ఫీజుల దోపిడీ నియంవూతణకు సమగ్ర చట్టం తేవాలి

- విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి
- స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
- కార్పొరేట్ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకోవాలి.పభుత్వమే నడిపించాలి
- విద్యార్థి సంఘాల నేతల డిమాండ్
- విజయవంతమైన విద్యాసంస్థల బంద్
- సర్కారు దిష్టిబొమ్మల దహనం.. పిండ ప్రదానం
- స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక
టీ మీడియా, నెట్‌వర్క్: ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను విడనాడాలని, పాఠ్యపుస్తకాల సరఫరా సక్రమంగా చేపట్టాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజలు పెంపును అరికట్టాలని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ప్ర భుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంగళవారం పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐడీఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ పాటించారు. పలుచోట్ల విద్యార్థులు తరగతులు బహిష్కరించి రాస్తారోకో, మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి పిండ ప్రదానం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని నియంవూతిస్తూ సమగ్ర చట్టం తేవాలని, స్కాలర్‌షిప్, ఫీజుల రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని నినదించారు. నిబంధనలను అతిక్షికమించి ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో కౌన్సెలింగ్‌కు ముందే సీట్లను అమ్ముకుంటున్నారని, విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని మండిపడ్డారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నడిపించాలని డిమాం డ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
మూతపడిన విద్యాసంస్థలు
వరంగల్ జిల్లాలో స్వచ్ఛందంగా పాఠశాలలు మూసివేశారు. పలుచోట్ల విద్యార్థులు తరగతులు బహిష్కరించి రాస్తారోకోలు, ధర్నా చేశారు. హన్మకొండ చౌరస్తాలో నిర్వహించిన రాస్తారోకోను పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వదిలేశారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, వ్రైవేట్ విద్యాసంస్థలు పూర్తిగా బంద్ పాటించా యి. మునుగోడులో ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో ప్రభుత్వానికి పిండ ప్రదానం కార్యక్షికమాలు చేశారు. తిప్పర్తి, సూర్యాపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మెదక్ జిల్లా లో విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా సాగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలు తెరిచి ఉంచడంతో విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బంద్ చేయించారు. వనపర్తిలో రోడ్డుపై విద్యార్థి సంఘాలు రాస్తారోకో చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు ఘర్షణపడ్డారు. కల్వకుర్తిలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ మధ్య, బిజినేపల్లి మండలం పాలెంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఖమ్మం జిల్లాలో బంద్ విజయవంతమైంది. హైదరాబాద్‌లో విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించగా మరికొన్నింటిని విద్యార్థి సంఘాల నేతలు మూసివేయించారు. ఎల్బీనగర్‌లో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రుల క్వార్టర్లను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో అరెస్ట్ చేశారు. సచివాలయ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్‌లో విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించి నగరంలో ప్రదర్శన నిర్వహించారు. చౌరస్తాల వద్ద మానవహారం నిర్మించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. రంగాడ్డి జిల్లా జాతీయ రహదారులపై రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు.
Other News