కరీంనగర్ : జిల్లాలోని ధర్మారం మండలం మేడారం గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైన ఆహారం తినడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.