వీడిన కిడ్నాప్ మిస్టరీ!
- ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు మేనేజర్ సేఫ్
- ఇద్దరు కిడ్నాపర్ల అరెస్టు
కొల్లాపూర్‌టౌన్/ కొల్లాపూర్, ఆగస్టు 6(టీ డియా): మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు రెండో లిఫ్టు పనులు చేస్తున్న నవయుగ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ కాశీగోవిందరావు బృం దం కిడ్నాప్ మిస్టరీ వీడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం నాటకీయ ఫక్కీలో మేనేజర్ కాశీ గోవిందరావు, డ్రైవర్ జీ రాములులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కొత్తూరులో కిడ్నాపర్ల ముఠా ఓ డ్రైవర్‌ను బెదిరించి టవేరా వాహనాన్ని అపహరించింది. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూ ర్ వరకు అదే వాహనంలో వచ్చి తుపాకులతో బెదిరించి మేనేజర్‌ను కిడ్నాప్‌చేసి అదే వాహనం లో వెళ్లిపోయారు.
వనపర్తి మీదుగా నాసనహల్లికి చేరుకొని తాటిపాముల గుట్టల్లో కిడ్నాపర్లు మకాం వేసి రూ.2కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్ల ముఠాను పోలీసులు కనుగొన్నారు. రాకను పసిగట్టి కిడ్నాపర్లు పరారయ్యారని, సంఘటనా స్థలంలో స్కార్పియో వాహనాన్ని పీఎం కాశీ బృందాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని, ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో బిజినేపల్లి మం డలానికి చెందిన శ్రీశైలం ముఠాకు నేతృత్వం వహించారని పోలీసులు భావిస్తున్నారు. మిగతా సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Other News