టెన్షన్
స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఓటరు తీర్పు
- రేపు ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన
- టెన్షన్ తట్టుకోలేక పోతున్న నేతలు
- ఓటింగ్ సరళిపై ఆరాలు, విశ్లేషణలు.. బిజీబిజీగా నాయకగణాలు
- గెలుపోటములపై ఊహాగానాలు..ఫలితాల తరువాత సర్కారు ఉంటుందా?
- భద్రంగా ఓటరు తీర్పు.. రేపు ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన
- టెన్షన్ తట్టుకోలేక పోతున్న నేతలు..ఓటింగ్ సరళిపై ఆరాలు, విశ్లేషణలు
- బిజీబిజీగా నాయకగణాలు..గెలుపోటములపై ఊహాగానాలు
- ఫలితాల తరువాత సర్కారు ఉంటుందా?
హైదరాబాద్, జూన్ 13 (టీ న్యూస్): ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక లోక్‌సభ నియోజకవర్గం, 18 అసెంబ్లీ నియోజవర్గాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. ఓటర్ల తీర్పు స్ట్రాంగ్ రూమ్‌లో భద్రంగా ఉంది. ఓటర్ల తీర్పు వెలువడటానికి మరో 24 గంటలు సమయం ఉంది. అప్పటి వరకు అందరూ వేచి చూడాల్సిందే. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2014 సాధారణ ఎన్నికలకు వీటిని రిహార్సల్స్‌గా భావిస్తున్నారు. అందుకే వైఎస్‌ఆర్సీ, టీడీపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను చావుబతుకుల సమస్యగా తీసుకొని పనిచేశాయి. ఓటింగ్ ముగిసిన దగ్గర నుంచీ ఆయా పార్టీల నేతలు ఓటింగ్ సరళిని విశ్లేషించే పనిలో బిజీగా ఉన్నారు. ఉపఎన్నికలు జరిగిన అన్ని నియోజకవర్గాలలో తాము సునాయసంగా గెలుస్తామని వైఎస్‌ఆర్సీ ధీమా వ్యక్తం చేస్తున్నది.
అయితే తెలంగాణలోని పరకాలలో మాత్రం టీఆర్‌ఎస్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నట్లు నాయకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ యువకులు, మహిళలు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని తెలంగాణకు ఓటు వేశారని వారు భావిస్తున్నారు. అంతర్గతంగా ఈ సీటుపై ఆశలు వదులుకున్న జగన్ పార్టీ నేతలు.. బయటకు మాత్రం తాము గెలుస్తామని అంటున్నారు. అలాగే సీమాంవూధలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వైఎస్ మరణం, జగన్ అరెస్టు నుంచి సంపాదించిన ప్రజాసానుభూతి బలంగా ఉందని, ఇదే తమ పార్టీని గెలిపిస్తున్నదని వైఎస్‌ఆర్సీ నేతలు అంటున్నారు. ఇది ఇలా ఉండగా కనీసం మూడు స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ అంటోంది. ముఖ్యంగా తిరుపతి, నరసాపురం, రామచంవూదాపురంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నది. అలాగే టీడీపీ ప్రత్తిపాడు, మాచర్ల, పాయకరావుపేటలో గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నది. ఆయా నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులు గట్టి వాళ్లని, దీనికి తోడు ఆయా సామాజికవర్గాల ఓట్ల ప్రభావం తమపై ఉందని అంటున్నారు. ఈ మేరకు టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో ఏ విధంగా ఓట్లు పోలయ్యాయో విశ్లేషిస్తున్నారు.
పోలింగ్ కేంద్రం స్థాయి నాయకులతో నేరుగా మాట్లాడుతున్నారు. పోలింగ్ ఏజెంజ్ల వద్ద నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాటిని క్రోడీకరించడం ద్వారా తమ తమ విశ్లేషణలు చేస్తున్నారు. కాగా టీఆర్‌ఎస్ మాత్రం తెలంగాణవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు ఓటర్లను వైఎస్‌ఆర్సీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వారంతా టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి తెలంగాణ ఆకాంక్షను తెలియజేశారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గెలుపు అన్నది ముఖ్యం కాదని, ఎంత మెజార్టీ వస్తుందన్న దానిపైనే తాము దృష్టి సారించామని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో లగడపాటి సర్వేలాగే ఫలితాలు వెలువడితే ఈ ప్రభుత్వం ఉంటుందా? కూలుతుందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. వైఎస్‌ఆర్సీ ఈ ఉప ఎన్నికల్లో 12 నుంచి 16 స్థానాల మధ్య గెలిస్తే ఎంత మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ వెంట వెళతారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే అధికార పార్టీ నుంచి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు జగన్‌తో టచ్‌లో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.
ఫలితాల తరువాత వీరు ఆ వైపు టర్న్‌తీసుకుంటే సర్కారు మైనార్టీలో పడుతుందన్న చర్చ జరుగుతోంది. సర్కారు మైనార్టీలో పడినా, 30 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినా సర్కారు కూలే అవకాశం ఉండదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు జగన్‌వైపు జంప్ అయితేనే మార్పు జరిగే అవకాశం ఉంటుందని చర్చిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ కూడా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండదని, అలాంటప్పుడు టీడీపీ కావాలని ఎన్నికలు కోరుకోదు కదా? అని అంటున్నారు. వైఎస్‌ఆర్సీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెడితే ఓటింగ్‌లో టీడీపీ గైర్హాజరైతే సభలో ఉన్న ఎమ్మెల్యేలో కాంగ్రెస్‌కే మెజార్టీ ఉంటుందని అంటున్నారు. వైఎస్‌ఆర్సీ ఈ ఉప ఎన్నికల్లో స్వీప్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ఢోకా ఏమీ ఉండదని అంటున్నారు. ఇలా రాజకీయ పరిణామాలు, గెలుపోటములపై రాజకీయ పార్టీల నేతలు, రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు.
Other News