Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> >>
తెలంగాణ ఎవుసానికి కరెంట్ సావు

- ఎండిపోతున్న నారుమళ్లు.. -Raithu0 talangana patrika telangana culture telangana politics telangana cinema- గుండెలు బాదుకుంటున్న రైతులు
- కృష్ణా డెల్టాకు మూడో పంట కోసం సాగర్ నీరు
- తెలంగాణకు కనీస కరెంటూ కరువు
- సాకులు చెబుతూ తప్పించుకుంటున్న పాలకులు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మల్లగుల్లాలు
- గ్రామాల్లో రోజుకు పది గంటలు
- జిల్లా, మండల కేంద్రాల్లో 6 గంటలు
- హైదరాబాద్‌లో మూడు గంటలు.. కరెంట్ కట్
- పరిశ్రమలకూ తప్పని కోతలు
కోతలతో వేధిస్తున్న సర్కారు సాగుకు బోరుబావులే దిక్కు

వరుణుడే కాదు.. సాక్షాత్తు సర్కారూ కన్నెర్ర జేస్తోంది..!! కరెంటు కోతలతో తెలంగాణ వ్యవసాయాన్ని నట్టేట ముంచుతోంది. నారుమడిలో అన్నదాతకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఖరీఫ్ వేళ పొలం పనుల్లో మునిగితేలాల్సిన రైతు.. ఎప్పుడు కరెంటు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాడు. బోరుబావులపైనే ఆధారపడి సాగుతున్న వ్యవసాయం తెలంగాణది. బోరుబావుల్లో నీళ్లున్నా.. తోడుకునేందుకు కరెంటు లేదు! కళ్లముందే నారుమళ్లలో మొలకలు ఎండిపోతున్నాయి.

దిక్కుతోచని రైతన్న.. గుండెలు బాదుకుంటున్నాడు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను సైతం పణంగా పెట్టి కృష్ణా డెల్టాకు మూడో పంట కోసం నాగార్జునసాగర్ జలాలను విడిచిన సర్కారు.. తెలంగాణ ప్రాంత పంటలను కాపాడేందుకు కనీసం కరెంటును కూడా ఇవ్వడం లేదు. గ్యాస్ కొరత, బొగ్గు కొరత.. అంటూ సాకులతో తప్పించుకుంటోంది. గ్రామాల్లో రోజుకు పది గంటలు.. జిల్లా, మండల కేంద్రాల్లో ఆరు గంటలు.. హైదరాబాద్‌లో మూడు గంటలు.. నాన్ ప్రాసెసింగ్ పరిక్షిశమలకు వారానికి 2 రోజులు.. ప్రాసెసింగ్ యూనిట్లకు నెలలో 16 రోజులు... ఇలా కరెంటు కోతలు అమలు చేస్తోంది. ఇటు వ్యవసాయం సాగక.. అటు పరిక్షిశమలు నడువక తెలంగాణ వట్టిపోతోంది.
-Fuse talangana patrika telangana culture telangana politics telangana cinema
కోతలతో వేధిస్తున్న సర్కారు
- సాగుకు బోరుబావులే దిక్కు
- కరెంటు ఉంటేనే బోర్లు నడిచేది..!
- ఎండిపోతున్న నారుమళ్లు.. గుండెలు బాదుకుంటున్న రైతులు

హైదరాబాద్, జూలై 10 (టీ మీడియా): కరెంటు కోతలు తెలంగాణ రైతాంగానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొంది. వానలు, బోరుబావులపైనే ఆధారపడి తెలంగాణ రైతులు వ్యవసాయం చేస్తుంటారు. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాలు ముఖం చాటేయడంతో కనీసం కరెంట్ ఇచ్చయినా సర్కారు ఆదుకుంటుందని ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను సీమాంధ్ర పాలకులు అడియాశలు చేస్తున్నారు. కరెంటు సరఫరాలోనూ వివక్ష పాటిస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను పక్కనబెట్టి కృష్ణా డెల్టాకు మూడో పంట కోసం నాగార్జునసాగర్ జలాలను తరలించిన పాలకులు.. తెలంగాణలో వ్యవసాయానికి కరెంటు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారు.

సాకుల పేరిట సాగదీస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో(హైదరాబాద్ మినహా) దాదాపు 17 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు(బోరుబావులు) ఉన్నాయి. కరెంటు ఉంటేనే ఇవన్నీ నడుస్తాయి. అవి నడుస్తేనే సాగు ముందుకు సాగుతుంది. కానీ సర్కారు పట్టించుకోవడం లేదు. అవసరాల మేరకు విద్యుత్ కొనుగోలుపై ఆంక్షలు విధించడం, విద్యుత్ కొనుగోలుకు అయిన బకాయిలను చెల్లించకుండా తీవ్ర జాప్యం చేయటంతో పాటు తెలంగాణ జిల్లాలకు నిర్దేశించిన విద్యుత్ కోటాలోనూ కోతలు విధించడం పరిపాటిగా మారింది. తెలంగాణ జిల్లాల్లోని రెండు డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన కరెంటు సరఫరాలో కోతలు విధించడం, సీమాంధ్ర కంపెనీలకు విద్యుత్ అంచనాలకు మించి విద్యుత్ సరఫరా చేస్తుండటాన్ని ఈ రంగంలో ఉన్న కొందరు ఉదహరిస్తున్నారు.
Secter talangana patrika telangana culture telangana politics telangana cinema

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగిన సందర్భంలో ట్రాన్స్‌కో గ్రిడ్ నిర్వహణ బాధ్యతలు నిర్వహించే అధికారులు ఉద్దేశపూర్వకంగా సెంట్రల్ పవర్ డిస్కమ్, నార్తరన్ పవర్ డిస్కమ్‌ల విద్యుత్ కోటాలపైనే కోతలు విధిస్తున్నట్లు చెబుతున్నారు. ట్రాన్స్‌కో పరిధిలో 132కేవీ, 220కేవీ సబ్‌స్టేషన్లు ఉండటం వల్ల గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పడిపోతున్న సందర్భంలో వారివారి సబ్‌స్టేషన్ల పరిధిలోనే కోతలు విధించడం పరిపాటిగా మారింది. ఈ విధంగా రోజువారీగా తెలంగాణ కంపెనీలకు నిర్దేశించిన కోటాను కూడా ఇవ్వకుండా సీమాంధ్ర అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ కొరత కారణంగా తెలంగాణ జిల్లాలు ఇటు వ్యవసాయరంగంలోనూ పారిక్షిశామిక రంగంలోనూ మరింత వెనుకబాటుకు గురవుతున్నాయి. సిమెంటు పరిక్షిశమల(వూపాసెసింగ్ యూనిట్లు)కు నెలలో 16రోజుల పాటు కరెంటు కోతలు అమలు అవుతున్నాయి.

ఇతర అన్ని రకాల పరిక్షిశమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో రోజుకు మూడు గంటల పాటు, జిల్లా, మండల కేంద్రాల్లో రోజుకు ఆరు గంటలకు మించి కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పదిగంటలు కోతలు ఉంటున్నాయి.
Secter2 talangana patrika telangana culture telangana politics telangana cinema

లోపించిన దూరదృష్టి
ప్రస్తుతం నెలకొన్న కరెంటు సమస్యకు సర్కారు దూరదృష్టిలోపమే కారణమనే అభివూపాయం వ్యక్తమవుతున్నది. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ విద్యుత్‌రంగం పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో విద్యుత్‌రంగాన్ని పరిపుష్టిచేయకపోగా, సబ్సిడీల పేరుతో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఇందుకు కారణమని నిపుణుల అభివూపాయం. ఓట్ల రాజకీయాల కోసం సర్కారు ఇచ్చిన సబ్సిడీల భారం విద్యుత్ కంపెనీలకు ఈనాటి వరకు బకాయిలుగానే మిగిలిపోయాయి. ఏటా కనీసం పది శాతం మేరకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందనే కనీస పరిజ్ఞానం, పారిక్షిశామిక పెట్టుబడులతో కొత్తగా వచ్చే పరిక్షిశమలకు అయ్యే విద్యుత్ వినియోగం అంచనాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిగణనలోకి తీసుకోలేకపోయింది.

గ్యాస్, బొగ్గు లేదని సాకు
విద్యుత్ అవసరాలకు ప్రధాన ముడిసరుకులైన గ్యాస్, బొగ్గు కొరతలతో రాష్ట్ర విద్యుత్ రంగం మరింత సంక్షోభంలో పడుతున్నది. కేజీ బేసిన్‌లో గ్యాస్ కొరత నెలకొనడానికి రిలయన్స్ సంస్థ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శల జల్లు కురిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ వనరులపై దృష్టిసారించడంలో వెనుకంజ వేస్తున్నది. కేజీ బేసిన్ నుంచి గ్యాస్ వచ్చే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల యూనిట్లు ఒక్కొక్కటి క్రమంగా మూతపడుతున్నాయి. వాస్తవానికి ఇంధన మంత్రివర్గ ఉపసంఘం(ఈగామ్) నిర్ణయం మేరకు రాష్ట్రంలోని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్(ఐపీపీస్)కు రిలయన్స్ కేజీ బేసిన్-డీ6 నుంచి 75 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్) మేరకు రోజుకు 9.5 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ సరఫరా చేయాలనే ఒప్పందాలు ఉన్నాయి. అయితే అందులో ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి కేవలం 2.9 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను రిలయన్స్ సంస్థ సరఫరా చేస్తుండడం గమనార్హం.

దీంతో గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టులు గ్యాస్ కొరత కారణంగా నిర్వీర్యంగా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టులకు సింగరేణి సంస్థ నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. అయితే పెరుగుతున్న జెన్‌కో యూనిట్ల సామర్థ్యం మేరకు సింగరేణి కూడా సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జెన్‌కో ఇటీవల కాలంలో విదేశాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జెన్‌కో బొగ్గు దిగుమతులు చేసుకుంటున్నది.
Current1 talangana patrika telangana culture telangana politics telangana cinema

చార్జీల భారం మోస్తున్నా సరఫరా లేదన్నా..?
మెరుగైన సేవలందించే పేరుతో ఇటీవల కరెంటు చార్జీలను పెంచిన రాష్ట్ర సర్కారు సేవలు సరికదా ఉన్న కరెంటు సరఫరాను కూడా అందించడంలేదు. కరెంటు చార్జీల పేరిట తెలంగాణ ప్రజల నడ్డివిరిచింది. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, పవర్ లూమ్స్, బొమ్మల తయారీ, విస్తరాకుల పరిక్షిశమ, షుగర్ క్రషింగ్ యూనిట్లను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇష్టానుసారంగా కరెంటు చార్జీలను పెంచేసింది. రాష్ట్ర సర్కారు పెంచిన రూ.4,442కోట్ల విద్యుత్ చార్జీల వడ్డనలో ఒక్క తెలంగాణ జిల్లాలపైనే రూ. 2,500 కోట్ల నుంచి మూడు వేల కోట్ల భారాన్ని మోపుతున్నది. దీనికి తోడు ఇంధన సర్దుబాటు చార్జి(ఎఫ్‌ఎస్‌ఏ) పేరుతో పరోక్ష వడ్డనలు అమలుచేస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో 1,427 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలుండగా వీటిలో తెలంగాణలోని ఏడు జిల్లాల్లోనే తొంభై శాతం ఉన్నాయి. అందులోనూ 20,115 బోర్ ఎనభై శాతం మేరకు తెలంగాణలోనే ఉండడం గమనార్హం. అంతేకాకుండా చేనేత కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా కరెంటు చార్జీలను సర్కారు పెంచేసింది. రాష్ట్రంలో 70వేల మరమగ్గాలుండగా, అందులో తెలంగాణ జిల్లాల్లోనే యాభై వేలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనే 30వేల మరమగ్గాలు ఉన్న సంగతి తెలిసిందే.

డిమాండ్, సరఫరాల మధ్య అంతరం
కరెంటు డిమాండ్, సరఫరాల మధ్య అంతరం భారీగా పెరిగిపోతున్నది. సోమవారం(ఈనెల 9న) రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 250 మిలియన్ యూనిట్ల కాగా, ప్రభుత్వం 215 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మేరకు విద్యుత్ సరఫరా చేసింది. దాదాపు 35 మిలియన్ యూనిట్ల కొరత నెలకొనడంతో ఆమేరకు అన్ని రంగాలకు కరెంటు కోతలు అమలయ్యాయి. ఆర్థిక క్రమశిక్షణ పేరిట విద్యుత్ కొనుగోలు అంశంపై సర్కారు ఆంక్షలు అమలుచేస్తున్నది. గతంలో చేసిన విద్యుత్తు కొనుగోళ్లకు బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నది. కేవలం విద్యుత్ కొనుగోలు బకాయిలే సుమారు రూ. 6వేల కోట్లకు పైగా ఉన్నాయి. వీటికి తోడు ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ కంపెనీలకు రూ.20వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. సమీక్ష సందర్భాల్లో బకాయిలు ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నా సీఎం పట్టించుకోవడంలేదు. ఫలితంగా డిస్కమ్‌లు ఉన్నంతలో సర్దుబాటు చేసే పద్ధతులను అవలంబిస్తున్నాయి. వ్యవసాయరంగానికి ఏడు గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నట్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణలో ఉన్న పరిస్థితులకు పొంతన లేకుండా పోతున్నది.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine