Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 26, 2013
 


Home >> >>
బాబూ.. నీవొక నియంతవు!

-nani.1 talangana patrika telangana culture telangana politics telangana cinema టీడీపీ నీ సొత్తా.. నీ అబ్బ సొత్తా..!
- మాలాంటి వాళ్లకోసమే ఎన్టీఆర్ పార్టీ స్థాపించారు
- నీలాంటి పందికొక్కుల కోసం కాదు
- సీఎం సీటుకోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచావు
- నేడు కొడుకు కోసం నన్ను బలిపశువును చేశావు
- సీట్లను అమ్ముకున్న చరిత్ర నీది
- కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా పార్టీని తాకట్టుపెట్టావు
- నమ్మకద్రోహం నీ పేటెంట్ హక్కు
- నాపైనే జనాన్ని తిరగబడమంటావా?
- గుడివాడలో ఎవరు గెలుస్తారో చూద్దాం..!
- నిప్పులు చెరిగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని

విజయవాడ, టీ మీడియా ప్రతినిధి:‘టీడీపీ ఏమైనా చంద్రబాబు సొత్తా.. ఆయన అబ్బ సొత్తా..? ఉప ఎన్నికల్లో ప్రజలు గడ్డిపెట్టాకే చంద్రబాబు.. వైఎస్ జగన్‌ను తిట్టడం మానేశారు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్, హరికృష్ణ. అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కాబట్టి, ఆయనపై, ఆయన కుటుంబంపై ఉన్న అభిమానంతోనే చంద్రబాబు వద్ద ఇంతకాలం పనిచేశాను’ అని టీడీపీ నుంచి సెస్పన్షన్‌కు గురైన కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. నాడు ముఖ్యమంత్రి పీఠం కోసం అన్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు తనయుడు నారా లోకేష్‌ను అందలం ఎక్కించేందుకు తనను బలిపశువు చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు.

బడుగు, బలహీన వర్గాల కోసం, తమలాంటి అభిమానుల కోసం ఆనాడు టీడీపీని అన్న ఎన్టీఆర్ స్థాపించారని, బాబు వంటి పందికొక్కుల కోసం కాదని ఘాటైన పదజాలంతో నాని దూషించారు. నమ్మకవూదోహం, మోసం, దగా చంద్రబాబు పేటెంట్ హక్కు అని విమర్శించారు. నియంతలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు.

సంజాయిషీ అడక్కుండానే తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగా ఉండగా పార్టీ బాగుపడదన్నారు. తన సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తానని, కోర్టుకు వెళ్తానని, స్పీకర్‌ను, గవర్నర్‌ను కలుస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబుతోపాటు తనపై ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే తాను టీడీపీలో కొనసాగుతానని, లేకుంటే వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

నాపైనే జనాన్ని తిరగబడమంటావా?
చంద్రగిరిలో తరిమేస్తే కుప్పం పారిపోయిన వ్యక్తి.. తనపై తిరగబడమని జనానికి చెప్పడం సిగ్గుచేటని కొడాలి నాని అన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబును జనం ఛీకొట్టారని, ఎక్కడ కూడా డిపాజిట్లు దక్కలేదని ఎద్దేవా చేశారు. గుడివాడ ప్రజలను తనపై ఎందుకు తిరగబడతారని, గుడివాడలో ఎవరు గెలుస్తారో త్వరలోనే తేలుతుందన్నారు. అప్పట్లో జిల్లాలో 17 మందికి టికెట్లు ఇస్తే.. ఇద్దరమే గెలిచామని గుర్తుచేశారు. పోటుగాడివి, మగాడివి అయితే మిగతావారిని ఎందుకు గెలిపించుకోలేదని బాబును ప్రశ్నించారు. ‘చంవూదగిరి నుంచి కుప్పం పారిపోయింది నువ్వు. నేను గుడివాడలో ఉండి రాజకీయం చేస్తా. నీ మాదిరిగా నేను పారిపోను.

నీ సొంత నియోజకవర్గంలో నువ్వు పార్టీని గెలిపించుకోలేకపోయావు.. నా నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 80శాతం గెలిపించుకున్నాను. నీ దయాదాక్షిణ్యాలపై నేను రాజకీయం చేయడం లేదు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది హరికృష్ణ. రెండుసార్లు టికెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్. నన్ను చెప్పులతో, రాళ్లతో కొట్టాలని ప్రజలకు పిలుపునిస్తావా? నీ పిచ్చికుక్కలతో తిట్టిస్తావా? వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని రాళ్లతో, చెప్పులతో కొడతారో చూద్దాం..’ అని చంద్రబాబుకు నాని సవాల్ విసిరారు. ఢిల్లీ ఆదేశాల మేరకే ప్రస్తుతం టీడీపీ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ లేదన్నారు. పార్టీని హోల్‌సెల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేసిన ఘనత చంద్రబాబుదని, ముసుగేసుకెళ్లి సోనియాగాంధీ, చిదంబరం కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులతో, బీజేపీతో పొత్తుపెట్టుకొని ఆ పార్టీలను ముంచేసిన ఘనత కూడా బాబుదని నాని ఎద్దేవా చేశారు.

నాడు తెలంగాణలో టీఆర్‌ఎస్ స్వతంవూతంగా పోటీ చేస్తే మెరుగైన సీట్లు వచ్చేవని, బాబుతో పొత్తు పెట్టుకోవడంతోనే సీట్లు తగ్గాయన్నారు. వెన్నుపోట్లతో రాజకీయ వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారని ఆయన దుయ్యబట్టారు. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న తనలాంటి వారిని టీడీపీ నుంచి బయటకు పంపేందుకు కుట్ర సాగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబు నైజమని, నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో గద్దె దించేందుకు వైశ్రాయి హోటల్‌లో ఎమ్మెల్యేలను దిగ్బంధనం చేసి, కోట్లాది రూపాయలు గుమ్మరించారని ఆరోపించారు. తాను వైఎస్ జగన్ వద్ద పైసా తీసుకున్నట్లు నిరూపించేందుకు చంద్రబాబు సిద్ధమా? అని నాని సవాల్ విసిరారు.

లోకేష్ కోసమే బాబు కుతంవూతాలు
కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు బాబు కుతంవూతాలు చేస్తున్నారని, ఆయన తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని నాని వ్యాఖ్యానించారు. కుమారుడి కోసం తనను బలిపశువుని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి చక్రవర్తికి మారుపేరైన బాబు.. ఇటీవల రాజ్యసభ సీట్లను రూ. 300 కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తినే అయితే తాను వైఎస్సార్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేవాడినని చెప్పారు. ‘నీ(చంవూదబాబు) దయాదాక్షిణ్యాలపైన నేను టీడీపీలోకి రాలేదు. అన్న ఎన్టీఆర్ మీద అభిమానంతో వచ్చా’ అని నాని స్పష్టం చేశారు. గాలి జనార్దన్‌డ్డిని వేధించేందుకు నాడు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప నుంచి రూ. 300 కోట్లు చంద్రబాబు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

జగన్‌ను కలిస్తే తప్పేంటి?
‘జగన్‌తో ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా విజయమ్మను పరామర్శించేందుకు వెళ్లితే రెండు నిమిషాల్లోనే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశావు. అసలు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశావో సమాధానం చెప్పు. నువ్వు ఇతర పార్టీల నేతలతో వ్యక్తి గత సంబంధాలు పెట్టుకోవచ్చు..! ముసుగేసుకొని ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని, చిదంబరాన్ని కలువచ్చు. నేను మాత్రం కష్టాల్లో ఉన్న విజయమ్మను, జగన్‌ను కలిస్తే తప్పా’ అని చంద్రబాబును నాని నిలదీశారు. గతంలో కూడా జగన్‌ను నాలుగైదు సార్లు కలిశానని గుర్తుచేశారు. పార్టీ నుంచి తాను వెళ్లలేదని, మెడబట్టి బయటకు గెంటివేస్తున్నారని ఆయన అన్నారు. ‘జిల్లాకు చెందిన పిచ్చికుక్కలతో తిట్టిస్తావా! రూ. 30 కోట్లుకు అమ్ముడు పోయానని నాపై అబండాలు వేస్తావా! నేను ఒక్క పైసా తీసుకొలేదని నా ఇద్దరు కూతుళ్లయిన కనకదుర్గ, విజయదుర్గలతో కలిసి కనకదుర్గమ్మ గుడికి వస్తా.

వారి మీద ప్రమాణం చేస్తా..మీరు చేస్తారా’ అని ప్రశ్నించారు. ‘నీ రాజకీయ గురువు అయిన మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి రాజగోపాల్‌నాయుడుకు వెన్నుపోటు పొడిచావు. పార్టీలోకి ఆహ్వానించిన అన్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచావు. వెన్నుపోటు, దగా, మోసం, కుట్ర, కుంత్రం, కుళ్లుకు పేటెంట్ హక్కు నీవే..’ అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో చర్చించి తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. జగన్ తనను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారని, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ చంద్రబాబు చేతిలో ఉందని అన్నారు. తాను ఇకపై ఏ పార్టీలో ఉన్నా టార్గెట్ చంద్రబాబేనని కొడాలి నాని ప్రకటించారు. బాబుకు భజన చేసేవారికి తప్ప టీడీపీలో వేరేవారికి స్థానం లేదన్నారు. దేవినేని ఉమ తన తమ్ముడిని ఎంతకు అమ్మారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine