Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> >>
పోరుసిల్ల

-trsVIJAYA talangana patrika telangana culture telangana politics telangana cinema
ఖాకీల పహారాలో చేనేత కార్మికక్షేత్రం
-నిరసనల నడుమ నేడు విజయమ్మ దీక్షకు సిద్ధం!
- తెలంగాణపై వైఖరి చెప్పకుంటే అడ్డుకుంటామని తెలంగాణవాదుల హెచ్చరిక
- పోలీసుల అత్యుత్సాహం.. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ముందస్తు అరెస్టులు
- అయినా బెదరని తెలంగాణ బిడ్డలు.. ధూంధాంతో సత్తాచాటిన పోరువీరులు

కరీంనగర్/ సిరిసిల్ల (టీ మీడియా): ఒకరు కాదు ఇద్దరు కాదు.. 5వేల మంది పోలీసులు..! ఒక్క సిరిసిల్లలోనే..!! ఎటుచూసినా ఖాకీ వనం.. బందూకుల నీడలో చేనేత కార్మిక క్షేత్రం..! ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, 113 మంది ఏఎస్‌ఐలు, 465 మంది కానిస్టేబుళ్లు, 91 మంది హోంగార్డులు, వీరితోపాటు ఏపీఎస్పీ, ఆర్ముడ్ రిజర్వు పోలీసు బలగాలు.. సిరిసిల్లను చుట్టముట్టాయి. వద్దు వద్దంటున్నా వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు సోమవారం చేనేత దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వైఖరి చెప్పకుండా తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టే హక్కులేదని తెలంగాణవాదులు ఆమెను హెచ్చరిస్తున్నారు. కొన్నాళ్లుగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అయినా సోమవారం దీక్షకు ఆమె సిద్ధమయ్యా రు.

ఈ దీక్షకు అనుమతిచ్చిన పోలీసులు.. ఆదివారం అక్కడే టీ జేఏసీ సభ(ధూంధాం)కు మాత్రం సాయంత్రం వరకు అనుమతి ఇవ్వలేదు. అయినా తెలంగాణ బిడ్డలు బెదరలేదు. గాంధీచౌక్‌లో ధూం ధాం ఏర్పాటు చేసి సత్తా చాటారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని, వానను కూడా లెక్కచేయకుండా జనం తరలివచ్చారు. జేఏసీ సభ కోసం స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. స్వయంగా జిల్లా ఎస్పీ రవీందర్‌తో మాట్లాడారు. సిరిసిల్లలో మహిళలు చేపట్టిన దీక్ష విరమణ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో సభ(ధూంధాం) ఏర్పాటు చేశామని, మెదక్ ఎంపీ విజయశాంతి.. జేఏసీ చైర్మన్ కోదండరాం వస్తున్నారని, గాంధీ చౌక్‌లో సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయినా, ఎస్పీ నుంచి స్పందన రాలేదు. చివరికి పొద్దుపోయాక అనుమతి ఇచ్చారు. అప్పటికే తెలంగాణ బిడ్డలు తమ ఉద్యమస్ఫూర్తిని ధూంధాం లో నిరూపించారు.

కాలుదువ్విన వైఎస్సార్సీపీ..!
వైఎస్ విజయమ్మ సోమవారం చేపట్టనున్న దీక్షపై కొన్నాళ్లుగా నిరసన వెల్లు విషయం తెలిసిందే. ‘విజయమ్మ తెలంగాణకు జై కొట్టు.. ఆ తర్వా తే సిరిసిల్లలో అడుగుపెట్టు’ అనే నినాదాలతో సిరిసిల్ల అంతటా నల్లబ్యానర్లు వెలిశాయి. ఈ నిరసనలను జీర్ణించుకోలేకపోయిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అంబేద్కర్ చౌరస్తాలో బ్యానర్లను చించివేయగా గాంధీ చౌక్‌లో ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అటువైపు పరుగుతీయడంతో ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన టీఆర్‌ఎస్ వారిని అడ్డుకున్నారు. గాంధీ చౌక్‌లో టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు వైఎస్ జగన్ ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ రెండు ప్రాంతాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కవాతు నిర్వహించారు.
TRSPEOPLE talangana patrika telangana culture telangana politics telangana cinema

ఎక్కడికక్కడ అరెస్టులు
విజయమ్మ దీక్షను అడ్డుకుంటారన్న సాకుతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులను, టీఆర్‌ఎస్, దాని అనుబంధ సంఘాల కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. ధూంధాంకు వస్తున్న జనాన్ని వెనక్కి పంపారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున టీఆర్‌ఎస్ నాయకులు మైఖేల్ శ్రీను, ఉప్పు రవీందర్, తోట మధు, అయిలేందర్ యాదవ్‌ను అదుపులోకి తీసుకోవడంతో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. రామగుండంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు కింగర్ల మల్లయ్యతోపాటు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ నాయకులు, ట్రినీటీ విద్యాసంస్థల అధిపతి దాసరి మనోహర్‌డ్డితోపాటు 13 మందిని, సుల్తానాబాద్‌లో నలుగురిని అరెస్టు చేశారు.

కోరుట్ల, కమాన్‌పూర్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గంట వెంకటరమణాడ్డితోపాటు ఆయన అనుచరులును, మెట్‌పల్లిలో శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఆయన అనుచరులను అరెస్టు చేశారు. గోదావరిఖని, మానకొండూర్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో అరెస్టులు కొనసాగాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సిద్దిపేట మీదుగా సిరిసిల్లకు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ దారిలో వచ్చే ఆటోలను తనఖీ చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధూంధాం పూర్తయిన తర్వాత వివిధ ప్రాంతాలకు వెనుతిరిగిన నేతల వాహనాలను పోలీసులు అనుసరించారు. చందుర్తి, సిరిసిల్ల, బోయినపల్లిలలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. వేములవాడలో గజానందరావు, ఈర్లపల్లి రాజు, వెంగల శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, కృష్ణను ధూంధాం నుంచి తిరిగి వెళ్తుండగా అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిరిసిల్ల నేతలు ఇతర చోట్లకు వెళ్లి తలదాచుకున్నారు. పోలీసులు మఫ్టీలో మండలాల్లో జల్లెడ పడుతున్నారు. జిల్లా కేంద్రంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కేటీఆర్‌ను సోమవారం తెల్లవారుజామున హౌస్ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

విజయమ్మ..! తెలంగాణపై వైఖరేంటి..?: కోదండరాం
టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు సిరిసిల్లకు చేరుకున్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణపై తన వైఖరి ప్రకటించిన తర్వాతే సిరిసిల్లలో అడుగపెట్టాలని విజయమ్మకు డిమాండ్ చేశారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే దారిపొడవునా ప్రజలు అడ్డుకుంటారని ఆయన హెచ్చరించారు. వైఎస్ కుటుంబం తెలంగాణకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. ముందస్తు అరెస్టులను టీఆర్‌ఎస్ కరీంనగర్ ఇన్‌చార్జి మాజీ ఎంపీ వినోద్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌లు తీవ్రంగా ఖండించారు. అరెస్టుచేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సాయంత్రం ఐదున్నర గంటలకు సిరిసిల్ల చేరుకున్న మెదక్ ఎంపీ విజయశాంతి పోలీసుల తీరును విమర్శించారు. విజయమ్మ సిరిసిల్లకు వచ్చే ముందు తెలంగాణకు జై కొట్టిరావాలని లేకుంటే ప్రజలు అడ్డుకుంటారని ఆమె హెచ్చరించారు. అరెస్టులకు, విజయమ్మరాకకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఎల్లాడ్డిపేట మండలం గర్జనపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్ రాజశేఖడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విజయమ్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. వేములవాడలో విజయమ్మరాకను నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగిత్యాలలో అరెస్టులను నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్షికమాలు కొనసాగాయి.

ధూంధాం విజయవంతం
విజయమ్మరాకను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీ చౌక్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ధూంధాం కార్యక్షికమం విజయవంతమైంది. వర్షం పడుతున్నా ప్రజలు లెక్కచేయకుండా తరలివచ్చారు. ధూంధాం సభ ప్రారంభానికి ముందు... తెలంగాణపై వైఖరిని స్పష్టం చేసిన తర్వాతే విజయమ్మ ఇక్కడ అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా సిరిసిల్లలో దీక్షలు చేస్తున్న మహిళలకు మెదక్ ఎంపీ విజయశాంతి, జేఏసీ చైర్మన్ కోదండరాం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ధూంధాంకు ‘నేతకార్మిక కుటుంబాల దీక్షా విరమణ సభ’గా నామకరణం చేశారు. సిరిసిల్ల జేఏసీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య అధ్యక్షతన జరిగిన సభలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, మెదక్ ఎంపీ విజయశాంతి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారకరామారావు, వేములవాడ, కోరుట్ల ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, విద్యాసాగర్‌రావు, మెదక్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రఘునందన్‌రావు, మాలమహానాడు నాయకుడు అద్దెంకి దయాకర్, జేఏసీ జిల్లా చైర్మన్ వెంకటమల్లయ్య, సమన్వయ కర్త వెంక పాల్గొన్నారు. రసమయి బాలకిషన్ ఆటాపాట ఆకట్టుకుంది. ధూంధాంలో పాల్గొన్న వక్తలు సోమవారం నాటి సిరిసిల్ల బంద్‌ను విజయవంతం చేసి విజయమ్మ రాకకు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. విజయమ్మ చేపట్టే దీక్షలో తెలంగాణపై నిలదీయాలని సూచించారు. సభ ప్రారంభానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి కేటీఆర్ పూలమాలలు వేసి, మహిళలతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రజలతో కలిసి వేదిక కిందే ఆయన కూర్చున్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine