మళ్లీ అదే అన్యాయం!
-బల్దియాలో తెలంగాణ ఐఏఎస్ ప్రియదర్శినికి మళ్లీ అప్రాధాన్య పోస్టు
సిటీబ్యూరో, ఆగస్టు 6 (టీ మీడియా): అంతా అనుకున్నట్టే జరిగింది. బల్దియాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఐఏఎస్ అధికారి ప్రియదర్శినికి పోస్టింగ్‌లో మళ్లీ అన్యాయం జరిగింది. ప్రకటనల విభాగంలో సీమాంధ్ర అధికారులు చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయనే భయంతో కనీసం మూడు నెలలైనా గడవకముందే ఆమెకు మళ్లీ పనిలేని యథాస్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. మూడేళ్లుగా ప్రియదర్శిని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. మొదట్లో ఆమెను ఎవరూ ఇష్టపడని అత్యంత అప్రాధాన్యమైన యూసీడీ విభాగం అదనపు కమిషనర్‌గా నియమించారు. ఆమెకు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ ఇంజినీరింగ్ సహా ఇతర సంబంధిత అధికారులకు ఆ మేరకు ఆదేశాలు జారీచేయకపోవడంతో ఒక్క ఫైల్ కూడా ఆమె వద్దకు రాకుండా నేరుగా కమిషనర్ వద్దకే వెళ్లేవి. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి స్పందనగా మూడు నెలల క్రితం ఆమెకు ఎస్టేట్స్, ప్రకటనల విభాగాన్ని కేటాయించారు.
ముక్కుసూటిగా వ్యవహరించే ప్రియదర్శిని ప్రకటనల ఒప్పందాల అవినీతి వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే మూడు నెలలైనా గడవకుండానే ఆమెను కమిషనర్ ప్రకటనల విభాగం నుంచి తప్పించడం గమనార్హం. తాజాగా సోమవారం జరిపిన పలు అదనపు కమిషనర్ల బదిలీల్లో ఆమెను ప్రకటనల విభాగం నుంచి తప్పించి మళ్లీ పనిలేని సమన్వయ విభాగం బాధ్యతలు అప్పగించారు. సీమాంవూధ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్లానింగ్, హెల్త్ అండ్ శాని విభాగం అదనపు కమిషనర్లుగా ఐఏఎస్‌లను నియమించాల్సి ఉన్నా సీమాంవూధ నాన్ ఐఏఎస్‌లే కొనసాగుతుండడం విశేషం.
Other News