|
|
విద్యుత్ సరఫరాలో సర్కారు విఫలం
- కరెంట్ కోతలపై వైఎస్సార్సీపీ నేతల మండిపాటు - తెలంగాణవ్యాప్తంగా సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నా టీ మీడియా, నెట్‌వర్క్: రాష్ట్రంలో రైతాంగంతోపాటు అన్ని వర్గాల ప్రజలను హడపూత్తిస్తున్న విద్యుత్ కోతలపై వైఎస్సార్సీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిరసన కార్యక్షికమాలు చేపట్టారు. కరెంట్ కోతలు ఎత్తివేసి సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మంలో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నాలో పార్టీ కేంద్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
నల్లగొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీరవోలు సోమిడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మెదక్‌లో జిల్లా కన్వీనర్ బట్టి జగపతి ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో, కరీంనగర్‌లో పార్టీ జిల్లా కన్వీనర్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో ఎస్‌ఈకి వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కామాడ్డిలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాలో పార్టీ జిల్లా కన్వీనర్ కాటిపల్లి వెంకటరమణాడ్డి పాల్గొనగా, రంగాడ్డి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. వరంగల్‌లోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ యూత్ విభాగం ఆధ్వర్యంలో బైఠాయించారు. ములుగు సబ్‌కపూక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్‌డ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హైదరాబాద్‌లో పార్టీ శ్రేణులు సబ్‌స్టేషన్లనుముట్టడించి నిరసన తెలిపారు.
Other News
|
|