‘స్నేహ’అక్రమాలకు పాల్పడలేదు
- ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్
హైదరాబాద్, జూలై 12 (టీ మీడియా): ‘మెదక్ జిల్లా రామాయంపేటలోని స్నేహ కళాశాల యాజమాన్యం విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌లో అక్రమాలకు పాల్పడిందని బీసీ సంక్షేమశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది వాస్తవం కాదు’ అని ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌డ్డి, ప్రధాన కార్యదర్శి సిద్ధేశ్వర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. వాస్తవాలను విచారించకుండా పేరు ప్రతిష్టలున్న, ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న కాలేజీలపై దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్‌లో చేరే విద్యార్థుల్లో 90శాతం మంది ఎస్సీ,ఎస్టీ, బీసీలే ఉంటారని తెలిపారు. ప్రైవేట్ కాలేజీలు వసూలు చేసే ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు ఏడాదికి రూ. 3,500-5,000వరకూ ఉంటుందని, కేవలం రూ.1,200 మత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. మిగతా ఫీజును విద్యార్థుల స్కాలర్‌షిప్ నుంచే వసూలు చేసుకోవాలని కాలేజీ యాజమాన్యానికి తల్లీదంవూడులు అంగీకారపత్రం ఇచ్చారని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్స్ రావడంతో కామాడ్డిలో విద్యార్థులను తీసుకెళ్లి ఏటీఎంలో డబ్బులను డ్రా చేయించారని, అందులో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా కేసులు బనాయించడం అన్యాయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Other News