టీబీజీకే..ఎస్!
- తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జైత్రయాత్ర
- అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్న కౌంటింగ్
- ఆరు ఏరియాల్లో ఫలితాల వెల్లడి
- మందమర్రిలో 729 , భూపాలపల్లిలో 122,కొత్తగూడెంలో 194 ఓట్లతో టీబీజీకేఎస్ విజయం
- ఇల్లందులో574, బెల్లంపల్లిలో 43 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ జయకేతనం
- కార్పొరేట్‌లో 174 ఓట్లతో ఐఎన్‌టీయూసీ విన్
- శ్రీరాంపూర్‌లో 3,500 ఆధిక్యంలో టీబీజీకేఎస్
- ఎన్నికల్లో 95 శాతం పోలింగ్ నమోదు
- మొత్తం ఓట్లు 63,429.. పోలైంది 60,242
- అత్యధికంగా ఇల్లెందులో 97.9 శాతం పోలింగ్
- తక్కువగా రామగుండం-3లో 94 శాతం
- గోదావరిఖనిలో పోలింగ్ సిబ్బంది ధర్నా
- కన్వేయన్స్ అల రూ.200 చెల్లించాలని ఆందోళన..ఆలస్యం గా లెక్కింపు
టీ మీడియా ప్రతినిధి బృందం:సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం దిశగా దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి దాటినా శ్రీరాం పూర్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాత్రి ఒంటిగంట వరకు అందిన సమాచారం ప్రకారం కోల్‌బెల్ట్‌లోని 11 ఏరియాల్లో ఆరింటిలో ఫలితాలు వెలువడ్డాయి. మంద మర్రిలో టీబీజీకేఎస్‌కు 3113ఓట్లు పోలయ్యాయి. 729 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీపై గెలిచింది. బెల్లంపల్లి లో ఏఐటీయూసీ 43 ఓట్లతో గెలిచింది. ఇక్కడ టీబీజీకేఎస్ కు 929, ఏఐటీయూసీకి 972, ఐఎన్‌టీయూసీకి 401 ఓట్లు వచ్చాయి. ఇల్లందులో ఏఐటీయూసీకి 574 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఏఐటీయూసీ 1007, టీబీజీకేఎస్ 427 ఓట్లు సాధించాయి. కొత్తగూడెంలో కార్పొరేట్‌లో ఐఎన్‌టీయూసీ 174 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. కొత్తగూడెంలో టీబీజీకేఎస్ 194 ఓట్లతో గెలిచింది. భూపాలపల్లిలో టీబీజీ కేఎస్ 122 ఓట్ల మెజార్టీతో గెలిచింది. టీబీజీకేఎస్ 2310, ఐఎన్ టీయూసీ 2188, ఏఐటీయూసీ 2047 ఓట్లు సాధిం చాయి. శ్రీరాంపూర్‌లో 3500 ఆధిక్యతతో టీబీజీకేఎస్ దూసుకెళ్తోంది. గోదావరిఖనిలోని మూడు రీజియన్లలోనూ కౌంటింగ్ ఆలస్యంగా మొదలైంది. కడపటి వార్తలందేసరికి టీబీజీ కేఎస్ పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
భారీస్థాయిలో పోలింగ్ నమోదు
దక్షిణభారత దేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పాదన పరిక్షిశమగా విరాజిల్లుతున్న సింగరేణిలో గురువారం జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 63,429 మంది కార్మికులు ఓటు హక్కు కలిగి ఉండగా 60,247 మంది ఓటేశారు. 3,182 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మధ్యాహ్నం 12 గంటలకే దాదాపు లన్ని ఏరియాల్లో 60 శాతం పోలింగ్ పూర్తయింది. ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 2007లో యూనియన్ గుర్తింపు ఎన్నికలకన్నా ఈ సారి కార్మికులకు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్‌కు సెలవు ప్రకటించనప్పటికీ కార్మికులు తమకు వీలున్న సమయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్‌ఎంఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో టెంట్లు వేసి హంగామా చేశారు. సింగరేణి ఉద్యోగులైన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య రామకృష్ణాపూర్‌లో, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య గోదావరిఖనిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగరేణివ్యాప్తంగా 95 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్‌ఎల్‌సీ శ్రీవాత్సవ ‘టీ మీడియా’కు చెప్పారు. 2007 గుర్తింపు ఎన్నికల్లో 94.12 శాతం ఓట్లు పోలవగా, తాజాగా ఎన్నికల్లో 95 శాతం పోలింగ్ నమోదైంది.
రెండు గంటలు ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభం
గోదావరిఖని: ఎన్నికల్లో కన్వేయన్స్ అల చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ సిబ్బంది (ఉపాధ్యాయులు) ధర్నా చేయడంతో రెండు గంటల పాటు కౌంటింగ్ నిలిచింది. గోదావరిఖనిలో ఆర్‌జీ-1 కమ్యూనిటీ హాలులో రామగుండం రీజియన్‌లోని 3 డివిజన్లకు చెందిన 28 పోలింగ్‌బూత్‌లో 140 మంది సిబ్బంది రెండు రోజులుగా విధులు నిర్వర్తించారు. తమకు ఇచ్చే రూ.350కి తోడుగా కన్వేయన్స్ అల కింద మరో రూ.200 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఎన్నికల చీఫ్ కో-ఆర్డినేటర్ కేవీ రవీంవూధనాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంచంవూదయ్య, గోదావరిఖని సబ్ డివిజనల్ డీఎస్పీ ఉదయ్‌కుమార్‌డ్డి, సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 జీఎం బీ కిషన్‌రావు తదితరులు సిబ్బందితో చర్చలు జరిపారు. రూ.200 చొప్పున అల ఇవ్వడానికి అంగీకరించడంతో కౌంటింగ్ ప్రారంభించారు.
విలేకరులపై మంథని సీఐ దౌర్జన్యం
- పోలింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరణ
- యూజ్‌పూస్ ఫెలోస్ అంటూ బూతులు
- అనుమతికార్డులు చూపినా దౌర్జన్యం
- ‘నమస్తే తెలంగాణ’ విలేకరి అరెస్టు
- ఠాణా ఎదుట జర్నలిస్టుల ధర్నా..విలేకరి విడుదల
గోదావరిఖని: సింగరేణి ఎన్నికల బందోబస్తులో మంథని సీఐ తిరుపతిరావు విలేకరుపై నోరు పారేసుకున్నాడు. ‘యూజ్‌పూస్ ఫెలోస్... ఎవడ్రా మిమ్మల్ని రమ్మంది? చేతిలో కెమెరాలు ఉంటే మీరేమైనా హీరోలా! కలం ఉంటే పెద్ద తురుంఖాన్‌లా! నేనెవరో మీకు తెలుసా? అసలు మిమ్మల్ని పంపించిందెవర్రా... మీకు అనుమతి కార్డులిచ్చిందెవర్రా? అంటూ హద్దుమీరి ప్రవర్తించారు. అనుమతి కార్డు ఉందని విలేకరు లు చూపించినా అసభ్య పదజాలంతో దూషించారు. ఆర్జీ-2 పరిధిలోని కృషి భవన్‌లో ఓటు వేస్తున్న హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఆహ్మద్‌ను ఫొటో తీసేందుకు విలేకరులు లోపలికి వెళ్తుండగా కానిస్టేబుల్ అడ్డగించాడు. ఎన్నికల అధికారులు ఇచ్చిన పాస్‌లు ఉన్నాయని చూపిండంతో సీఐ తిరుపతిరావుకు కానిస్టేబుల్ వివరించాడు. సీఐ వచ్చి బూతులు తిడుతూ వీరంగం ప్రదర్శించాడు. సీఐ వైఖరికి నిరసిస్తూ ‘నమస్తే తెలంగాణ’ విలేకరి అక్కడే బైఠాయించాడు. విలేకరిని బలవంతంగా లాగేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో టీజేఎఫ్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఠాణాను ముట్టడించి ఆందోళనకు దిగారు.
విలేకరిని విడిచిపెట్టి సీపీ క్షమాపణ చెప్పాలని, అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశా రు. గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, సీఐ ఆర్‌వూపకాష్‌లు పాత్రికేయులను సముదాయించారు. సీఐపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విలేకరులు ఆందోళన విరమించారు. అరెస్టు చేసిన విలేకరిని విడుదల చేశారు. సీఐ తిరుపతిరావును ఎన్నికల బందోబస్తు విధుల నుంచి తొలగించారు. ఆం దోళనలో టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ మునీర్,రామగుండం నియోజక వర్గ కన్వీనర్ ఏ రవీందర్ రెడ్డి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వంశీ, కార్యదర్శి శ్యామ్, విలేకరులు నాగపురి సత్యం, మచ్చకుర్తి కుమార్, పింగిళి కృష్ణాడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జబ్బార్‌ఖాన్, మాధవరావు, సాయిశంకర్ పాల్గొన్నారు.
Other News