|
|
‘పోలవరం’పై కవిత పిటిషన్ ఉపసంహరణ
హైదరాబాద్, జూలై 16 (టీ మీడియా): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై హైకోర్టులో కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇదే అంశంపై కేసు సుప్రీంకోర్టులోను పెండింగ్‌లో ఉండటంవల్ల ఒకే అంశంపై రెండు చోట్ల విచారణ చేపట్టకూడదని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ గతవారం జరిగిన విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. కేసు సుప్రీంలో ఉన్నందున అక్కడికే వెళ్లండన్న హైకోర్టు సూచనపై ఇక్కడ ఉపసంహరించుకుని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కవిత తరఫు న్యాయవాది రామచంవూదారావు తెలిపారు. పర్యావరణ అనుమతులు, ఇతర నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుందంటూ కవిత రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Other News
|
|