|
|
తెలంగాణపై 16న రౌండ్ సమావేశం
-కొండా లక్ష్మణ్ బాపూజీ చిక్కడపల్లి, జూలై 12 (టీ మీడియా): తెలంగాణ రాష్ట్ర సాధనకు చివరి ప్రయత్నంగా స్వాతంత్య్ర సమరయోధులు అందరం కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 16న రౌండ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నామని స్వాతంత్య్ర సమరయోధుల కోర్ కమిటీ చైర్మన్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలిపారు. గురువారం కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన అశోక్‌నగర్‌లోని తన నివాసంలో వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాక పోవాడానికి రాజకీయ పార్టీలే ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీలకతీతంగా పోరాటం చేసేందుకు అన్ని పార్టీల నేతలను రౌండ్ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు, సమైక్యాంధ్ర కోరుతున్న లగడపాటి రాజగోపాల్ ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్షికమంలో బోయినపల్లి వెంకటరామారావు, ప్రతినిధులు సీహెచ్ కృష్ణమూర్తి, వద్దుల చంద్రాడ్డి, కేశవరావు, మనోహర్ పంతులు, తెలంగాణ నేతలు సంధ్యరాణి, రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Other News
|
|