అపూర్వ సంపద.. ఇక భద్రం!
-ఆర్కివ్స్ డాక్యుమెంట్ల డిజిటలైజేషన్‌కు రంగం సిద్ధం
-పదేళ్ల ప్రాజెక్టు... ఏటా రూ. రెండు కోట్లు ఖర్చు
-ప్రస్తుతం రూ. రెండు కోట్లు విడుదల
-పర్యవేక్షణకు నిపుణుల కమిటీ
-ఆర్కివ్స్‌లో డాక్యుమెంట్ల సంఖ్య 50 మిలియన్లు!
హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా): రాష్ట్ర ఆర్కివ్స్‌లోని లక్షలాది డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. పదేళ్లలో మొత్తం డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏటా రూ. రెండు కోట్లు విడుదల చేసేందుకు అంగీకరిచింది. పదేళ్లలో రూ. 20 కోట్ల వ్యయం చేసి మొత్తం ఆర్కివ్స్‌లోని విలువైన, ప్రామాణికమైన, ప్రశస్తమైన, చారివూతాత్మక డాక్యుమెంట్లన్నింటినీ డిజిటలైజ్ చేయనున్నారు. రాష్ట్ర ఆర్కివ్స్‌లో 50 మిలియన్‌ల రికార్డులు ఉన్నాయి. ఇందులోని చాలా రికార్డులు శిథిల దశకు చేరుకున్నాయి. శిథిలమవుతున్న రికార్డుల దుస్థితిని రాష్ట్ర ఆర్కివ్స్ అధికారులు రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు వివరిస్తూ వచ్చారు.
ఆర్కివ్స్ నిపుణులు, చరిత్ర అభిమానులు.. శిథిల దశకు చేరుకుంటున్న రికార్డుల పరిస్థితులను ముఖ్యమంవూతికి ఎన్నో సందర్భాల్లో వివరించారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే డిజిటలైజేషన్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం రూ. రెండు కోట్లు విడుదల చేసింది. దేశంలో నంబర్ వన్ స్థానాన్ని, ప్రపంచంలో పదోస్థానాన్ని దక్కించుకున్న మన ఆర్కివ్స్‌లోని డాక్యుమెంట్లను కంప్యూటరైజ్ చేయడానికి ఎట్టకేలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇక్కడ క్రీ.శ. 1407 నుంచి రికార్డులు ఉన్నాయి. రాజులు, చక్రవర్తులు జారీ చేసిన ఫర్మానాలు, కైఫీయతులు, ముంతకబ్‌లు, మొగలాయి చక్రవర్తుల కాలంనాటి ‘షిహానామా’లు ఆర్కివ్స్‌లో నిక్షిప్తంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చరిత్ర భాండాగారంగా వినుతికెక్కిన ఈ విభాగంలోని చరిత్ర పేజీలన్నింటినీ డిజిటలైజ్ చేసేందుకు రాష్ట్ర ఆర్కివ్స్ శాఖ గతంలోనే కార్యాచరణను రూపొందించింది.
ఈ ప్రాజెక్ట్‌ను నిరంతరం పర్యవేక్షించేందుకు పురోగతిలో సాయపడేందుకు, విలువైన సూచనలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో సలహాసంఘాన్ని ఏర్పరిచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్సలర్ సులేమాన్ సిద్ధిఖీ, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డా వైకుంఠం, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌వూపకాశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు డా ఏ సత్యనారాయణ, ట్రిబుల్‌ఐటీ ప్రొఫెసర్ టీవీ జవహర్, సమాచార శాఖ చీఫ్ ఇంజినీర్ కిషోర్‌బాబు, ఆర్కివ్స్ మాజీ కమిషనర్ డా హెచ్ రాజేంవూదవూపసాద్, ఆర్కివ్స్ డిప్యూటీ డైరెక్టర్ రంగరాజ్ తదితరులు ఈ సలహా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఆర్కివ్స్ డైరెక్టర్ జరీనా పర్వీన్ ఈ సలహాసంఘానికి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సలహాసంఘాన్ని ఏర్పరిచినట్లుగా శుక్రవారం జీవో జారీ కానుంది.
నాడు ‘దఫ్తరీ-ఈ-దివానీ’
1894లో నిజాం ప్రభువులు తొలిసారి ‘దఫ్తరీ-ఈ-దివానీ’ పేరుతో చారివూతాత్మక రికార్డులను భద్రపరిచే శాఖను ఏర్పాటు చేశారు. తొలిరోజులలో రాజవంశాలకు సంబంధించిన రికార్డులను మాత్రమే భద్రపరిచేవారు. 1924లో ఈ శాఖకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. అప్పటినుంచి చరిత్ర గర్భంలో దాగిన ప్రాముఖ్యమైన అంశాలన్నింటినీ రికార్డు చేయడం ప్రారంభించారు. దీనినే 1950లో హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ రికార్డ్స్ ఆఫీసుగా తీర్చిదిద్దారు. 1978లో ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నాడ్డి ఈ శాఖకు ‘ఏపీ స్టేట్ ఆర్కివ్స్, రీసెర్స్ ఇన్‌స్టిట్యూట్‌ట్’ అని నామకరణం చేశారు. బహమనీ సుల్తానుల కాలం నుంచి అపురూపమైన డాక్యుమెంట్లు ఇక్కడ లభిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చే చరిత్ర పరిశోధకులు, పండితులు, విమర్శకులు ఈ ఆర్కివ్స్‌లో చదువుకొని, తెలుసుకొని, సరిచూసుకొని కొత్త పరిశోధనలను ప్రకటిస్తుంటారు. ఒక్క మొగల్ చక్రవర్తులకు సంబంధించినవే 1,55 వేల డాక్యుమెంట్లు రాష్ట్ర ఆర్కివ్స్‌లో పదిలంగా ఉన్నాయి. షాజహాన్, ఔరంగజేబ్ కాలంనాటి విలువైన ఫర్మానాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఢిల్లీ ఆర్కివ్స్‌లో కూడా లభించని అరుదైన, డాక్యుమెంట్లు ఇక్కడ అనేకం. నిజాం ప్రభువుల చరిత్ర దార్శనికతకు ‘దఫ్తరీ-ఈ-దివానీ’ దర్పణంగా నిలుస్తోంది..
Other News