విజయమ్మది దండయాత్రే
-
సీమాంధ్ర నేతలంతా ఒక్కటయ్యారు
- వైఎస్ హయాంలో సిరిసిల్లలో 215 చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు
- విజయమ్మా..! సిరిసిల్ల పర్యటనలో వైఎస్ నిర్వాకాలు చెబుతారా?: టీఆర్‌ఎస్ నేత బీ వినోద్‌కుమార్
హైదరాబాద్, జూలై 22 (టీ మీడియా): వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సీమాంధ్ర గూండాలను వెంటబెట్టుకొని, పోలీసుల అండతో తెలంగాణపై దండయావూతకు వస్తున్నారు. తెలంగాణపై వైఎస్సార్సీపీ వైఖరిని ముందు స్పష్టం చేశాకే విజయమ్మ తెలంగాణలో పర్యటించాలి. లేకుంటే ప్రజలు అడ్డుకుంటారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లకల్లోలం చేస్తే సహించేది లేదు’’ అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ పర్యటన నేపథ్యంలో తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. సీమాంధ్ర నాయకులు చంద్రబాబు, జగన్, సీఎం కిరణ్‌కుమార్‌డ్డిలంతా ఒక్కటయ్యారని ఆయన ఆరోపించారు.
విజయమ్మ పర్యటన ముసుగులో సీమాంధ్ర నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని తెలంగాణవాదులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న కాలంలోనే సిరిసిల్లలో 215 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కార్మికులకు అనేక హామీలిచ్చి.. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. విజయమ్మ సిరిసిల్ల దీక్షకు వచ్చి ఏం చెబుతారు? భర్త వైఎస్సార్ చేసిన నిర్వాకాలను చెబుతారా..! ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల పేర్లను దీక్షలో చదువుతారా?’’ అని ఆయన ప్రశ్నించారు.
గతంలో చిరంజీవి, ప్రస్తుతం విజయమ్మ సిరిసిల్లలో పర్యటించడం చేనేత కార్మికుల దయనీయ పరిస్థితి ఇదీ అని వెక్కిరించడానికా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేసినందునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అడుగడుగునా వైఎస్సార్సీపీ నాయకులకు అండగా నిలుస్తున్నారని, అందులో భాగంగా విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు వేలాది మంది పోలీసుల భద్రతను కల్పిస్తున్నారని ఆరోపించారు. తమ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ. 50లక్షలతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేశామని, ఈ నిధులతో వారు పనులు చేసుకుంటున్నారని తెలిపారు. వినోద్ వెంట టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గువ్వల బాలరాజు, చిలకమర్రి నర్సింహ, ఆర్వీ మహేందర్‌కుమార్ ఉన్నారు.
Other News