|
|
వనరులు దోచుకునేందుకే
టైగర్‌జోన్ల ఏర్పాటు
- చెంచుల సొంత ఆలయం శ్రీశైలం - ‘శ్రీశైలం గుడి- చెంచుల హక్కు’ సదస్సులో పలువురు వక్తలు హిమాయత్‌నగర్, జూన్ 23 (టీ మీడియా): అరణ్యాలలోని వనరులను దోచుకునే ప్రయత్నంలో భాగంగానే టైగర్‌జోన్‌లను సృష్టించి చెంచు జాతి అంతానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందని పలువురు వక్తలు ఆరోపించారు. తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘‘శ్రీశైలం గుడి-చెంచుల హక్కు’’ అనే అంశంపై శనివారం చంద్రం భవన్‌లో చర్చావేదిక నిర్వహించారు. చెంచుల సంస్కృతిలో భాగమైన మల్లన్న దేవాలయం చెంచుల దేవాలయంగా పాలకుర్తి సోమనాధుడు లాంటి వారు రచించిన గ్రంథాలలో పేర్కొన్నారని తెలిపారు. చరివూతలో శ్రీశైలం చెంచుల సొంత ఆలయంగా ఉండేదని, కానీ 1940 మధ్యలో ఎండోమెంట్ శాఖ వారు ఆ ఆలయాన్ని స్వాధీనం చేసుకొన్నారని అప్పటినుంచి ఆదివాసేతరులు అధికారం చెలాయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని చెంచుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్షికమంలో చారివూతక పరిశోధకుడు, కవి కపిలవాయి లింగమూర్తి, ఓయూ ప్రొఫెసర్ జీ సత్యనారాయణ, రవి మాస్టర్, ఆదివాసి అధ్యయన వేదిక నేత డాక్టర్ దయానంద స్వామి మాట్లాడారు. ఈ చర్చా వేదికలో టీఆర్‌సీ చైర్మన్ ఎం వేదకుమార్, కో-ఆర్డినేటర్ బీ సోమేశ్వర్ పాల్గొన్నారు.
Other News
|
|