అమరుల బంధుమివూతుల సంఘం దశాబ్ది మహాసభలు నేటి నుంచి

- బాబు, వైఎస్సార్ పాలనలో విప్లవకారులను చంపించారు
- పోస్టర్ ఆవిష్కరణలో విరసం నేత వరవరరావు
త్యాగరాయగాన సభ, జూలై 17 (టీ మీడియా): ఈ నెల 18, 19న అమరుల బంధుమివూతుల సంఘం దశాబ్ది(అమరుల బంధుమివూతుల సంఘం రెండవ రాష్ట్ర మహాసభ) మహాసభలు నగరంలో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గంటి ప్రసాదం, గాదె పద్మకుమారి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సికింవూదాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో పతాకావిష్కరణ, సంస్మరణ సభ జరుగుతుందని, గురువారం ఉదయం 10గంటల నుంచి బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభలు ప్రారంభమవుతాయని వారు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ‘ప్రజా ఉద్యమాలు-రాజ్యనిర్భంధం’ పై సదస్సు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విరసంనేత వరవరరావు, జే మాధవి, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో నాగాలాండ్, కాశ్మీర్, జార్ఖండ్ ఉద్యమ ప్రతినిధులు పాల్గొననున్నట్లు చెప్పారు. అదేరోజు సాయంత్రం 6గంటలకు బహిరంగసభ ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో మహాసభల పోస్టర్‌ను విరసం నేత వరవరరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రీన్‌హంట్ వ్యతిరేక చైతన్యంతో అమరులను స్మరించుకునేందుకు ఈ సభలు దోహదపడతాయని తెలిపారు. అమరుల బంధుమివూతుల సంఘం రెండవ రాష్ట్ర మహాసభలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేథావులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Other News