త్వరలోనే తెలంగాణ
-
రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం సానుకూలం
- ‘ఉప’ ఫలితాల తర్వాత రాజకీయాల్లో మార్పులు
- రాష్ట్రం వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి..జిల్లాల పునర్విభజన
- టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
జగిత్యాల, జూన్ 13 (టీ మీడియా):‘త్వరలోనే తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం వందశాతం తథ్యం. పదకొండేళ్ల ఉద్యమం ఫలించబోతోంది. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో మార్పులు రావడం ఖాయం. కేంద్రం సైతం తెలంగాణపై సానుకూల దిశలో ఆలోచన చే స్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వస్తుందన్న సమాచారం ఉంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో స్పేస్ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్షికమానికి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తామన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు.
దేశంలో పశ్చిమబెంగాల్, ఆంధ్రవూపదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన జరిగిందని, తెలంగాణ రాష్ట్రం అవతరించాక జిల్లాల పునర్విభజన ఉంటుందని చెప్పారు. రిటైర్డ్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు రాంలక్ష్మణ్, పేర్వారం రాములు తదితరులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసంప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇటీవలే జిల్లాల పునర్విభజన ఎలా ఉండాలో బ్లూప్రింట్‌ను అందించారని తెలిపారు. బ్లూప్రింట్‌లో జగిత్యాల డివిజన్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలని సూచించారని పేర్కొన్నారు.
గతంలో విద్యారంగంలో సీమాంవూధులే గుత్తాధిపత్యం వహించారని, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఇక్కడ సైతం మంచి ఎదుగుదల నమోదవుతోందని చెప్పారు. కార్యక్షికమంలో ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మంత్రి జీవన్‌డ్డి, టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్, రాజేశంగౌడ్, చరివూతకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య, జితేందర్‌రావు, రమణరావు, డాక్టర్ గంగాడ్డి, తుల ఉమ, పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌డ్డి, మాజీ ఎంపీపీ బాదినేని రాజేందర్ తదితరులున్నారు.
Other News