|
|
జలదోపిడీకి నిరసనగా కలెక్టరేట్ ముట్టడి
-ప్రభుత్వ తీరుపై మండిపడ్డ టీఆర్‌ఎస్ నేతలు -నీటి విడుదల ఆపేవరకు ఉద్యమిస్తామని ప్రతిన మహబూబ్‌నగర్, టీ మీడియా ప్రతినిధి: కృష్ణాడెల్టా నారుమడుల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ నేతలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ర్యాలీగా వెళ్లి తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వెళ్తున్న టీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది నాయకులను మాత్రమే కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఏపీ జితేందర్‌డ్డి, నిరంజన్‌డ్డి, ఇబ్రహీం, తదితరులు మాట్లాడారు. తెలంగాణ జిల్లాలు తాగునీరులేక అలమటిస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం సీమాంధ్ర పొలాలకు నీరివ్వడం దారుణమని మండిపడ్డారు.
డెడ్‌స్టోరేజీలో ఉన్న శ్రీశైలం నీటిని తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకోబోమని, దోపిడీని అడ్డుకునేందుకు ఉద్యమిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడీకి గురవుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులను పట్టుకొని వేలాడుతూ ద్రోహులుగా మిగిలిపోతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కళ్లుతెరిచి తెలంగాణను సీమాంవూధుల కబంధ హస్తాల్లోంచి బయటపడెయ్యాలని సూచించారు. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి.
Other News
|
|