గీత దాటిన బీజేపీ సభ్యులు!
-
కర్ణాటకలో భారీగా క్రాస్ ఓటింగ్.. ప్రణబ్‌కు అధికంగా 19 ఓట్లు
- గుజరాత్‌లోనూ ఓ ఎమ్మెల్యేది అదే దారి
- క్రాస్ ఓటింగ్‌పై విచారణ జరుపుతాం: బీజేపీ
న్యూఢిల్లీ, జూలై 22: అసమ్మతి కుమ్ములాటలు, వర్గ రాజకీయాలతో అల్లాడుతున్న కర్ణాటక బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో షాక్ తగిలింది. యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యేలు పలువురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ప్రణబ్‌కు 117 ఎమ్మెల్యేల ఓట్లు దక్కాయి. ఆయన ప్రత్యర్థి సంగ్మాకు 103 ఓట్లు మాత్రమే పడ్డాయి. ప్రణబ్‌కు 78 మంది కాంగ్రెస్, 27 మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఆయనకు 98 ఓట్లు మాత్రమే రావాలి. కానీ ఏకంగా 19 ఓట్లు ప్రణబ్‌కు అధికంగా వచ్చాయి. కర్ణాటకలో మొత్తం 224 మంది శాసనసభ్యులు ఉండగా, ఓ ఎమ్మెల్యే ఓటింగ్‌లో పాల్గొనలేదు. కర్ణాటకలో ప్రణబ్‌కు 15,327 ఓట్ల విలువ, సంగ్మాకు 13,493 ఓట్ల విలువ లభించింది. ఫాక్షన్ రాజకీయాలతో కల్లోలంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో గత రెండేళ్లలోనే ముగ్గురు ముఖ్యమంవూతులను మార్చింది.
కాగా, గుజరాత్‌లోనూ ఓ బీజేపీ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడు. ప్రణబ్‌కు అనుకూలంగా ఓటు వేశాడు. ప్రణబ్‌కు కాంగ్రెస్ (54), ఎన్సీపీ (3), జేడీయూ (1) మద్దతు ఉండగా, 59 ఓట్లు పడ్డాయి. సంగ్మాకు అనుకూలంగా 123 మంది శాసనసభ్యులు ఓటేశారు. బీజేపీ ఎమ్మెల్యే కనుభాయి కల్సారియా తాను ప్రణబ్‌కు ఓటేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేలు అనూహ్యంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో సంగ్మాకు వస్తాయనుకున్న ఓట్లు కూడా రాలేదు. దీంతో ఆయన ఆశించినమేరకు కూడా పోటీ ఇవ్వలేదని భావిస్తున్నారు. ఈ విషయంపై పరిశీలన జరుపనున్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదివారం విలేకరులకు తెలిపారు.
Other News