Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> >>
సద్భావన సమావేశంలో విశాలాంధ్ర విషం!

freedom- సమైక్యాంధ్ర కరపవూతాలతో సీమాంవూధులు
- అడ్డుకున్న తెలంగాణవాదులు
- మాటలతో రెచ్చగొట్టిన పరకాల ప్రభాకర్!
- మండిపడ్డ తెలంగాణ ప్రతినిధులు
- తెలంగాణ కోరుకోవడం ఇక్కడి ప్రజల జన్మహక్కు
- తేల్చిచెప్పిన తెలంగాణ ప్రతినిధులు
- సమాధానం చెప్పలేక జారుకున్న ప్రభాకర్

హైదరాబాద్/సోమాజిగూడ, జూలై 16 (టీ మీడియా):రాష్ట్ర విభజన అంశంపై సాఫీగా సాగుతున్న సద్భావన సమావేశంలో విశాలాంధ్ర నేతలు విషం చిమ్మే ప్రయత్నం చేశారు. సమైక్యవాద కరపవూతాలు, పుస్తకాలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలని విశాలాంధ్ర మహాసభ చేసిన యత్నాన్ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. విశాలాంధ్ర నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలే కోరుకోవడంలేదని, అభూత కల్పన అని పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించడంతో తెలంగాణవాదులు భగ్గుమన్నారు. తెలంగాణ కడుపుకోతను, ఆవేదనను హేళన చేస్తూ, వెటకారంగా మాట్లాడుతావా? అంటూ విరుచుకుపడ్డారు. దీంతో సభలో గందర గోళం నెలకొంది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇరు ప్రాంతాల్లో ప్రాంతీయ సద్భావన చెడిపోకుండా ఉండడానికి స్వాతంత్య్ర సమరయోధుల వేదిక చైర్మన్ కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆధ్యర్యంలో ఇరువూపాంతాల మేధావులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విభజన అంశంపై తెలంగాణ, ఆంధ్రా సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ప్రజాగాయకుడు గద్దర్, ఎంపీ మందా జగన్నాథం, టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంక తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ గోపాలకృష్ణ, జైఆంధ్రా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్, ఆంధ్రా మేధావి సంఘం నేత చలసాని శ్రీనివాస్, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ తిరుమలి, కన్వీనర్ గజ్జెల కాంతం, బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు నారగోని, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య పాల్గొని వారివారి అభివూపాయాలను వెల్లడించారు. సమావేశం జరుగుతుండగా విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు కొంతమంది.. విశాలాంధ్ర ఉద్యమం పేరుతో ఉన్న పుస్తకాలను పంచేందుకు ప్రయత్నించారు.

సమావేశాన్ని పక్కదోవ పట్టించేందుకు విశాలాంధ్ర మహాసభ వివాదాస్పద పుస్తకాలను పంచడం సరైనది కాదని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశ ఉద్దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తదితరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా సమావేశంలో విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులకు, తెలంగాణ సంఘాల నేతలకు వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం అడగటం తెలంగాణ ప్రజల జన్మహక్కని, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను 60ఏళ్లుగా నిలదీయడం ఏ విధంగా తప్పవుతున్నదని పరకాల ప్రభాకర్‌ను తెలంగాణ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ ప్రశ్నించారు. విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రాన్ని చాలామంది తెలంగాణ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు అవసరమని మీరు వంద కారణాలు చెబితే మేము విశాలాంధ్ర కొనసాగాలని వెయ్యి కారణాలు చూపిస్తాం. మీరు వెయ్యి కారణాలు చెబితే.. మేము లక్ష కారణాలు చెబుతాం’ అంటూ వ్యాఖ్యానించడంతో మళ్లీ గొడవ మొదటికి వచ్చింది. అందరు సభ్యులూ పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వెయ్యి మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారి కూడా సానుభూతి ప్రకటించారా? ఇలాంటి పరిస్ధితుల నేపథ్యంలో విశాలాంవూధలో ఎలా కలిసి ఉండాలి?’ అని వీ శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ‘విశాలాంధ్ర మహాసభ అనేది ఇప్పుడు గుర్తుకొచ్చిందా..? 1997లో బీజేపీ కాకినాడ తీర్మానంలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంశాన్ని ప్రతిపాదించిన సమయంలో మీరు బీజేపీలో లేరా..? తెలంగాణవాదులకు సమాధానం సూటిగా చెప్పాలి’ అని పరకాల ప్రభాకర్‌ను తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. దీంతో సరైన సమాధానం చెప్పకుండా తమగొంతు నొక్కేస్తున్నారని పరకాల ప్రభాకర్ వాదిస్తూ.. ‘ఉన్నవి లేనట్లుగా, లేని అంశాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ రాష్ట్ర విభజన కోసం కొంతమంది వాదిస్తున్నార’ని సమావేశం నుంచి వెళ్లిపోయారు. సద్భావన సమావేశంలో ఎవవరు ఏమన్నారంటే..!

తెలంగాణ కోసం పోరాటం చేస్తా: బాపూజీ
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణపై తీర్మానాన్ని ప్రకటిస్తూ, కాలపరిమితి తెలియజేస్తూ రాష్ట్ర విభజనపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని కొండా లక్ష్మణ్‌బాపూజీ కేంద్రానికి సూచించారు. అప్పుడే సమైక్యవాదులు చేసే వాదన తగ్గుతుందన్నారు. ప్రాంతాల మధ్య సద్భావనకు కృషి చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తానని ఆయన తెలిపారు.

తెలంగాణ ఉద్యమ స్వరూపం మారాలి: గద్దర్
తెలంగాణ ఉద్యమానికి డెడ్‌లైన్లు ఉండవని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంవూధకు ఎలాంటి ఇబ్బందులుండవనే విషయాన్ని వివరించి అక్కడి ప్రజలకు కదిలించి ఉద్యమ స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభివూపాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్మాణం అవసరమని తెలిపారు.

కేంద్రమే జటిలం చేస్తుంది: పొత్తూరి
విశాలాంధ్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తాము రాష్ట్ర విభజన జరగాలని 1969లో ఒక నిర్ణయానికి వచ్చామని సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంక అన్నారు. ఒకరికొకరు సహకారం అందించుకోవాలంటే రాష్ట్ర విభజననే మార్గమని చెప్పారు.

రాష్ట్ర విభజనతో రెండు ప్రాంతాలు అభివృద్ధి: వసంత
రెండు ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లా విడిపోవాలని తాను కోరుకుంటున్నానని మాజీ మంత్రి, జై ఆంధ్ర ప్రతినిధి వసంత నాగేశ్వర్‌రావు అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే.. ఇరు ప్రాంతాలు ఇప్పటికంటే మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

తుపాకీ గుండ్లను ఎదురించిన ఘనత..: శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ కోసం ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేపడుతున్నామని, తుపాకీ గుండ్లను సైతం ఎదుర్కొన్న శక్తి ఉద్యమానికి ఉన్నదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వెయ్యి మంది విద్యార్థులు రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన వివరించారు. ఇంతజరిగినా సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విధానాన్ని సీమాంధ్ర నేతలు కొనసాగిస్తే తెలంగాణవాదుల నుంచి ప్రతిఘటన ఎదురుకాక తప్పదని ఆయన హెచ్చరించారు.

విడిపోయి కలిసుందాం: చలసాని
సీమాంధ్ర హక్కులను సాధించుకున్న తర్వాతనే విడిపోతామని ఆంధ్ర మేధావుల సంఘం ప్రతినిధి చలసాని శ్రీనివాస్ అన్నారు.

తెలంగాణపై మా పార్టీలో విభేదాలున్నాయి: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలంగానే ఉందంటూ ఇప్పటివరకు ప్రకటనలు చేస్తూ వచ్చిన టీడీపీ తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నిజం ఒప్పుకున్నారు. తెలంగాణపై టీడీపీకి ఓ స్పష్టత లేదని కుండబద్ధలు కొట్టారు. ఈ విషయంలో పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పార్టీ తరఫున మరో లేఖ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నదని స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో పార్టీలో క్లారిటీ లేదని, ఈ విషయంతో పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే పరకాల ప్రభాకర్ తెలంగాణకు వ్యతిరేకంగా హైదరాబాద్ నడిబొడ్డున కరపవూతాలు పంపిణీ చేయడం ఏమిటని ఆయన మండిపడ్డారు.

కరపవూతాలు పంపిణీ చేయడమేమిటి?: అద్దంకి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాంతియుతంగా సమావేశం జరుగుతుండగా పరకాల ప్రభాకర్ సమైక్యవాదంతో కరపవూతాలు పంపిణీ చేసి వివాదాలకు కారణమయ్యారని టీజేఏసీ కో కన్వీనర్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సోదర భావంతో లక్ష్మణ్ బాపూజీ అందరిని ఏకం చేసే ప్రయత్నం చేస్తుండగా.. వ్యక్తిగత ప్రయోజనం, మీడియాలో ప్రచారం కోసం పరకాల ప్రభాకర్ ఇలాంటి ప్రయత్నాలు చేయడం సరైంది కాదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు నారగోని, జేఏసీ కన్వీనర్ గజ్జెల కాంతం, స్వాతంత్య్ర సమరయోధుల వేదిక కన్వీనర్, మాజీ మంత్రి కేవీ కేశవులు, సభ్యులు డాక్టర్ సీహెచ్ కృష్ణమూర్తి, డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు, భగవాన్, వీ చంద్రాడ్డి, సీతారామయ్య, చిలుకూరి రామలింగయ్య, మనోహర్ పంతులు, బుసుకు శివాడ్డి, పొనుగొటి నరసింహారావు, చాడ మధుసూదన్‌డ్డి, బొల్లెద్దు వెంకటరాములు, కొలను శివాడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine