|
|
Home >> >>
సుప్రీం తీర్పు కేంద్రానికి
చెంపపెట్టు: ఆర్ కృష్ణయ్య
న్యూఢిల్లీ, జూన్ 13 (టీ మీడియా): మైనారిటీలకు సబ్‌కోటా చెల్లదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఓబీసీలకు అన్యాయం చేయతలపెట్టిన కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఓబీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల కోటా నుంచి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యంగ పరంగా, చట్టపరంగా చెల్లదని సుప్రీం తీర్పు ద్వారా వెల్లడైందని తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని తాము ఓ వైపు పోరాడుతుంటే, ఉన్న రిజర్వేషన్లను తగ్గించి వారి అభివృద్ధిని దెబ్బతీసే కుట్రకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు.ముస్లింలపై నిజంగా ప్రేమ ఉంటే రాజ్యంగాన్ని సవరించి వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా బీసీల కోటా నుంచి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే, బీసీలు చూస్తూ ఊరుకోరని కేంద్రాన్ని హెచ్చరించారు.
Other News
|
|||||