|
|
35 వేలు ఇస్తాం
 - ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తేల్చిచెప్పిన డిప్యూటీ సీఎం - ఇష్టమైతే అంగీకార పత్రాలు ఇవ్వండి - యాజమాన్యాల్లో భిన్నాభివూపాయాలు - రూ.35 వేలకు 80 శాతం కళాశాలల అంగీకారం - రూ.40 వేలు చెల్లించాల్సిందేనని మరికొన్నింటి డిమాండ్ - ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదన మేరకు ఫీజులు: టాప్ 30 కాలేజీల షరతు - తనిఖీలు నిర్వహించి ఫీజుల నిర్ణయానికి ఓకే: సర్కారు - సీఎంను కలవాలని యాజమాన్యాల నిర్ణయం - నేడు ముఖ్యమంవూతితో సబ్ కమిటీ భేటీ - ఫీజులు, కౌన్సెలింగ్ తేదీలపై నేడు ప్రకటన వెలువడే అవకాశం హైదరాబాద్, ఆగస్టు 12 (టీ మీడియా): ఫీజులు పెంచాలన్న ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాల డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. తాననుకున్న రీతిలోనే ప్రతిపాదనలను ముందు పెట్టింది. గత ఐదురోజులుగా జరుగుతున్న చర్చలు పూర్తిస్థాయిలో సఫలం కానప్పటికీ పురోగతి సాధించిన చెప్పాలి. రెండు రకాల ఫీజులు నిర్ణయించి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఏఎఫ్‌ఆర్సీకి డాక్యుమెంట్లు సమర్పించని కాలేజీలన్నింటికీ రూ. 35 వేలు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తేల్చిచెప్పారు. ఇది రెండేళ్లకు వర్తిస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు రెండురోజుల్లో అంగీకార పత్రాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనపై కాలేజీ యాజమాన్యాల్లో భిన్నాభివూపాయాలు వ్యక్తమౌతున్నాయి.
తాము డిమాండ్ చేస్తున్న రూ. 40 వేల ఫీజు చెల్లించాల్సిందేనని కొన్ని కాలేజీలు పట్టుబడుతున్నాయి. అయితే ఏఎఫ్‌ఆర్సీకి డాక్యుమెంట్లు ఇవ్వని మెజార్టీ కాలేజీలు మాత్రం రూ.40 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూనే డిప్యూటీ సీఎం ప్రతిపాదనకు అంగీకరించాయి. రూ. 35 వేల ఫీజు రెండేళ్ళకు వర్తిస్తుందన్న ప్రభుత్వ వాదనకు ఇంజినీరింగ్ కాలేజీలు అంగీకరించటం లేదు. ప్రభుత్వం రెండేళ్ళకు ఇదే ఫీజు వర్తిస్తుందని చెప్పినప్పటికీ తాము ఈ ఏడాదికి మాత్రమే రూ. 35 వేల ఫీజు అంగీకరించినట్లు కన్సార్షియం ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేశ్వర్‌డ్డి మీడియాకు తెలిపారు. అయితే ఏఎఫ్‌ఆర్సీకి డాక్యుమెంట్లు ఇచ్చిన సుమారు టాప్ 30 కాలేజీలు మాత్రం ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదనల మేరకు ఏకీకృత ఫీజు నిర్ణయిస్తూ ఫీజులు ఏ మేరకు పెరిగితే ఆ ఫీజులు చెల్లించాలని తేల్చిచెప్పాయి.
దీంతో హైకోర్టు తీర్పు ప్రకారం తనిఖీలు నిర్వహించి ఫీజులు చెల్లిస్తామని మంత్రులు దామోదర రాజనర్సింహ, బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, బీ సారయ్య చెప్పటంతో కాలేజీలు ఇందుకు అంగీకరించాయి. అయితే ఏఎఫ్‌ఆర్సీకి డాక్యుమెంట్లు ఇచ్చిన మిగతా కాలేజీలు మాత్రం తనిఖీలు లేకుండా రూ.40 వేల ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
సోమవారం ముఖ్యమంవూతిని కలిసి ఫీజుల పెంపు అంశాన్ని చర్చించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఫీజుల పెంపు అంశం కొలిక్కి రానప్పటికీ సోమవారం ముఖ్యమంవూతితో సబ్ కమిటీ భేటీ తర్వాత ఫీజుల చెల్లింపు అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో యాజమాన్యాలతో చర్చల అనంతరం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలిపారు.
ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిన అంశాలు: రూ. 35 వేలు ఫీజు నిర్ణయం రెండేళ్ళకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రతిపాదించగా, 2012-13 సంవత్సరానికే ఈ ఫీజుకు అంగీకరించినట్లు కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. రెండేళ్ళకు అంగీకరిస్తే నాలుగేళ్ళపాటు ఇదే ఫీజు తీసుకోవాల్సి ఉంటుందని వాటి వాదన. మంత్రి పితాని సత్యనారాయణ ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండానే మీడియాతో భేటీని ముగించేశారు. ఏఎఫ్‌ఆర్సీ ప్రతి మూడేళ్ళకోసారి ఫీజులు నిర్ణయిస్తుంది. రెండేళ్ళ క్రితం నిర్ణయించిన ఫీజు గడువు ఈ ఏడాదితో ముగుస్తుంది. వచ్చే ఏడాది కూడా ఇదే ఫీజుకు అంగీకరిస్తే ప్రస్తుత ఏడాది నుంచి నాలుగేళ్ళపాటు ఇదే ఫీజు తీసుకోవాల్సి ఉంటుందని కాలేజీల యాజమాన్యాలు అభివూపాయపడుతున్నాయి. రూ. 35 వేల ఫీజుకు అంగీకరించామని మెజార్టీ కాలేజీ యాజమాన్యాలు అంటుండగా మరికొన్ని కాలేజీలు రూ. 40 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం రూ. 35 వేలు కాకుండా ఇంకాస్త పెంచి ఇస్తుందా అనే అంశం తేలాల్సి ఉంది. రూ. 35 వేలు ఫీజు అంగీకరించకుండా ఉన్న కాలేజీల్లో ఏకీకృత ఫీజు రూ. 50,200 నిర్ధారించాల్సి ఉంటుంది.ఈ ఫీజుపై 150 శాతం వరకు పెంచాల్సి ఉంటుంది. తనిఖీలు నిర్వహించి ఫీజులు ఇవ్వాలని సుమారు 30 కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. రూ.35 వేలు ఫీజు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించింది. మిగతా పెరిగే ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందా? విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుందా?.. అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది.
చర్చలు సఫలం: మంత్రి పితాని ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో జరిపిన చర్చలు సఫలం అయినట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. రూ.35 వేల ఫీజు చెల్లిస్తామనే ప్రతిపాదనకు కాలేజీ యాజమాన్యాలు అంగీకరించాయని ఆయన చెప్పారు. ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ తేదీల షె డ్యూల్‌ను సోమవారం వెల్లడించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం ముఖ్యమంవూతితో సబ్ కమిటీ భేటీ కానున్నట్లు వివరించారు. ఫీజుల పెంపు అంశాన్ని ముఖ్యమంవూతికి వివరించి సబ్ కమిటీ నిర్ణయం ఆమోదం పొందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఫీజులపై కోర్టుకు వెళతాం: ఎన్ రమేష్ రాష్ట్ర ప్రభుత్వ చర్చలు సఫలం కాలేదని ఏపీ కన్సార్షియం ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ చైర్మన్ ఎన్ రమేష్ అన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు రూ.40 వేలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అంగీకరించటం లేదన్నారు. ఫీజుల అంశాన్ని కోర్టులో తేల్చుకోనున్నట్లు తెలిపారు. 35 వేల ఫీజు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని, కానీ మరోసారి సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సంఘాల తరపున ఫీజులు అంగీకరించలేదు: నోవా కృష్ణారావు, ప్రదీప్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన రూ. 35 వేల ఫీజు చెల్లింపుపై కాలేజీ యాజమాన్యాలు ఇంజినీరింగ్ కాలేజీ సంఘాల తరుపున కాకుండా ఎవరికివారుగా ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించినట్లు ఇంజినీరింగ్ కాలేజీ యజమానులు నోవా కృష్ణారావు, ప్రదీప్, కృష్ణారావు తెలిపారు. కౌన్సెలింగ్ ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించినట్లు వారు వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళం దృష్ట్యా ఇప్పటికే 30 శాతం మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.
Other News
- ఎండుతున్నది - 2013-05-24
- మండుతున్నది.. - 2013-05-24
- చెప్పినట్లు చేశా.. కోరినట్లు చేయండి - 2013-05-24
- రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ ధర రూ.3.50 - 2013-05-24
- ఎస్పీవైకి.. ఎక్సైజ్ జీ హుజూర్! - 2013-05-24
- క్యాప్టివ్ పవర్‌కు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు - 2013-05-24
- ప్రకాష్‌ను విడుదల చేయాలి : జయవింద్యాల - 2013-05-24
- మచిలీపట్నం నుంచి 2, 9, 16, 23, 30వ తేదీల్లో సికింవూదాబాద్ ప్రయాణిస్తాయి. - 2013-05-24
- బెల్టు తీసి.. పర్మిట్ రూమ్స్ - 2013-05-24
- జూన్, జులైల్లో.. 70 స్పెషల్ రైళ్లు - 2013-05-24
- ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు - 2013-05-24
- ఐఐటీ, టెక్నో, ఒలింపియాడ్ పేర్లను తొలగించండి - 2013-05-24
- కీళ్ల వ్యాధులతో గుండెకు ముప్పు ! - 2013-05-24
- త్వరలో ఎస్పీల బదిలీలు! - 2013-05-24
- రెడ్డి ల్యాబ్స్‌కు ఊరట - 2013-05-24
- కంటి వైద్య నిపుణుడి విరాళం - 2013-05-24
- 34,450 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ - 2013-05-24
- రంగంలోకి యాక్షన్ టీంలు - 2013-05-24
- పొంచిఉన్న..విత్తన ముప్పు - 2013-05-24
- తెలంగాణపై టీడీపీ ఎప్పుడో స్పష్టత ఇచ్చింది - 2013-05-24
- స్థానిక ఎన్నికలకు ఏడాదిలో 8వేల కోట్ల వ్యయం - 2013-05-24
- చంద్రబాబు బహురూపులోడు: ఈటెల - 2013-05-24
- సర్కారు అధికారులు.. విదేశీ టూర్లు - 2013-05-24
- టీడీపీలో కొనసాగితే చరివూతహీనులే - 2013-05-24
- మున్సిపల్, కార్పొరేషన్లలో.. బీసీ జనగణన షురూ - 2013-05-24
- రాష్ట్ర మహిళా ఎస్సీ కమిషన్ల చైర్మన్లుగా త్రిపురాన, గంగాధర్? - 2013-05-24
- రోషం లేని నేతల వల్లే తెలంగాణ రాలేదు - 2013-05-24
- జగన్ అరెస్టుకు నిరసనగా 27, 28న నిరసన కార్యక్షికమాలు - 2013-05-24
- నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు - 2013-05-24
- ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే చేప ప్రసాదం పంపిణీ - 2013-05-24
- దసరా డెడ్‌లైన్ - 2013-05-24
- ద్రోహపు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి - 2013-05-24
- వనరుల సంరక్షణకు మహోద్యమం - 2013-05-24
- ముగ్గురు సీఎంల 101 తప్పులపై ప్రజా చార్జిషీట్ విడుదల - 2013-05-24
- 27న జిల్లాల పీసీసీ సమన్వయకర్తల సమావేశం: బొత్స - 2013-05-24
- కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి: శంకర్రావు - 2013-05-24
- కార్మికుల ప్రత్యేక సభ్యత్వ నమోదు - 2013-05-24
- వరంగల్ బిషప్ బాలకు పట్టాభిషేకం - 2013-05-24
- అవినీతిపరుడు చంద్రబాబు: పొంగులేటి - 2013-05-24
- నిలోఫర్‌ను సందర్శించిన మానవహక్కుల సంఘం - 2013-05-24
- సబ్‌ప్లాన్ అమలు చేయకుంటే కాంగ్రెస్‌కు బొందే - 2013-05-24
- నేడు కరీంనగర్లో తెరవే జిల్లా 3వ మహాసభలు - 2013-05-24
- బీజేపీ తెలంగాణ కమిటీని ఏర్పాటు చేయాలి - 2013-05-24
- చెరువులో పడి అమ్మమ్మ, మనవరాలి మృతి - 2013-05-24
- తక్కువ మార్కులు వచ్చాయని..పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - 2013-05-24
- కాగ్ నివేదికలు, కోర్టు అక్షింతలే.. - 2013-05-24
- ఓబీసీలకు ఒరిగిందేమీలేదు: జయప్రసాద్ - 2013-05-24
- నెత్తురోడిన రహదారులు - 2013-05-24
- పోరాడితేనే రాజ్యాధికారం - 2013-05-24
- కనీస వేతనం 15 వేలు ఇవ్వాలి - 2013-05-24
- జూన్ 1 నుంచి నగదు బదిలీ అమలు - 2013-05-24
- వస్తువుల నాణ్యతలో రాజీ లేదు - 2013-05-24
- పెద్ద నోట్ల ఆద్యుడు బాబే: గట్టు - 2013-05-24
- చలో అసెంబ్లీ - 2013-05-24
- ఉద్యోగుల హెల్త్‌కార్డులపై రెండు రోజుల్లో డ్రాఫ్ట్ జీవో - 2013-05-24
- తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత - 2013-05-24
- ‘ముందస్తు’కు ఈసీ కసరత్తులు! - 2013-05-24
- ఉద్యమకారులపై అణచి వేత తగదు - 2013-05-24
- సీఎం-డిప్యూటీ సీఎం మధ్య ముదురుతున్న కయ్యం! - 2013-05-23
- పీసీసీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం - 2013-05-23
|
|