Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> >>
పారిక్షిశామిక పెట్టుబడుల్లోనూ తెలంగాణకు అన్యాయం

- పారిక్షిశామిక మంత్రులు తెలంగాణ వారే.. అయినా చిక్కని పెట్టుబడులు
- భాగస్వామ్య సదస్సు ప్రతిపాదనల్లోనూ దగా
- మొత్తం ప్రతిపాదనలు 265..తెలంగాణకు 65.. సీమాంవూధకు 200
- లక్ష కోట్లలోపు తెలంగాణకు.. ఐదున్నర లక్షల కోట్లకుపైగా సీమాంవూధకు
- ప్రారంభమైన నాలుగు కంపెనీలు సీమాంవూధలోనే

హైదరాబాద్, జూలై 22 (టీ మీడియా): రాష్ట్రంలో పారిక్షిశామిక పెట్టుబడుల్లోనూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సువల్ల ఆశించిన పెట్టుబడులు రాలేదు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిక్షిశామికవేత్తలు సిద్ధంగా ఉన్నప్పటికీ సీమాంధ్ర సర్కారు చేస్తున్న కుట్రవల్ల పెట్టుబడులు రావడంలేదు. భారీ, చిన్న తరహా పరిక్షిశమల శాఖలకు సారధ్యం వహిస్తున్నది తెలంగాణ ప్రాంత మంత్రులే. అయినా ఈ ప్రాంతానికి ఆశించిన స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడంలేదు. నేను తెలంగాణ బిడ్డనే అని చెప్పుకుంటున్న సీనియర్ మంత్రి గీతాడ్డి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ప్రతిపాదనల్లోనే తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈ సదస్సులో 265 యూనిట్లను పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. కానీ వీటిలో తెలంగాణ ప్రాంతానికి వచ్చినవి కేవలం 65 ప్రతిపాదనలు మాత్రమే.

రాష్ట్రవ్యాప్తంగా రూ.6,49,432.38 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు రాగా, వీటిలో తెలంగాణ ప్రాంతానికి రూ.95,163.85 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్నిబట్టి సీమాంవూధకు ఐదున్నర లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. తెలంగాణ ప్రాంతానికి వచ్చిన అరకొర పెట్టుబడి ప్రతిపాదనల్లోనూ రంగాడ్డి జిల్లాలో రూ.51,105 కోట్లు, హైదరాబాద్- రూ.12,292.88 కోట్లు వచ్చాయి. మిగిలిన తెలంగాణ జిల్లాల కోసం వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలు కేవలం రూ.30 వేల కోట్లు మాత్రమే. హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ఎప్పటి నుంచో ఎక్కువగా పారిక్షిశామిక వాడలున్నాయి. అయితే ఈ జిల్లాల్లో కూడా పెట్టుబడి ప్రతిపాదనలు పెద్దగా రాలేదు. దీన్నిబట్టి సీమాంధ్ర సర్కారు కుట్ర బయటపడింది. ఎందుకంటే ఎంతో కాలంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న పారిశ్రామిక వాడలు ఈ రెండు జిల్లాలోనే ఉన్నాయి.

అందువల్ల పారిక్షిశామిక వేత్తలు తమ పెట్టుబడులను పెట్టేందుకు ముందుగా వీటిపైనే దృష్టి సారించాలి. కానీ వాస్తవానికి ఆ విధంగా జరగడం లేదు. అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు జరిగి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో చిత్తూరు జిల్లాలో మూడు కంపెనీలు ఉండగా, మిగిలిన ఒక్క కంపెనీ నెల్లూరు జిల్లాలో ఉంది. దీంతో తెలంగాణ ప్రాంతానికి వచ్చిన 65 ప్రతిపాదనల్లో ఒక్క కంపెనీ కూడా ప్రారంభం కాలేదని సర్కార్ చెప్పిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల్లో కనీసం ఒక్క కంపెనీ కూడా సర్కార్‌తో అంగీకార ఒప్పందం కూడా చేసుకోలేదు.

దీంతో ఎప్పుడు ఈ ప్రతిపాదనలను మొదలుపెడతారో తెలియడంలేదు. అధికారులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి సొంత జిల్లా చిత్తూరుపై చూపిస్తున్న ప్రేమ మిగతా జిల్లాలపై కొరవడింది. వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను ఎక్కువగా కల్పించనున్నట్లు బీరాలు పలికిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేకపోతుంది. పారిక్షిశామిక శాఖలకు తెలంగాణ మంత్రులే ఉన్నప్పటికీ ఈ ప్రాంతాల్లో పెట్టుబడులపై దృష్టి సారించలేకపోతున్నారు. ఆ మంత్రుల పేషీల్లో మొదలుకొని కమిషనరేట్ వరకూ సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనమే నడుస్తోంది. దీన్నిబట్టే తెలంగాణ మంత్రులు ఈ ప్రాంత అబివృద్ధి కోసం ఏ మాత్రం పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine