హైదరాబాద్: గుర్తు తెలియని దుండుగులు ఓ బాలుని కిడ్నాప్ చేశారు. కర్మన్‌ఘాట్‌లోని గ్రీన్‌పార్క్ కాలనీ రోడ్డు నెంబరు 4లో 12 ఏళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్ చేసిన యువకుడు బాలున్ని ఓ గదిలో బందించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు కిడ్నాపర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.