సాయి రిసార్ట్‌లో అర్ధనగ్న నృత్యాలు
- పుట్టినరోజు వేడుక పేరిట శృంగార క్రీడ!
- 20 మంది యువతులు, 15 మంది యువకుల అరెస్టు
- 15 వాహనాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (టీ మీడియా): అర్ధనగ్న నృత్యాలకు వేదికైన నగర శివారులోని ఓ రిసార్ట్‌పై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువతులను, 15 మంది యువకులను అరెస్టు చేశారు. వారికి చెందిన 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన దేవిడ్డి వీరనారాయణడ్డి(32) తన పుట్టినరోజు సందర్భంగా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిగ్లిపురం గ్రామంలో గల సాయి స్వగృహ రిసార్ట్‌లో శుక్రవారం రాత్రి విందు ఏర్పాటుచేశారు. మందుతోపాటు యువతుల అర్ధనగ్న నృత్యాలూ ఏర్పాటు చేశారు. అక్బర్ మాము అనే వ్యక్తి ఆ యువతులను తెచ్చాడు. విందులో వీరనారాయణడ్డి స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం అలజడిగా మారడంతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కుమార్, ఎస్‌ఐ రఘుకుమార్ సిబ్బందితో కలిసి రిసార్ట్‌పై దాడి చేశారు. పోలీసుల రాక గమనించి కొందరు పారిపోయారు. పరారీలో ఉన్న రిసార్ట్ నిర్వాహకులు శ్రీనివాస్‌డ్డి అలియాస్ కేఎస్ రెడ్డితోపాటు మరో ఇద్దరు భాగస్వాములను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో అల్కహాల్, డ్రగ్స్, బిర్యానీ, మాంసం, సీడీలు, యువతుల దుస్తులు, హుక్కా, పర్‌ఫ్యూమ్స్, కాస్మొటిక్స్ వస్తువులు, రిసోర్ట్స్ పక్కనున్న చిన్న హాళ్లలో పరుపులు, మల్లెపూలు, కాస్మోటిక్స్, నిరోధ్ ప్యాకెట్లు, దుస్తులు లభించినట్లు ఎల్బీనగర్ డీసీపీ నాగేంవూదకుమార్, వనస్థలిపురం ఏసీపీ రామచంవూదరావు, శ్రీనివాస్‌కుమార్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Other News