హైదరాబాద్: దేవాలయంలో దొంగలు పడి దోచుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబరు 2లో ఉన్న రామాలయంలో దొంగతనం జరిగింది. అర్దరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు ఎనిమిది కిలోల వెండి అభరణాలు దోచుకెళ్లారు. ఉదయం ఆలయం తలుపులు తెరచి ఉండటం చూసిన పూజారి పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.