24 గంటల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు
-కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
-నగరంలో చిరుజల్లులు.. తెలంగాణలో తగ్గుతున్న ఉష్ణోక్షిగతలు
బేగంపేట్, జూన్ 9 (టీ న్యూస్): రాష్ట్రంలోకి మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ బేగంపేట్‌లోని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. మొదట రాయలసీమ, దక్షిణకోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన, ఉపరితల ద్రోణులు స్థిరంగా కొనసాగుతున్నాయి. వీటికితోడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్క వానలు, క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఉన్న చోట పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి వల్ల ఉష్ణ్రోక్షిగతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఉప్పల్, వారాసిగూడ, రామంతాపూర్, దిల్‌సుఖ్‌నగర్, నాచారం, రాంనగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. హైదరాబాద్‌లో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోక్షిగత నమోదైంది. అలాగే నిజామబాద్ 40, మహబూబ్‌నగర్ 38, ఖమ్మం 41, రామగుండం 42, కరీంనగర్, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయి. మరో వారం రోజుల్లో ఉష్ణోక్షిగతలు మరింత తగ్గుతాయని అధికారులు తెలిపారు.
కాకినాడలో ఎడతెరిపిలేని వర్షం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తడిసిముద్దవుతోంది. ఎడతెరిపిలేని వానతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన జల్లులు శనివారం కూడా కొనసాగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. ఇన్నాళ్లు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన జనం.. వర్షం రాకతో ఆనందంలో మునిగితేలుతున్నారు. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.
Other News