Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> >>
వైఖరి చెప్పకుంటే ప్రజలు అడుగడుగునా నిలదీస్తరు

-TJACKODA talangana patrika telangana culture telangana politics telangana cinema
జేఏసీ చైర్మన్ కోదండరాం

సిరిసిల్ల, జూలై 21 (టీ మీడియా): తెలంగాణపై వైఖరి స్పష్టం చేయకుంటే విజయమ్మను అడుగడుగునా ప్రజలు నిలదీస్తరని, సూరత్‌లా సిరిసిల్ల వస్త్ర పరిక్షిశమ అభివృద్ధి చెందకపోవడానికి, నేతన్నల ఆత్మహత్యలకు సీమాంధ్ర పాలకుల పాపమే కారణమని జేఏసీ చైర్మన్ కోదండరాం ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆయన మాట్లాడారు. విజయమ్మ రాజన్న ఆలయానికి వచ్చి కోడెను కట్టేస్తానంటే తమకేమీ అభ్యంతరం లేదని, రాజకీయంగా దీక్షలు చేపడుతున్న విజయమ్మను తెలంగాణపై వైఖరి స్పష్టం చేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో దీక్షలు చేసుకునే హక్కు పార్టీలకుంటుందని, అయితే ఎక్కడైతే దీక్షలు చేస్తున్నారో అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా అభివూపాయాలను వెల్లడించాల్సిన అవసరముందన్నారు. రాజకీయ పరమైన విషయంలో తమ అభివూపాయాలను తేల్చుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత ప్రజలకుంటుందన్నారు.

తెలంగాణపై తమ వైఖరి స్పష్టం చేయాలని కోరుతున్నామే తప్ప మరేమీ అడగడం లేదన్నారు. పరకాల ఎన్నికల సభలో తెలంగాణపై మాట్లాడిన వ్యాఖ్యాలను లిఖిత పూర్వకంగా కేంద్రానికి రాసి ఇచ్చి తెలంగాణకు వస్తే స్వాగతిస్తామన్నారు. తెలంగాణను అడ్డుకున్నది వైఎస్ కుటుంబమే కావడం వల్ల ప్రజలు కూడా వారినే ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో సిరిసిల్లకు వస్తున్న విజయమ్మను దారిపొడువునా నిలదీసి ప్రశ్నిస్తారన్నారు. దక్కన్ పీఠ భూమికే తలమానికమైన సిరిసిల్ల వస్త్ర పరిక్షిశమ వెనుకబాటుకు ఇక్కడి నేతన్నల దయానీయ పరిస్థితులకు సీమాంధ్ర పాలకులే కారణమన్నారు. సిరిసిల్ల సీమాంవూధలో ఉంటే కార్మికుల పరిస్థితి ఈ విధంగా ఉండేదా అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో ఉద్యమంలో పాల్గొన్న అనేక మందిని అరెస్టు చేసి జైలు పాలు చేశారని ధ్వజమెత్తారు.

ఎంతో మంది స్వరాష్ట్రం కోసం పోరాటాలు చేస్తూ, బలిదానాలు చేసుకున్నారు కాబట్టే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని నాలుగున్నర కోట్ల మంది ప్రశ్నిస్తున్నారన్నారు. ఇప్పటికైనా విజయమ్మ తమ వైఖరి స్పష్టం చేసి అడుగుపెట్టాలని, లేదంటే కరీంనగర్, నిజామాబాద్, మెదక్ దారి పొడవునా ప్రజలు అడ్డుకొని నిలదీస్తరని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ జిల్లా చైర్మన్ వెంకటమల్లయ్య, రాచర్ల వెంకన్న, ఆకునూరి శంకరయ్య, చెక్కిళ్ల మహేశ్‌గౌడ్, బొంపెల్లి రవీందర్‌రావు, సైద్‌ఖాన్ పాల్గొన్నారు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine