నేడు ఓఎంసీ నిందితులను విచారించనున్న ఈడీ అధికారులు
హైదరాబాద్: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులను కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నారు. ఈమేరకు వారికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. దీంతో వారు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీలను ప్రశ్నించాలని నిర్ణయించారు. ఈ ఉదయం నిందితులు ఉంటోన్న చంచల్‌గూడ జైలుకు ఈడీ అధికారులు చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వారిని అధికారులు ప్రశ్నిస్తారు. కాగా, అక్రమాస్తుల కేసులో కడప ఎంపీ వైఎస్ జగన్‌తోపాటు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, బీపీ ఆచార్యలను 25 తేదీన ఈడీ బృందం ప్రశ్నించనుంది.
Other News