున్నారని సమాచారం. అయితే.. అరెస్టుల పరంపరలో ఏసీబీ అధికారులకు కొన్ని ఒత్తిళ్లు, అవరోధాలు ఎదురవుతున్నట్లు తెలిసింది.
ఏసీబీ విచారణలో వెల్లడించిన వివరాలు : హైదరాబాద్, రంగాడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బాల్‌రాజ్‌గౌడ్‌ది మద్యం వ్యాపారంలో ఏకఛవూతాధిపత్యమని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల పరిధిలో 8 బినామీ మద్యం షాపులు, 40 బెల్టుషాపులు ఏడు బార్లు, మెదక్, మహబూబ్‌నగర్ పరిధిలో 18 బినామీ షాపులు ఉన్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడించాడని తెలిసింది. మద్యం సిండికేట్లకు రాంరెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించినట్లు ఏసీబీ విచారణలో వివరించినట్లు సమాచారం. రాంరెడ్డి బంధువులు యాదగిరిడ్డి, నర్సాడ్డి మద్యం షాపులను నడుపుతున్నారని, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో రాజుయాదవ్ బినామీ పేర్లతో 80షాపులను దక్కించుకున్నట్లు విచారణలో వెల్లడించాడని తెలిసింది.
సైబరాబాద్ పరిధిలో రాజు యాదవ్ హవా నడవగా అంబర్‌పేట, రామంతాపూర్, లాలాపేట పరిధిలో రౌడీషీటర్ శంకర్ 20షాపులను దక్కించుకుని హవా నడిపిస్తున్నట్లు తెలిపాడని అంటున్నారు. సిండికేట్ల వ్యవహారంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రౌడీషీటర్లు, పోలీసు, ఆబ్కారీ అధికారులతో పాటు చివరకు ఏసీబీ అధికారులకు కూడా ముడుపులు చెల్లించినట్లు నిందితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బాల్‌రాజ్‌గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకే ఏసీబీ అధికారులు రాష్ట్రంలో దాడులు జరుపుతున్నట్లు తెలిసింది.
ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌తో సెటిల్‌మెంట్: సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించడంతోనే తనకున్న పాత పరిచయాలతో బాల్‌రాజ్‌గౌడ్ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సోమనారాయణ్‌సింగ్‌ను మచ్చిక చేసుకున్నాడని తెలిసింది.ఇదే విషయాన్ని ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. తన సిండికేట్ల వ్యవహారాన్ని ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌తో సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు విచారణలో వెల్లడించాడని తెలిసింది.
భరతసింహాడ్డితో సంబంధాలు: మాజీ ఎమ్మెల్యే భరతసింహాడ్డి అనుచరులు దయాకర్‌డ్డి, మధుసూదన్‌డ్డి, మోహన్‌డ్డి సైతం సిండికేటు వ్యవహారాలకు పాల్పడడంతో పాటు తన లావాదేవీల్లో వాటా ఉన్నట్లు బాల్‌రాజ్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అంతే కాకుండా భరతసింహాడ్డితో కలిసి మద్యం సిండికేట్లకు పాల్పడినట్లు వెల్లడించినట్లు తెలిసింది.
అధికారులకు మామూళ్లు : హైదరాబాద్ జిల్లాకు చెందిన ఒక డిప్యూటీ కమిషనర్‌కు ఏడు సార్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదికేశవులు, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీనాయక్, మురళీధర్‌లకు పలు మార్లు మామూళ్లను ముట్టచెప్పినట్లు ఏసీబీ విచారణలో వెల్లడించాడని తెలిసింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలువురు పోలీసు అధికారులకు మామూళ్లు ఇచ్చినట్లు బాల్‌రాజ్‌గౌడ్ ఏసీబీ విచారణలో వెల్లడించాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అబిడ్స్ ఏసీపీగా పనిచేసి, ఇటీవలే విజిపూన్స్ ఎస్పీగా పదోన్నతి పొందిన విజయ్‌కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే విజయ్‌కుమార్‌కు నిందితుడు 13సార్లు మామూళ్లను ముట్టజెప్పినట్లు విచారణలో వెల్లడించాడు. అంతే కాకుండా చిక్కడపల్లిలో ఏసీపీగా పనిచేసిన ఒక పోలీసు అధికారికి కూడా పలు మార్లు మామూళ్లు అందించినట్లు తెలిపాడు. వీరితో పాటు నారాయణగూడ, చిక్కడపల్లితో పాటు సైబరాబాద్ పరిధిలోని పలు ఠాణాలకు చెందిన సీఐలు, ఏసీపీలకు మామూళ్లు ఇచ్చినట్లు బాల్‌రాజ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం.
జార్ఖండ్ సీఎం స్నేహితుడితో సంబంధాలు మద్యం సిండికేట్ల వ్యవహారం తెరపైకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బాల్‌రాజ్‌గౌడ్ పరారీలో ఉన్నంత కాలం జార్ఖండ్ సీఎం స్నేహితుల్లో ఒకరితో కలిసి వ్యాపార లావాదేవీలను నడిపించినట్లు విచారణలో వాంగ్మూలం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
Other News