ఏఐఈఈఈ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ, జూన్ 9: అఖిల భారత స్థాయిలో జరిగే ఆల్ ఇండియా ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఈ) ప్రవేశ పరీక్ష ఫలితాలను సీబీఎస్‌ఈ శనివారం విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన సంజీవ్ పాత్రి 360కు గాను 346 మార్కులు సాధించి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 29న జరిగిన ఈ పరీక్షకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు aieee.nic.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
Other News