|
|
రేపటి నుంచి ఇందిరమ్మ బాట!
హైదరాబాద్, జూలై 12 (టీ మీడియా):పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన స్వర్గీయ ఇందిరాగాంధీ స్పూర్తితో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌డ్డి వినూత్న కార్యక్షికమానికి శ్రీకారం చుడుతున్నారు. ‘ఇందిరమ్మ బాట’గా నామకరణం చేసిన ఈ కార్యక్షికమాన్ని శనివారం నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ గురువారం సచివాలయంలో సీఎంఓ అధికారులతో ‘ఇందిరమ్మ బాట’ కార్యక్షికమంపై సమీక్షించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్షికమాల అమలులో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా, పారదర్శకంగా అమలుచేయడానికి కట్టుబడి ఉన్నట్లు సీఎం స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు చేరుతున్న విధానాన్ని, తద్వారా కలుగుతున్న లబ్ధిని పర్యవేక్షించడానికే ‘ఇందిరమ్మ బాట’ను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్షికమంలో తనతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి వాస్తవాలను గుర్తించడంతో పాటు లోపాలున్నట్లయితే వాటిని పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. వచ్చే నెల రోజుల్లోగా కనీసం వంద శాసనసభ నియోజకవర్గాల్లో మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ప్రజా ప్రతినిధులు విస్తృతంగా పర్యటించి ఇందిరమ్మబాట కార్యక్షికమాన్ని విజయవంతం చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై ప్రజాభివూపాయాన్ని పరిగణలోకి తీసుకోవడంతోపాటు పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, ఆసుపవూతులు, రేషన్ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని నిర్దేశించారు. రూపాయికి కిలో బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ, ఇందిర జలవూపభ, రైతులకు జీరో వడ్డీ రుణాలు, ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలేని రుణాలు, రాజీవ్ యువకిరణాలు, ప్రభుత్వ ఉద్యోగాల జాతర, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, జలయజ్ఞం, స్కాలర్‌షిప్‌లు, మధ్యాహ్నభోజన పథకం, పింఛన్లు, ఉచిత విద్యుత్తు, మీ-సేవ తదితర సంక్షేమ కార్యక్షికమాల అమలును ఇందిరమ్మ బాటలో పర్యవేక్షిమని కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో మమేకమై సహపంక్తి భోజనాల్లో పాల్గొంటూ, బడుగు విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లలో రాత్రిపూట బస చేస్తారు. ఇందిరమ్మ బాట మొదటిరోజు: కొత్తగా శ్రీకారం చుట్టిన ఇందిరమ్మ బాట కార్యక్షికమాన్ని సీఎం కిరణ్ ఈనెల 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన మూడు రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం 9.35గంటలకు శంషాబాద్ విమానాక్షిశయం నుంచి బయలుదేరి 10.40గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి గోకవరం చేరుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 108, 104 సేవలను తనిఖీ చేస్తారు. తదుపరి కృష్ణునిపాలెం గ్రామంలో ఇందిర జలవూపభ, ఉపాధిహామీ పనులను పర్యవేక్షించి లబ్ధిదారులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రంపచోడవరంకు బయలుదేరుతారు. సాయంత్రం మూడు గంటలకు భూపతిపాలెం చేరుకుని ఇరిగేషన్ ప్రాజెక్టును తనిఖీ చేస్తారు. తదుపరి పెద్దగెద్దాడ గిరిజన తండాలో రైతులు, గిరిజనులతో సమావేశమవుతారు. అనంతరం రంపచోడవరం చేరుకుని అక్కడి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ విద్యార్థులతో సమావేశమై రాత్రి బస చేస్తారు. రెండోరోజు: మరుసటి రోజు 15వ తేదీన ఉదయం అమలాపురం చేరుకుని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో సమావేశమవుతారు. తదుపరి బండారులంక గ్రామంలోని చేనేత కార్మికులను కలుసుకుంటారు. ఉదయం పదిన్నరకు అమలాపురంలో రాజీవ్ యువకిరణాల శిక్షణా కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భట్నా ఇళ్ళ కాలనీ తనిఖీ చేసి లబ్ధిదారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాళ్ళరేవు మహిళా స్వయం సహాయక బృందాలతో సమావేశమై తదుపరి మత్య్సకారుల కాలనీని సందర్శించి చెక్కులను పంపిణీ చేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు ద్రాక్షారామంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆస్తుల పంపిణీ చేస్తారు. రాత్రికి కాకినాడలో బస చేస్తారు. మూడోరోజు: మూడవ రోజు 16వ తేదీన కాకినాడ కలెక్టరేట్‌లో ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్షికమాలను సీఎం సమీక్షించి మీడియాకు వివరిస్తారు. ఉదయం పదకొండున్నరకు సర్పవరంలో పార్టీ సమావేశంలోపాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తదుపరి ప్రభుత్వ ఆసుపవూతిలో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం మూడున్నరకు హెలికాప్టర్‌లో బిక్కవోలు చేరుకుని కేపీఆర్ ఎరువుల ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు అనపర్తి రోడ్డు ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. ఆనపర్తి నుంచి సీఎం కిరణ్ హెలికాప్టర్‌లో విశాఖపట్నం బయలుదేరి అక్కడి నుంచి రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Other News
|
|