Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 26, 2013
 


Home >> >>
సర్‌చార్జీ భారం సర్కారుదే

dattu-ఏపీఈఆర్‌సీ ముందు రాజకీయ, ప్రజాసంఘాల 111 అభ్యంతరాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 16 (టీ మీడియా):వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వమే విద్యుత్ ఇంధన సర్దుబాటు చార్జీలను చెల్లించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఇంధన సర్దుబాటు చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలు సమర్పించిన నివేదికపై సోమవారం సింగరేణి భవన్‌లో ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో ఏపీఈఆర్‌సీ చైర్మన్ రఘోత్తమ్‌రావు, సభ్యులు సీఆర్ శేఖర్‌డ్డి, ఆర్ అశోకచారితో కూడిన త్రిసభ్య కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. 2010-11, 2011-12 సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తికి ఖర్చుచేసిన దాదాపు 8023 కోట్ల రూపాయలను అదనపు వ్యయంగా వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ఈఆర్‌సీ అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరాయి. ఈ మేరకు విద్యుత్ నియంవూతణ మండలి వినియోగదారుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా 111 మంది వినియోగదారులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. ఇందులో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, బీజేపీ సీనియర్ నేత దత్తావూతేయ, వైఎస్సార్సీపీ నేత జనక్ ప్రసాద్, లోక్‌సత్తా నేత కార్తీక్ చంద్రా, ఫ్యాప్సీ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి, వేణుగోపాల్‌రావు తదితరులు తమ అభివూపాయాలను కమిషన్ ముందు ఉంచారు.

sirఇంధన సర్దుబాటు చార్జీలు గ్యాస్, బొగ్గు ధరలు పెరగడంతో వచ్చాయని, దీని ద్వారా ప్రజలపై పెను భారం పడుతుందని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త రఘు అన్నారు. రిలయన్స్‌కు గ్యాస్ ధరను పెద్ద ఎత్తున పెంచి ఇవ్వడం ద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ధరలు తగ్గించే విషయం ఆలోచించాలని కోరారు. రిలయన్స్ సంస్థ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన గ్యాస్‌ను తగ్గించడం వల్ల ఖరీదైన విద్యుత్ కొనాల్సి వచ్చిందన్నారు. రిలయన్స్ సంస్థ ఒప్పందాలను అతిక్షికమించినందుకు చట్టవూపకారం చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమై ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి విద్యుత్ అందించే సంస్థలకు గ్యాస్ సరఫరా చేయకుండా ల్యాంకో, హేమగిరి సంస్థలకు ఇవ్వడంతో ఏటా రూ. 1200 కోట్ల భారం పడుతున్నదన్నారు. సర్ చార్జీల భారమంతా విద్యుత్ కోతలతోనే వచ్చిందని తెలిపారు. తెలంగాణలో నిర్వహించాల్సిన కడదనూరు, శంకర్‌పల్లి, రామగుండం వంటి ప్రాజెక్టులు పూర్తిచేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని, ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నదని మండిపడ్డారు. గ్రామీణ, మండల ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. పట్టణాలు, కార్పొరేషన్లలో ఉన్న ధనవంతుల కోసం అధిక ధరకు తెచ్చిన విద్యుత్ సర్ చార్జీల భారాన్ని వ్యత్యాసం లేకుండా అందరికీ ఓకేలా నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

రెండేళ్ల నాటి బిల్లులు ఇప్పుడా?: నారాయణ
సర్‌చార్జీల అమలు, విద్యుత్ చార్జీల పెంపు అనేది రాజకీయ అంశమని, రాష్ట్రాన్ని పాలించేది రాజకీయ వ్యవస్థ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. అమలు చేసే యంత్రాంగం, కమిషన్‌ను నియమించింది ప్రభుత్వమేనని చెప్పారు. అంతిమంగా కమిషన్ ప్రభుత్వ విధానాన్ని అమలు పరుస్తుందే తప్ప విరుద్ధంగా ఉండదని ఆయన చురకలు అంటించారు. ఎప్పటికప్పుడు క్రమపద్ధతిలో వ్యవహరించాల్సిన విద్యుత్ సంస్థలు రెండేళ్ల నాటి అదనపు బిల్లును ప్రస్తుతం అమలుచేయడం శోచనీయమన్నారు. 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 8023 కోట్ల ఇంధన సర్దుబాటు జరిగిందనడానికి డిస్కంల వద్ద ఆధారాలేమిటని ఆయన ప్రశ్నించారు. కోల్ ఇండియా, సింగరేణి, విదేశాల నుంచి బొగ్గు కొనుగోలుకు చెల్లించింది ఎంత అని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

2007లో ఒడిశా మన రాష్ట్రానికి ఒక బొగ్గు బ్లాక్ కేటాయించిందని, దాని ద్వారా పది మిలియన్ టన్నుల బొగ్గు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ ఒక్క స్ఫూన్ తీసుకోలేదని మండిపడ్డారు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీ రాఘవులు మాట్లాడుతూ సర్ చార్జీలు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండారు దత్తావూతేయ మాట్లాడుతూ ఇంధన సర్ చార్జీలను హైకోర్టు వ్యతిరేకించిందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రజల నుంచి వసూళ్లు చేయాల్సిందేనని పట్టుపట్టడం దారుణమన్నారు. డిస్కంలకు ప్రభుత్వ చెల్లించాల్సిన రూ. 13 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తే సగం సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ఫాప్సీ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లకు చెందిన బిల్లులను ప్రస్తుత వినియోగదారులపై వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలన్నారు.

25న చలో సెక్రటెరియట్
-విద్యుత్ కోతలు, అదనపు చార్జీలకు నిరసనగా వామపక్షాల నిర్ణయం
రాష్ట్రంలో విద్యుత్ కోత, ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 25న ‘చలో సెక్ర కార్యక్షికమానికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. విద్యుత్ కోతకు ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. సోమవారం మఖ్దూం భవన్‌లో పది వామపక్ష పార్టీల నాయకులు సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై విస్తృతంగా చర్చించారు. విద్యుత్ కొరతకు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 25న ‘చలో సెక్ర కార్యక్షికమానికి ముందు రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంవూతిని కలిసి వినతి పత్రాన్ని అందజేయాలని నిర్ణయించారు. లక్షింపేట ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ కేసును విచారించేందుకు లక్షింపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలంది. విద్యుత్ కోత, ప్రజా సమస్యలపై వామపక్షాలు ఉమ్మడిగా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డా కే నారాయణ, శాసనసభపక్ష నాయకుడు గుండా మల్లేష్, నాయకులు కే రామకృష్ణ, పల్లా వెంకట్‌డ్డి, నర్సింహారావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, నాయకులు వై వెంక న్యూ డెమొక్షికసీ రాష్ట్ర నాయకులు డీవీ కృష్ణ, పీ సూర్యం, ఎస్‌యూసీఐ నాయకుడు మురహరి, ఆర్‌ఎస్పీ నాయకులు జానకీరాములు, రాంరెడ్డి, సీపీఐ ఎం ఎల్ నాయకులు గుర్రం విజయ్‌కుమా ర్, వీరన్న గ్రూప్ నాయకుడు ఎండీ గౌస్, ఎంసీపీఐ(యూ) నాయకులు వెంకట్‌డ్డి, సీపీఐ ఎంఎల్(లిబరేషన్) నాయకులు ఉదయ్‌కిరణ్ పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine