ఎట్టకేలకు కంతనపల్లి!

- ప్రాజెక్టు చేప సర్కార్ గ్రీన్ సిగ్నల్
- ప్రస్తుతం డ్యామ్ వరకే నిర్మాణం
- మొత్తం పూర్తయితే 7.5 లక్షల ఎకరాలకు నీరు
- తెలంగాణ ప్రజల పోరాట ఫలితమిది
- కాకతీయ కెనాల్ వరకు
చేపట్టాలని ఇంజినీర్ల డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 6 (టీ మీడియా): రెండు ప్రాజెక్టులకు తల్లిగా చెప్పుకునే కంతనపల్లి ప్రాజెక్టు ఎట్టకేలకు సాకారం కానుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తొలుత కేవలం డ్యామ్ నిర్మాణానికే అనుమతి ఇస్తూ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన కంతనపల్లి ్ల ప్రాజెక్టుకు 2008లోనే అప్పటి ప్రభుత్వం జీవో జారీచేసినా, వివిధ రకాల కారణాలతో ఇంతకాలం పెండింగ్‌లో పెట్టారు. తెలంగాణ ప్రజల పోరాటాల ఫలితంగా ఈ ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చనుంది. డ్యామ్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వస్తుందని ఆ శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ‘టీ మీడియా’తో చెప్పారు.
ఎన్నికల స్టంట్
2009 సార్వవూతిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం కంతనపల్లి ప్రాజెక్టును ఎన్నికల స్టంట్‌గా వినియోగించుకుంది. వాస్తవానికి 1975లోనే నీటి కేటాయింపులు జరిగిన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును రకరకాల సాకులతో అటకెక్కించిన సర్కార్, ఇచ్ఛంపల్లికి ప్రత్యామ్నాయం అంటూ జీవోసైతం విడుదల చేసి ఇంతకాలం తాత్సారం చేసింది. కంతనపల్లి ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాల్లో 7.5 లక్షల ఎకరాల స్థిరీకరణతోపాటు జీవం లేని దేవాదులకు పునర్జీవం కలిగే అవకాశం ఉంది. గోదావరి ట్రిబ్యునల్‌లో పోలవరం, ఇచ్ఛంపల్లి ప్రాజెక్టులకు 1975లోనే కేటాయింపులు జరిగాయి. అయితే ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయంటూ పెండింగ్‌లో పెట్టారు. గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇచ్ఛంపల్లివివాదం గురించి మాత్రమే ప్రస్తావించిన సీమాంధ్ర సర్కార్, పోలవరం విషయం వచ్చేసరికి సమక్షిగ నివేదికను సమర్పించింది.
ముంపు తగ్గించేందుకు రిజర్వాయర్ లెవల్‌ను తగ్గించుకునే మార్గాలున్నాయని ఇంజినీర్లు చెప్పినా, ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అయితే తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పసిగట్టిన వైఎస్ సర్కార్ ఎన్నికల ముందు హడావుడిగా కంతనపల్లిని తెరపైకి తీసుకొచ్చింది. తూతూ మంత్రంగా రూపొందించిన నిబంధనలతో పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి వ్యతిరేకత ఎదురయింది. దాంతో ఆ ఫైల్‌ను పక్కనపడేశారు.
ప్రజా చైతన్యం
కంతనపల్లి వల్ల కలిగే ప్రయోజనాలను తెలంగాణ రిటైర్డు ఇంజినీర్లు ప్రజలకు వివరించి చైతన్యం తీసుకొచ్చారు. ఫలితంగా కంతనపల్లి ప్రాజెక్టు సాధనకోసం పార్టీలకు అతీతంగా ఉద్యమాలు జరిగాయి. ఇటీవల ఉప ఎన్నికల సమయంలో కంతనపల్లి ్ల ప్రాజెక్టు చేపడతామని ముఖ్యమంత్రి వాగ్దానం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రజల ఒత్తిడితో తెలంగాణ ప్రజావూపతినిధులు కూడా సీఎంపై ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు ప్రాజెక్టు చేప అంగీకరించారు. దేవాదులకు 10 కిలోమీటర్ల కిందకు వెళితే కంతనపల్లి వస్తుంది. అక్కడ 100 టీఎంసీల సామర్థ్యంతో బ్రిడ్జి నిర్మాణం ద్వారా నీటిని రెండు దశల్లో తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం సవివర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఫేజ్-1 ద్వారా 50 టీఎంసీల నీటిని లిఫ్ట్ ద్వారా మూడు స్టేజీల్లో కాకతీయ కెనాల్‌లో కలిపే విధంగా ప్రణాళికలు సిద్ధంచేశారు.

మొదటి లిఫ్ట్‌ను తుమ్మలపల్లి వాగు, రెండో లిఫ్ట్‌ను జంగాపల్లి దగ్గర, మూడో లిఫ్ట్‌ను 222 కిలోమీటర్ మైలురాయి వద్ద ఏర్పాటుచేసి కాకతీయ కెనాల్‌లో కలుపుతారు. దీనిద్వారా ఎస్సాస్పీస్టేజ్-1లో 3,10,000 ఎకరాలు, స్టేజ్-2లో 4,40,000 ఎకరాలు స్థిరీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. 875 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. మొత్తం 81కిలోమీటర్లు టన్నల్ ద్వారా, 25 కిమీ ఓపెన్‌ఛానల్ ద్వారా ప్రాజె క్టు చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తయితే ఎస్పాస్పీ పరిధిలోని వరంగల్ జిల్లాలో 4,23,578 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 2,57,508 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 68,914 ఎకరాలు.. మొత్తం కలిపి 7,50,000 ఎకరాలను స్థిరీకరించుకోవచ్చని ఇంజినీర్లు అన్నారు. కంతనపల్ల్లి ద్వారా అటు దేవాదుల ఇటు ఎస్సాస్పీకి జీవంపోసే విధంగా ప్రణాళికను రూపొందించారు.
తొలుత డ్యామ్ నిర్మాణమే
ప్రస్తుతం కంతనపల్లి డ్యామ్ నిర్మాణాన్ని మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్యామ్‌నిర్మాణానికి రూ.2,600 కోట్ల వ్యయం కావచ్చని అంచనా. దేవాదుల ప్రాజెక్టుకు డ్యామ్ లేకపోవడంతో నీళ్లు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. దేవాదులకు దిగువనున్న కంతనపల్లి వద్ద డ్యామ్ కడితే అవసరమైన నీటిని పూర్తిస్థాయిలో పంపింగ్ చేయడానికి అవకాశముంటుంది. టెండర్‌కు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నామని, ప్రభుత్వ ఉత్తర్వులు అందిన వెంటనే తుది నిర్ణయం తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణడ్డి ‘టీ మీడియా’తో చెప్పారు. ప్రాజెక్టుకు ప్రభుత్వం అంగీకరించినందుకు తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌డ్డి, వరంగల్ శాఖ కార్యదర్శి తోకల శ్రీనివాస్‌డ్డి, సీనియర్ రిటైర్డ్ అధికారి వెంకవూటామారావు ప్రభుత్వానికి, ప్రభుత్వ సలహాదారు అనంతరాములుకు కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష్యం నెరవేరాలంటే కాకతీయ కెనాల్ వరకు ఫేజ్-1ను చేపట్టాలని కోరారు.
Other News